JR ntr open up on tarakaratna Health condition
Jr NTR : నందమూరి హీరో తారకరత్న గుండెపోటుతో బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన హెల్త్ చాలా సీరియస్ గా ఉందని తెలియడంతో సినీ, రాజకీయ వర్గాలతో పాటు నందమూరి ఫ్యామిలీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా తారకరత్నను చూసేందుకు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ ఫ్యామిలీతో కలిసి బెంగళూరుకి వెళ్లారు.తారకరత్న క్రిటికల్ కండీషన్ నుండి బయటపడ్డారని చెప్పలేం. విషమంగా ఉన్నప్పటికీ వైద్యానికి స్పందిస్తూనే ఉన్నారు.మెరుగైన వైద్యం అందుతుంది.
JR ntr open up on tarakaratna Health condition
ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధించాలని ఎన్టీఆర్ కోరారు.వైద్యంతో పాటు,ఆత్మ బలం, మనోబలం, తాతగారితో పాటు ఎంతో ఆశీర్వాదం మా అన్నకి ఉంది. ఇంతకముందు మాదిరిగానే ఆయన మాతో కలిసి తిరుగుతారు అని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి కొంత మంది డాక్టర్స్ కూడా ఈ ఆసుపత్రికి వచ్చి ట్రీట్‌మెంట్ వచ్చి వైద్యం అందించే ఛాన్స్ ఉంది అని ఎన్టీఆర్ అన్నారు. కళ్యాణ్ రామ్ సైతం ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తారకరత్న పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. ఇక బాలయ్య అంతకముందు మాట్లాడుతూ.. స్టెంట్ వేయడం కుదరలేదు, కోలుకోవడానికి సమయం పడుతుంది.
JR ntr open up on tarakaratna Health condition
ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసి ఎన్టీఆర్ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై కుటుంబ సభ్యులు, వైద్య బృందాన్ని అడిగి ఎన్టీఆర్ కనుకున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి, పిల్లలకు ఎన్టీఆర్ సోదరులు ధైర్యం చెప్పారు. జూనియర్ వెంట ఆయన సతీమణి ప్రణతి కూడా ఉన్నారు. మరోవైపు.. ఇవాళే బాలయ్య సతీమణి వసుంధర , కుమార్తె బ్రహ్మణి కాసేపటి క్రితమే ఆస్పత్రికి చేరుకుని తారకరత్నను పరామర్శించారు.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.