Home » Entertainment » Jr Ntr Song Video Edit Version
Entertainment

JR NTR : కొమురం భీముడో సాంగ్ .. కిస్ మీ యాడ్ వ‌ర్షెన్‌లోకి మారితే..!

Authored By
Sam C
The Telugu News | Updated on: September 18, 2022, 7:59 pm
Advertisement

JR NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలోని ప్ర‌తి పాట ఆణిముత్యాలే. నాటు నాటు, కొమ్మ ఉయ్యాల, దోస్తీ వంటి పాటలు విడుదలై యూట్యూబ్‌లో కేక పెట్టించ‌గా, కొమురం భీముడో అంత‌కు మించి అన్న‌ట్టుగా సాగింది. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా కీరవాణీ కొడుకు భైరవ పాడారు.
అదిరిపోయింది..

Advertisement

అయితే ఈ పాట చూస్తున్నంత సేపు ప్ర‌తి ఒక్క‌రు ట్రాన్స్‌లోకి వెళ్లిపోతారు. ఈ పాటతో ఎన్టీఆర్ త‌న న‌ట విశ్వ‌రూపం మొత్తం చూపించాడు. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ చూపించిన హావ భావాలు చూసి కంట‌తడి పెట్టని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. ఈ సాంగ్ ఇప్ప‌టికీ ఏదో ఒక మూల ఏదో ఒక విధంగా వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన‌ కొత్త వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ కొమురం భీముడో పాట‌కు డైరీ మిల్క్ యాడ్లోని కిస్ మీ క్లోజ్ యువ‌ర్ ఐస్ సాంగ్‌ని మిక్స్ చేసిన ఎడిటింగ్ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

Advertisement

దీనిపై ప‌లువురు నెటిజ‌న్లు స్పందిస్తూ సాంగ్‌కు ఎన్టీఆర్ లిప్ మూవ్‌మెంట్ క‌రెక్ట్ గా సింక్ అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైనకొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఆస్కార్ నామినేష‌న్‌లోకి కూడా వెళ్లాడు. ఇక ప్ర‌స్తుతం జూనియ‌ర్ కొర‌టాల శివ సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి