Bimbisara : బింబిసార గురించి మరీ ఎక్కువ మాట్లాడేసిన ఎన్టీఆర్‌

Authored By aruna | The Telugu News | Published on: July 30, 2022, 2:20 pm

Bimbisara : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఎప్పటిలాగే నందమూరి హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కోసం ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ సినిమా పై అంచనాలు భారీగా పెంచే విధంగా మాట్లాడాడు. ఈ సినిమా మాది.. ఈ సినిమా యొక్క కంటెంట్ అద్బుతంగా ఉంది అంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి.

ఈసినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదంటూ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు నందమూరి కళ్యాణ్రామ్ కెరియర్ ఒక ఎత్తు అయితే బింబిసార సినిమా తర్వాత ఆయన కెరియర్ మరో ఎత్తు అన్నట్లుగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగే విధంగా చేసింది. మరీ ఎన్టీఆర్ ఎక్కువ మాట్లాడాడు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం.

Jr NTR speech about Bimbisara Movie at Pre release event

Jr NTR speech about Bimbisara Movie at Pre release event

నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. ఆయినా కూడా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమాను ఒకసారి చూద్దాం అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల మనసులో అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ వ్యాఖ్యలు సినిమాకు ఎంత వరకు వర్కవుట్ అవుతాయి, సినిమా ఎలా ఉంటుంది అనేది వచ్చే వారంలో సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఆ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp