Jr Ntr : ఎప్పుడు కాలర్ నేను ఎగరేస్తా.. అన్నా.. ఈసారి నీవు కాలర్ ఎగిరేయ్ : ఎన్టీఆర్
ప్రధానాంశాలు:
Jr Ntr : ఎప్పుడు కాలర్ నేను ఎగరేస్తా.. అన్నా.. ఈసారి నీవు కాలర్ ఎగిరేయ్ : ఎన్టీఆర్
Jr Ntr : నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తల్లిగా, పోలీస్ అధికారిగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న రిలీజ్ కి రెడీ అవుతుండడంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

Jr Ntr : ఎప్పుడు కాలర్ నేను ఎగరేస్తా.. అన్నా.. ఈసారి నీవు కాలర్ ఎగిరేయ్ : ఎన్టీఆర్
Jr Ntr బ్రోమాన్స్ అదిరింది..
ఎన్టీఆర్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. విజయశాంతి గారు ఈ వేదికపై ఉండడం వల్ల నాన్నగారు లేరు అనే లోటు తీరింది అని ఎన్టీఆర్ తెలిపారు. ఈ ఈవెంట్ కి హాజరు కావడం అనే సంతోషం కంటే ఇంకాస్త ఎక్కువ సంతోషం ఉంది నాకు. దానికి కారణం ఈ చిత్రాన్ని ముందే చూశాను. విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు అని తారక్ తెలిపారు. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు ప్రతి ఒక్కరూ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేశారు అని తారక్ పేర్కొన్నారు.
ఇక వేదికపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బ్రోమాన్స్ ఫ్యాన్స్ కి కనుల విందుగా మారింది అని చెప్పాలి. రాసి పెట్టుకోండి చివరి 20 నిమిషాల చిత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా సన్నివేశాలు ఉంటాయి. ప్రతిసారి నేను కాలర్ ఎగరేస్తాను.. ఈసారి అన్న కళ్యాణ్ రామ్ గారు కాలర్ ఎగరేస్తారు అని ఎన్టీఆర్ అనడంతో.. కళ్యాణ్ రామ్ సిగ్గు పడ్డారు. ఎన్టీఆర్ స్వయంగా కళ్యాణ్ రామ్ కాలర్ పట్టుకుని ఎగరేసిన దృశ్యాలకు ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.
కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసిన జూనియర్ ఎన్టీఆర్
ఎప్పుడు కాలర్ నేను ఎగరేస్తా.. అన్నా.. ఈసారి నీవు కాలర్ ఎగిరే అన్న @tarak9999 pic.twitter.com/Qk4IVtyeL9
— greatandhra (@greatandhranews) April 12, 2025