Ram Charan : రాజమౌళి కొడుకుపై రామ్ చరణ్ ఫైర్.. సెట్‌లోని గుట్టు విప్పిన ఎన్టీఆర్
Ram Charan రాజమౌళి, రామ్ చరణ్ Ram Charan, ఎన్టీఆర్ Jr NTR కాంబినేషన్‌లో ఆర్ఆర్ఆర్ RRR సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. బిజినెస్ లెక్కలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సింది. ఆడియో రైట్స్ ధరలు చూసి అందరూ బిత్తరపోయారు. అలాంటి ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దసరా సందర్భంగా విడుదలకు రెడీ చేస్తున్న జక్కన్న ఇప్పుడు ఉక్రెయన్‌లో ఉన్నాడు.

Jr NTR Video of Ram Charan Fires On SS Karthikeya
రాజమౌళి కొడుకుపై రామ్ చరణ్ Ram Charan ఫైర్.. సెట్‌లోని గుట్టు విప్పిన ఎన్టీఆర్ Jr NTR
ఉక్రెయిన్‌లో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ RRR ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది. ఇందులో బ్రిటీష్ వారితో యుద్దం, ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫైటింగ్ సీన్లు ఇలా చాలానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఓ వైపు షూటింగ్ జరగుతూ ఉండగానే.. మరో వైపు సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. దీని కోసం జక్కన్న మంచి ప్లాన్ వేశాడు. ఆర్ఆర్ఆర్ ఇన్ స్టాగ్రాం ఖాతాను నటీనటులతో హ్యాండిల్ చేయిస్తున్నారు. మొన్నటి వరకు అలియా భట్‌తో ఆ ఖాతాను రన్ చేయించాడు. ఇక నేటి నుంచి ఆ బాధ్యతను ఎన్టీఆర్‌కు అప్పగించాడు.

Jr NTR Video of Ram Charan Fires On SS Karthikeya
అయితే ఎన్టీఆర్ మొదటి పోస్ట్ సంచలనంగా మారింది. సెట్ మీదకు వచ్చిన రామ్ చరణ్ తన ప్రాపర్టీస్ రెడీగా లేవని రాజమౌళి తనయుడు కార్తికేయ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. డ్రమ్స్ లేవు.. ప్రాక్టీస్ చేయమంటారు.. దసరాకే విడుదల అని అసహనం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఇలా వీడియోను బయటపెట్టి తన బాధ్యతను మాత్రం నెరవేర్చుకున్నాడు. ఇక ఈ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.
First Post by BHEEM… ????????❤️ #NTRInstaTakeoveRRR https://t.co/o89C8Axbk5#RRRMovie @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/8dYMqeCZpf
— VamsiShekar (@UrsVamsiShekar) August 9, 2021
]
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ కామెడీ షో పవిత్ర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> ఎంతో మందితో లింకులు పెట్టేశారు.. రూమర్లపై సునీత కామెంట్స్
ఇది కూడా చదవండి ==> సుడిగాలి సుధీర్‌ను మావయ్య అని పిలిచిన రష్మీ.. ఆ రిలేషన్‌కి అర్థమేమిటో..?
ఇది కూడా చదవండి ==> బెడ్‌పై బుట్టబొమ్మ అలా.. పూజా హెగ్డే పరువాల విందు.. వైరల్ ఫిక్స్ !