Singer Sunitha : ఎంతో మందితో లింకులు పెట్టేశారు.. రూమర్లపై సునీత కామెంట్స్
Singer Sunitha : సింగర్ సునీత రెండో పెళ్లి ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. సునీత మొదటి పెళ్లి, విడాకుల వ్యవహారం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్లు ఒంటరిగా ఉన్న సునీత చుట్టూ రకరకాల రూమర్లు వచ్చాయి. ఎవరి ఎవరితోనో లింకులు పెట్టి రూమర్లను రాసేశారు. అయితే సునీత మాత్రం ఏనాడు కూడా వాటిపై స్పందించలేదు. అలా సునీత రెండో పెళ్లి గురించి కూడా లెక్కలేనని వార్తలు వచ్చాయి. కానీ చివరకు సునీత అందరినీ ఆశ్చర్యపరిచింది.

Singer Sunitha About Rumors On Relationships
మీడియాలో ఎప్పుడూ కూడా తన మీద రకరకాల రూమర్లు వస్తుంటాయని, కానీ తన గురించి పూర్తిగా తెలిసిన వారెవ్వరూ కూడా వాటిని నమ్మలేదని సునీత పేర్కొంది. బయట వచ్చే రూమర్లపై ఏనాడూ కూడా తన సొంత వాళ్లు తనను ప్రశ్నించలేదని సునీత చెప్పుకొచెప్పింది. తానేంటో తన వాళ్లకు తెలుసు అని, అందుకే ఎప్పుడూ కూడా ఆ రూమర్ల గురించి చర్చలు రాలేదని, వచ్చినా కూడా వాళ్లు ఇంకా మానలేదు.. వెదవలు అలానే రాస్తున్నారు అని అనుకునే వాళ్లు అని తెలిపింది.
Singer Sunitha : ఎంతో మందితో లింకులు పెట్టేశారు.. రూమర్లపై సునీత కామెంట్స్

Singer Sunitha About Rumors On Relationships
తన మీద ఎన్నో రకాల వార్తలు రాశారని, ఎంతో మందితో లింకులు పెట్టి రూమర్లు క్రియేట్ చేశారని సునీత చెప్పుకొచ్చింది. కానీ అందులో నిజం లేదని అంది. తానెప్పుడైనా ఎవ్వరినైనా కలిస్తే.. అలాంటి రూమర్లు వస్తే.. ఓహో ఇలా అనుకున్నారా? అని వదిలేశాదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ తన గురించి తెలిసిన వాళ్లెవ్వరూ కూడా వాటిని నమ్మలేదని చెప్పుకొచ్చింది. తాను కూడా అలాంటి వాటిపై స్పందించకుండా అలానే ఉండటం మంచిదని వదిలేసినట్టు పేర్కొంది.