Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే?

 Authored By gatla | The Telugu News | Updated on :14 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  రిషి గురించి శైలేంద్రను రిక్వెస్ట్ చేసి అడిగిన వసుధార

  •  ఎండీ సీటు కావాలని వసుధారను అడిగిన శైలేంద్ర

  •  ఎండీ సీటు శైలేంద్రకు ఇచ్చేస్తా అన్న వసుధార

Guppedantha Manasu 14 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 14 డిసెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 946 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను సాటిస్ఫై అవలేకపోతున్నాను అంటే.. ప్లీజ్ సార్ మీకు దండం పెడతా అని చేతులు జోడించి అడుగుతుంది వసుధార. దీంతో ఇప్పుడు సాటిస్ఫై అయ్యా అంటాడు శైలేంద్ర. మరోసారి అడుగు అంటే.. ప్లీజ్ సార్ దయచేసి రిషి సార్ ఎక్కడున్నారో చెప్పండి అని అడుగుతుంది వసుధార. చెప్తా.. అన్నీ చెప్తా. రిషి సార్ ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు. టైమ్ కి తింటున్నారా? లేదా? అన్ని విషయాలు చెబుతాను అంటాడు శైలేంద్ర. దీంతో అసలు మీకు ఏం కావాలి అని అడుగుతుంది వసుధార. దీంతో ఏం కావాలో నీకు తెలుసు కదా. నాకు ఎండీ సీటు కావాలి అని అంటాడు శైలేంద్ర. దీంతో అది నువ్వు చచ్చినా జరగదు అంటుంది వసుధార. మా పిన్ని కూడా అలాగే చేసింది. చివరకు లేకుండా పోయింది. రేపు నీకేమైనా అయితే. లేదంటే రిషికి ఏమైనా అయితే అంటే.. మీ మైండ్ లోకి అలాంటి ఆలోచనలను రానివ్వకండి. అలాంటి ఆలోచనలు వస్తే మీకంటే ముందే ఆ ఆలోచనలను చంపేస్తాను అంటుంది వసుధార. దీంతో నేను చెప్పాల్సింది చెప్పాను.. ఆ తర్వాత నీ ఇష్టం. భర్త కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్లు ఉన్నారు. నువ్వు కూడా అలాగే ఎండీ సీటు వదిలేసుకో. నీ భర్త కోసం, నీ భర్త ప్రాణాల కోసం నువ్వు కూడా చరిత్రలో నిలిచిపోతావు. ఎందుకు అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటావు చెప్పు. నేను ఆనాడే చెప్పాను. ఎండీ పదవి కోసం ఎంత దూరం అయినా వెళ్తాను అని. ప్రాణాలు తీయడం నాకు ఇష్టం లేదు కానీ.. అలా చేయాల్సి వస్తోంది. చాలా సార్లు ఓపిక పట్టాను కూడా. కానీ.. ఓపిక నశించింది అంటాడు శైలేంద్ర.

పిన్ని చనిపోయిన తర్వాత అయినా ఆ సీటు నాకు వస్తుంది అనుకున్నా కానీ.. నీ మొగుడు ఆ సీటు నీకు ఇచ్చాడు. ఆ సీటు వదులుకో అంటే నువ్వే పులులు, సింహాలు అంటూ ఏదేదో డైలాగ్ చెప్పావు. నేను హర్ట్ అయ్యా. అందుకే ఈ దారి ఎంచుకున్నా. నీకు మాటలు రావడం లేదని అర్థం అవుతోంది. కథ మొత్తం అర్థం అయింది కదా. నా భర్తను వదిలిపెట్టు అని ఈ ఏడుపులు, బతిమిలాడటాలు ఇవేమీ చేయకు. అందుకు నా మనసు కరగదు. భర్తనా.. ఎండీ సీటా.. అనేది నువ్వు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. ఎండీ సీటును నాకు అప్పగిస్తే నీ భర్త తిరిగి ప్రాణాలతో వస్తాడు. లేదంటే అర్థం చేసుకో అంటూ వసుధారను బెదిరిస్తాడు శైలేంద్ర. నువ్వు వేరే ఏదైనా ప్లాన్ చేస్తే నా గురించి తెలుసు కదా. ఆ సీటు కోసం ఎవ్వరినైనా అడ్డు తప్పిస్తాను. ఇంకో విషయం ఏంటంటే.. ఆ ఎండీ సీటు ఎంత త్వరగా నాకు అప్పగిస్తే అంత మంచిది నీకు. ఇక వెళ్లు అంటాడు శైలేంద్ర. దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఆ రౌడీ ఎదవలు రిషి గాడిని ఎక్కడ పెట్టి ఉంటారు. ఆ విషయం నాకైనా చెప్తారా లేదా అని అనుకుంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి సార్ ను నిజంగానే శైలేంద్ర బంధించాడా?

ఏది నిజం.. ఏది అబద్ధం. రిషి సార్ ను నిజంగానే శైలేంద్ర బంధించారా? అంటూ ఏడ్చుకుంటూ వెళ్తుంది వసుధార. ఏంటి ఈ పరీక్ష. రిషి సార్ ఎక్కడున్నారు మీరు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది వసుధార. ఇంటికి వస్తుంది. వసుధారను చూసి మహీంద్రా ఆశ్చర్యపోతాడు. ఏమైంది.. ఎందుకు అలా ఉన్నావు. ఏం జరిగింది అని అడుగుతాడు. వసుధార. నిన్నే అని అడుగుతాడు. దీంతో నాకు ఎండీ సీటు వద్దు మామయ్య అంటుంది వసుధార. అదేంటమ్మా అంటే నాకు ఆ పదవి అక్కర్లేదు మామయ్య అంటుంది వసుధార. ధరణిని వదిలిపెట్టి వెళ్లినప్పుడు ఏమైనా అయిందా అంటే.. ఎండీ సీటు వదిలిపెడితేనే రిషి సార్ ఎక్కడున్నారో తెలుస్తుంది మామయ్య అంటుంది. ఆ ఎండీ సీటు వద్దు అనుకుంటేనే రిషి సార్ క్షేమంగా ఉంటారు మామయ్య అంటుంది వసుధార. అలా అని నీకు ఎవరు చెప్పారు అంటే.. శైలేంద్ర అంటుంది వసుధార.

శైలేంద్ర ఎందుకు అలా చెప్పాడు. ఏ ఉద్దేశంతో చెప్పాడు అంటే ఖచ్చితంగా వాడు ఎండీ సీటు కోసమే అలా అన్నాడు. వాడికి రిషి ఎక్కడున్నాడో తెలుసు. వాడే రిషిని ఎక్కడో దాచిపెట్టాడు. అందుకే వసుధారతో అలా అన్నాడు అంటాడు మహీంద్రా. ఆ రోజు నాకు ఆ పదవి అప్పగిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. కాలేజీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పారు. ఎంతో నమ్మకంతో నాకు ఆ పదవి అప్పగించారు. కానీ.. ఆయన నా పక్కన లేకుండా నా పక్కన ఏదున్నా నాకు అది గడ్డిపరకతో సమానం. అందుకే.. ఈ ఎండీ సీటును వదిలేద్దామని అనుకుంటున్నాను అంటుంది వసుధార.

శైలేంద్ర అలా అన్నంత మాత్రాన నువ్వు ఎండీ పదవి వదిలేస్తే ఇప్పుడు రిషి గురించి చెబుతాడని ఏంటి నమ్మకం. తొందరపడి నిర్ణయం తీసుకోకు. ఎటువంటి ముందడుగు వేయకు. ఇప్పుడు మనకు ఒక నిజం తెలిసింది. రిషి ఎవరి కంట్రోల్ లో ఉన్నాడని తెలిసింది కదా. అందరం కలిసి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో చూద్దాం అంటుంది అనుపమ.

మరోవైపు ధరణి.. కాఫీ ఇస్తుంది శైలేంద్రకు. ఏమైంది సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతాడు. దీంతో ఏం లేదు అంటుంది ధరణి. మీ మీద నమ్మకం రావడం లేదు మారారంటే అని అంటుంది. నేను మారానని నీకు ఎలా చెప్పాలి అంటే నాకేం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అంటుంది ధరణి. వసుధార నీకు ఎక్కడ కలిసింది అని అడుగుతాడు. దీంతో ఇక్కడే కలిసింది అంటుంది ధరణి.

సరే.. తనకు నువ్వు ఏమైనా చెప్పావా అంటే ఏమైనా అంటే.. నాకు తెలిసిన నిజాలు నా గుండెల్లోనే సమాధి అవుతాయి అంటుంది. తను నిన్ను ఏమైనా అడిగిందా అంటే మీరు ఎక్కడున్నారు అని అడిగింది. నేను తీసుకొచ్చి చూపించాను అంటుంది ధరణి. సార్ లేకుండా నేను బతకలేను. సార్ కు చిన్న ఆపద వచ్చినా నేను తట్టుకోలేను అని అనుపమతో అంటుంది వసుధార. దీంతో మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను. నన్ను నమ్ము అని భరోసా ఇస్తుంది అనుపమ. మన భయాన్ని అలుసుగా తీసుకుంటున్నాడు. వాడిని దోషిగా ఎలా నిలబెట్టాలో నాకు తెలుసు అంటుంది అనుపమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది