Kajal Aggarwal : నా మొగుడి విషయంలో అది యాధృశ్చికం.. కాజల్ అగర్వాల్ కామెంట్స్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kajal Aggarwal : నా మొగుడి విషయంలో అది యాధృశ్చికం.. కాజల్ అగర్వాల్ కామెంట్స్ వైరల్

 Authored By bkalyan | The Telugu News | Updated on :17 January 2021,8:48 pm

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూ వివాహాం ప్రకటన, పెళ్లి వేడుకలు ఎంతగా హాట్ టాపిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తనకు పెళ్లి కాబోతోందని కాజల్ ప్రకటించడంలో కూడా క్రియేటివిటీని చూపించింది. గౌతమ్ కిచ్లూని వివాహాం చేసుకోబోతోన్నానని ప్రకటించే ముందు ఇన్ స్టాలో ఖాళీ పోస్ట్ చేస్తూ అందులో లవ్ సింబల్‌ను షేర్ చేసింది. అలా కాజల్ పెళ్లి ప్రకటనే ఓ సెన్సేషనల్ అయింది. ఆ తరువాత కాజల్ గౌతమ్ పెళ్లి వేడుకలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

Kajal Aggarwal about Gautam Kitchlu

Kajal Aggarwal about Gautam Kitchlu

కాజల్ పెళ్లి వేడుకల గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా జరిగాయి. కోవిన్ నిబంధనల నేపథ్యంలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే అక్టోబర్ 30న కాజల్ పెళ్లి జరిగింది. అయితే కాజల్ గౌతమ్‌ది కేవలం పెద్దలు కుదిర్చిన వివాహాం మాత్రం కాదు. ఈ ఇద్దరి మధ్య ఎన్నో యేళ్ల నుంచి రిలేషన్ కొనసాగుతూ వచ్చింది. కానీ దాన్ని ఎవ్వరూ కూడా పసిగట్టలెక్కపోయారు. కాజల్ గౌతమ్ గతంలో కలిసి దిగిన ఫోటోలు, వెళ్లిన పార్టీలు, అక్కడ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

కాజల్ తనకు కాబోయే భర్తను పరిచయం చేసిన తరువాత పాత ఫోటోలు బయటకు వచ్చాయి. అలా కాజల్ తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో కాజల్‌ను గౌతమ్ గురించి అడిగారు. పెళ్లి తరువాత మీ జీవితం ఎలా ఉంది.. మీ భర్త గురించి ఒక్క మాటలో చెప్పండి అని నెటిజన్ అడిగాడు. దానికి కాజల్ స్పందిస్తూ.. నా బెస్ట్ ఫ్రెండే.. నాకు మొగుడిగా వచ్చాడు.. అది యాధృశ్చికంగా జరిగింది.. అంటూ చెప్పుకొచ్చింది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది