Kajal Aggarwal : షాకింగ్.. ఇక కాజల్ అగర్వాల్ సినిమాలు చేయదా..!
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దశాబ్ధం పాటు తన నటనతో అలరించిన ఈ అందాల ముద్దుగుమ్మ ఆ మధ్య తన చిన్ననాట మిత్రుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. నీల్ కిచ్లు అని తన కుమారుడికి పేరు పెట్టగా, తన ఆలనాపాలన చూసుకుంటుంది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ చిన్నగా సినిమాలనుంచి సైడ్ అయినట్లు […]
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దశాబ్ధం పాటు తన నటనతో అలరించిన ఈ అందాల ముద్దుగుమ్మ ఆ మధ్య తన చిన్ననాట మిత్రుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. నీల్ కిచ్లు అని తన కుమారుడికి పేరు పెట్టగా, తన ఆలనాపాలన చూసుకుంటుంది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ చిన్నగా సినిమాలనుంచి సైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు.
తన బిడ్డ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని సినిమాలకు దూరం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నీల్ కిచ్లూ బాధ్యతలను తల్లిగా ప్రేమతో నిర్వర్తించాలని అనుకుంటుందని, గౌతమ్ సైతం ఆమె నిర్ణయాన్ని సమర్దించడంతో నిదానంగా ఆమె సినిమాలకు దూరం కానుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే కాజల్ చెల్లి నిషా కూడా పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన విషయం విదితమే.. ఇందులో నిజమెంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం విన్న కాజల్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతూ కాజల్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Kajal Aggarwal : సినిమాలు చేయదా?
కాజల్ తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె ఆచార్యలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటించారు. అయితే కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు దర్శక నిర్మాతలు. సినిమాలో ఆమె పాత్రకు స్కోప్ లేకపోవడంతో ఆమె పాత్రను తొలగించినట్లు దర్శకుడు కొరటాల శివ పలు ఇంటర్యూల్లో తెలిపారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.