Kajal Aggarwal : లిప్స్ కు సర్జరీ చేయించుకున్న కాజల్ అగర్వాల్.. ఫ్యాన్స్ ప్రశ్నలకు షాక్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kajal Aggarwal : లిప్స్ కు సర్జరీ చేయించుకున్న కాజల్ అగర్వాల్.. ఫ్యాన్స్ ప్రశ్నలకు షాక్..!

Kajal Aggarwal : సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్లకు అందం చాలా ముఖ్యం. ప్రతి పార్టు కత్తిలా ఉంటేనే వారిని అభిమానులు ఆదరిస్తారనేది అందరికీ తెలిసిందే. అందుకే హీరోయిన్లు కూడా చాలా అందంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక కొన్ని పార్టులు అందంగా లేకపోతే వాటికి సర్జరీలు కూడా చేయించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా వారి పెదాలు సరిగ్గా లేకపోత చాలా మంది సర్జరీలు చేయించుకున్నారు. అలాంటి వారిలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 May 2024,4:30 pm

ప్రధానాంశాలు:

  •  Kajal Aggarwal : లిప్స్ కు సర్జరీ చేయించుకున్న కాజల్.. ఫ్యాన్స్ ప్రశ్నలకు షాక్..!

Kajal Aggarwal : సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్లకు అందం చాలా ముఖ్యం. ప్రతి పార్టు కత్తిలా ఉంటేనే వారిని అభిమానులు ఆదరిస్తారనేది అందరికీ తెలిసిందే. అందుకే హీరోయిన్లు కూడా చాలా అందంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక కొన్ని పార్టులు అందంగా లేకపోతే వాటికి సర్జరీలు కూడా చేయించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా వారి పెదాలు సరిగ్గా లేకపోత చాలా మంది సర్జరీలు చేయించుకున్నారు. అలాంటి వారిలో సమంత అందరికంటే ముందుగా మనకు గుర్తుకు వస్తుంది. ఆమెతో పాటు ఇప్పుడు యంగ్ హీరోయిన్లు కూడా ఇలాంటి సర్జరీలు చేయించుకుంటున్నారు.

Kajal Aggarwal ప్రీ రిలీజ్ ఈవెంట్ లో..

అయితే తాజాగా ఇప్పుడు కాజల్ వంతు కూడా వచ్చినట్టుంది. అందుకే ఆమె ఇప్పుడు ఈ సర్జరీ చేయించుకుంది. కాజల్ కు పెళ్లి అయి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె కొడుకు పుట్టిన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన మూవీ సత్యభామ. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా దీన్ని సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 17న రిలీజ్ అవుతోంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ ఆడవారి సమస్యలను ఇందులో చూపించినట్టు తెలిపారు.

Kajal Aggarwal లిప్స్ కు సర్జరీ చేయించుకున్న కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ ప్రశ్నలకు షాక్

Kajal Aggarwal : లిప్స్ కు సర్జరీ చేయించుకున్న కాజల్ అగర్వాల్.. ఫ్యాన్స్ ప్రశ్నలకు షాక్..!

ఇక అభిమానులు కూడా ఆమెను చాలా రకాల ప్రశ్నలు వేశారు. కేవలం లేడీ అభిమానులే కాకుండా అటు బాయ్స్ కూడా చాలా మంది వచ్చారు. వారంతా  కాజల్ అగర్వాల్ ను రకరకాల ప్రశ్నలు వేసి ఆన్సర్లు రాబట్టారు. ఇక కాజల్ కూడా ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది. అయితే కాజల్ ను ఈ ఈవెంట్ లో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆమె ఇందులో లిప్స్ కు సర్జరీ చేసుకుని కనిపించింది. పెళ్లికి ముందే ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. పదుల కొద్దీ సినిమాల్లో నటించింది. అంతటి స్టార్ డమ్ ఉన్నప్పుడు కూడా ఆమె సర్జరీ చేయించుకోలేదు.

కానీ ఇప్పుడు పెళ్లి అయి కొడుకు పుట్టిన తర్వాత పెద్దగా స్టార్ డమ్ ఆమెకు లేదు. ఇప్పుడు ఏదో కీలక పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే అదే ఎక్కువ. మరి ఇలాంటి సమయంలో ఆమె ఎందుకు చేయించుకుందో ఏమో.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది