Kajal Aggarwal : బిడ్డ పుట్టిన త‌ర్వాత తొలి ఫొటో షేర్ చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్.. భ‌లే ముద్దుగుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kajal Aggarwal : బిడ్డ పుట్టిన త‌ర్వాత తొలి ఫొటో షేర్ చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్.. భ‌లే ముద్దుగుందిగా..!

Kajal Aggarwal : క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇటీవ‌లి కాలంలో ఈ ముద్దుగుమ్మ ఏం చేసిన అది వైర‌ల్ అవుతుంది. కాజల్ అగర్వాల్ కెరీర్‌పరంగా దూసుకెళ్తున్న సమయంలో ప్రేమించిన గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకొన్నది. పెళ్లికి ముందే ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన నటించేందుకు అంగీకరించింది. ఆచార్య సినిమా షూట్ సమయంలో లాక్‌డౌన్ విధించడం.. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవడం, వెంటనే గర్బవతి కావడం చకచకా జరిగిపోయాయి. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :7 May 2022,4:30 pm

Kajal Aggarwal : క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇటీవ‌లి కాలంలో ఈ ముద్దుగుమ్మ ఏం చేసిన అది వైర‌ల్ అవుతుంది. కాజల్ అగర్వాల్ కెరీర్‌పరంగా దూసుకెళ్తున్న సమయంలో ప్రేమించిన గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకొన్నది. పెళ్లికి ముందే ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన నటించేందుకు అంగీకరించింది. ఆచార్య సినిమా షూట్ సమయంలో లాక్‌డౌన్ విధించడం.. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవడం, వెంటనే గర్బవతి కావడం చకచకా జరిగిపోయాయి. దశాబ్ద కాలంపాటు స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగింది.

ఈ క్ర‌మంలోనే కాజ‌ల్ 2020లో గౌత‌మ్ కిచ్లును పెళ్ళిచేసుకుంది. ఇటీవ‌లే మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా కాజ‌ల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.త‌న చెల్లి నిషా అగ‌ర్వాల్ బాట‌లోనే వెళ్ళ‌నున్న‌ట్లు తెలుస్తుంది. కాజ‌ల్ త‌న సినీ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్ట‌నున్న‌ట్లు టాక్‌. నిషా కూడా పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పింది. కాక‌పోతే నిషాకు అప్ప‌టికి సినిమా అవ‌కాశాలు అంత‌గాలేవు. కానీ కాజ‌ల్‌కు చేతినిండా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే అగ్రిమెంట్ చేసిన ప్రాజెక్ట్‌ల‌ను కూడా ర‌ద్దు చేసుకున్న‌ట్లు స‌మాచారం. దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

kajal Aggarwal Latest pic viral

kajal Aggarwal Latest pic viral

కాజ‌ల్ ప్ర‌స్తుతం న‌టించిన మూడు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.కొడుకు పుట్టిన త‌ర్వా కాజ‌ల్ అగ‌ర్వాల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు త‌న‌కు సంబంధించిన క్యూట్ పిక్ షేర్ చేసింది. ఇందులో కాజ‌ల్ క్యూట్ లుక్స్ నెట్టింట చక్క‌ర్లు కొడుతున్నాయి. అమ్మ‌డి అంద‌చంద‌దాలు చూస్తూ మ‌తులు పోతున్నాయి. రానున్న రోజుల‌లో కాజ‌ల్ మ‌రింత ఫిట్‌నెస్‌తో కంబ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాజ‌ల్ ఆచార్య‌లో న‌టించిన కూడా ఆమె పాత్ర‌ని తొల‌గించిన విష‌యం తెలిసిందే. చంద‌మామ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన కాజ‌ల్ అగ‌ర్వాల్ రానున్న రోజుల‌లో మ‌రిన్ని సినిమాలు చేయ‌నుంద‌ట‌.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది