Kajal Aggarwal : మ‌ద‌ర్స్ డే రోజు కొడుకు ఫొటో షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టిన కాజ‌ల్ అగ‌ర్వాల్

Authored By Sam C | The Telugu News | Published on: May 8, 2022, 7:30 pm

Kajal Aggarwal : కలువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. కొడుకుకు నీల్‌ కిచ్లూ అని ఇప్పటికే పేరు పెట్టేసింది. చిన్నారి రాకతో కాజల్‌ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. 2020లో గౌతమ్‌ కిచ్లు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కాజల్‌ ఆ తర్వాత కూడా సినిమాలు చేసింది. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత మాత్రం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది. ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న కాజల్‌ డెలివరీ తర్వాత కుమారుడి ఫొటోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంది. ఫేస్ క‌నిపించ‌కుండా ఈ అమ్మ‌డు పోస్ట్ చేస్తున్న పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

మ‌ద‌ర్స్ డే సందర్భంగా తొలిసారి తన కొడుకు నీల్‌ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నిషా అగర్వాల్‌, ఆమె కొడుకు సహా కుటుంబసభ్యులు నీల్‌ను ఎత్తుకొని ముద్దుచేస్తున్న ఫోటోలను తన సోషల్‌ మీడియాలో పంచుకుంది. తల్లి అయ్యాక తను పొందుతున్న సంతోషాన్ని, అనుభూతిని ఇన్‌స్టా పోస్టులో చెప్పుకొచ్చింది. ‘నువ్వు నాకెంత ముఖ్యమైనవాడివో నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నా. నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న క్షణం.. నీ చిట్టి చేతులను తాకిన క్షణం… నీ వెచ్చని స్పర్శ తాకినప్పుడు, నీ అందమైన కళ్లల్లోకి చూసినప్పుడు… నీతో ఎప్పటికీ ప్రేమలో ఉంటానని తెలుసు.

Kajal Aggarwal shares emotional post

Kajal Aggarwal shares emotional post

Kajal Aggarwal : కుమారుడితో ఆనందం..

నువ్వు నా మొదటి బిడ్డవు. నా సర్వస్వం. రాబోయే రోజుల్లో నాకు సాధ్యమైనంతగా నీకు అన్నీ నేర్పిస్తాను. కానీ ఇప్పటికే నువ్వు నాకు చాలా నేర్పేశావు. తల్లి అంటే ఏంటో… నిస్వార్థంగా ఎలా ఉండాలో నేర్పించావు. నా శరీరం బయట కూడా నా హృదయం మనగలడం సాధ్యమేనని నేర్పించావు..’ అంటూ కాజల్ తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొంది. కాజల్ ఫోటోలపై స్పందిస్తున్న నెటిజన్లు… ఆమెకు ‘హ్యాపీ మదర్స్ డే’ అంటూ విషెస్ చెబుతున్నారు. కాజల్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp