kalki Movie Ticket : అంతటా కల్కి సందడే.. ఒక్క టిక్కెట్ రేటు రూ.2300లా.. ఎక్కడంటే..!
ప్రధానాంశాలు:
kalki Movie Ticket : అంతటా కల్కి సందడే.. ఒక్క టిక్కెట్ రేటు రూ.2300లా.. ఎక్కడంటే..!
kalki Movie Ticket : 600 కోట్లకి పైగా బడ్జెట్.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు.. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌లని కలగలిపి మహానటి వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన నాగ్ అశ్విన్ కల్కి అనే మూవీ చేశాడు. భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే బలమైన క్యాస్టింగ్, టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీని రూపొందించి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ ప్రేక్షుకలకి సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే కల్కి. మహా భారత కాలం నుంచి 2898 AD వరకు 6 వేల యేళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
kalki Movie Ticket పైపైకి టిక్కెట్ రేట్స్..
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల అయింది. రిలీజ్ కు ముందు.. మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్స్ చేయడంతో వేరే లెవెల్ లో హైప్ క్రియేట్ అయింది. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రోజుకు ఐదు షోలు కూడా వేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు తెలంగాణ సర్కార్ కూడా అలానే పర్మిషన్ ఇచ్చింది. సినిమాకి పాజిటవ్ టాక్ వస్తుండడంతో మూవీ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక ఇప్పుడు కల్కి థియేటర్స్ దగ్గర తెగ సందడి వాతావరణం నెలకొంది. ప్రభాస్ అభిమానులు తెగ రచ్చ చేస్తున్నారు. బాణా సంచాలు పేలుస్తూ, పాలాబిషేకాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాని చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో టిక్కెట్లని భారీ రేట్లకి అమ్ముతున్నారు. ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో ఒక్కో టిక్కెట్‌ని 2300 రూపాయలకి అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ కి నార్త్‌లో కూడా ఫుల్ క్రేజ్ ఉండడంతో థియేటర్ నిర్వాహకులు దానిని క్యాష్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా టిక్కెట్ రేట్స్‌ని భారీగా పెంచడం మనం చూశాం. బ్లాక్‌లో కూడా భారీ రేట్లకి అమ్ముతున్నారు.