Kanthara : కాంతార ప్రీక్వెల్‌పై భారీ అంచ‌నాలు.. టార్గెట్ గ‌ట్టిగానే సెట్ చేశారుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kanthara : కాంతార ప్రీక్వెల్‌పై భారీ అంచ‌నాలు.. టార్గెట్ గ‌ట్టిగానే సెట్ చేశారుగా..!

Kanthara : రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ కన్నడనాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని 16 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వచ్చాయి. ఒక్క కన్నడ భాషలోనే ఈ సినిమాకి 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రావడం విశేషం. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత కన్నడంలో 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా ఇదే. […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 October 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Kanthara : కాంతార ప్రీక్వెల్‌పై భారీ అంచ‌నాలు.. టార్గెట్ గ‌ట్టిగానే సెట్ చేశారుగా..!

Kanthara : రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ కన్నడనాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని 16 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వచ్చాయి. ఒక్క కన్నడ భాషలోనే ఈ సినిమాకి 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రావడం విశేషం. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత కన్నడంలో 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా ఇదే. తెలుగులో 60 కోట్ల వరకు కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయి. ఇప్పుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘కాంతార:చాప్టర్ 1’ టైటిల్ తోనే ఈ సినిమా రానుంది. ‘కాంతారా 2’ని పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో ఒకే సారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే రిషబ్ శెట్టి ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోతుంది.

Kanthara ప్రీక్వెల్‌పై భారీ అంచ‌నాలే..

దీని తర్వాత అతని నుంచి రాబోయే సినిమాలపై ఎక్స్ పెక్టేషన్స్ హైఎండ్ లో ఉంటాయి. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ 30 శాతం మాత్ర‌మే పూర్తైంద‌ని నిర్మాత తెలిపారు. ఈ ప్రీక్వెల్ కోసం చిత్ర యూనిట్ కర్ణాటకలోని కుందాపుర ప్రాంతంలో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. వీలైనంత త్వ‌ర‌గా మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలనే లక్ష్యంతో యూనిట్ ముందుకువెళ్తోంది. మొద‌టి పార్ట్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో రెండో పార్ట్‌పై అంచ‌నాలు మ‌రింత‌గా ఉన్నాయి. మొదట 125 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మించాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం బడ్జెట్ మరింత పెరిగి 150 కోట్లకు చేరుకుందని టాక్. సినిమా కథ పరంగా, రిషబ్ శెట్టి దీనిని లార్జర్ దెన్ లైఫ్‌ కాన్సెప్ట్‌గా మలిచారని సమాచారం.

Kanthara కాంతార ప్రీక్వెల్‌పై భారీ అంచ‌నాలు టార్గెట్ గ‌ట్టిగానే సెట్ చేశారుగా

Kanthara : కాంతార ప్రీక్వెల్‌పై భారీ అంచ‌నాలు.. టార్గెట్ గ‌ట్టిగానే సెట్ చేశారుగా..!

ఈ ప్రీక్వెల్ 1000 కోట్ల మార్క్‌ను చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మరింత ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమా OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ ఈ మూవీలో ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడ‌ని టాక్ న‌డుస్తుంది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది