Karthika Deepam : తిరిగి వచ్చిన కార్తీక్, దీపలు.. సంతోషంతో పొంగిపోతున్న కుటుంబ సభ్యులు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam : తిరిగి వచ్చిన కార్తీక్, దీపలు.. సంతోషంతో పొంగిపోతున్న కుటుంబ సభ్యులు..

 Authored By prabhas | The Telugu News | Updated on :14 August 2022,10:36 am

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. 14 31 సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. నిరుపం, హిమ శౌర్య కోసం పెళ్లి చివరి క్షణంలో ఏం చేస్తుందో ఏంటో అని భయపడిపోతూ ఉంటాడు. అప్పుడు అంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. అప్పుడు నిరూపం, ప్రేమ్ ను అరే ప్రేమ్, హిమ ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అని చూస్తుంది. తను అనుకున్నది ఎలాగైనా చేసేలా ఉంది. అని నాకు భయంగా ఉందిఅంటూ…ఈ పెళ్లి ఆగకుండా ఏదైనా ప్లాన్ చెప్పురా అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ్ మనసులో ఈ పెళ్లి మేము ఆగిపోయేలా చేయాలి అనుకుంటున్నాం.. నువ్వు ఆగకుండా ప్లాన్ చెప్పు అంటావేంట్రా అని మనసులో అనుకుంటాడు. నిరూపముకి ప్రేమ్ హిమ గురించి చెప్పాలి అని అనుకుంటాడు. కానీ చెప్తే ఎలా తీసుకుంటాడో అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే హిమ, సౌర్యలు గుడికి వెళుతూ కారులో పక్కపక్కనే కూర్చుంటారు.

అలా కూర్చోవడం సౌర్య కి ఇష్టం ఉండదు. నేను దిగి నా ఆటోలో వస్తాను అని అంటుంది శౌర్య. అప్పుడు ఆనందరావు చీర కట్టుకొని ఇంత అందంగా ఉండి నువ్వు ఆటో తోలుతావా తల్లి అని నవ్వుతాడు. ఏమవుతుంది తాతయ్య అని అంటుంది శౌర్య. అప్పుడు సౌందర్య కోపంగా చూస్తూ మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో ఏమో కానీ నాకు మాత్రం పిచ్చ కోపం వస్తుంది. అని అంటుంది. నువ్వు కారు దిగితే కాళ్లు విరగొడతా అని అంటుంది. అలా గుడికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే హాస్పిటల్లో దీప బ్రతికే ఉంటుంది. తను నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ తను గతమంతా గుర్తుకొస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి డాక్టర్ బాబు అని గట్టిగా అంటుంది. అప్పుడు అక్కడికి డాక్టర్స్ వస్తారు. తనకి చెప్తారు మీరు ఇన్ని రోజులు కోమాలో ఉన్నారు.

Karthik Deepa family members are overjoyed with their return

Karthik Deepa family members are overjoyed with their return

ఇప్పుడే కాంసెన్సు లో కి వచ్చారు. అని చెప్తారు అప్పుడు దీప షాక్ అవుతుంది. నా పిల్లలు ఎలా ఉన్నారు? నా కుటుంబం అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా బెడ్ దిగి గబగబా వెళ్ళిపోతుంది. అప్పుడు డాక్టర్లు ఆపుతారు మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది మేడం మీరు అప్పుడే కంగారు పడకండి అని అంటారు. కట్ చేస్తే కార్తీక్ ఎవరికి తెలియకుండా ముందే వచ్చేసి వారి ఫోటోలుకు ఉన్న దండలు చాటుగా తీసేస్తాడు. కట్ చేస్తే గుడిలో శౌర్య మా అమ్మానాన్నలు బ్రతికే ఉన్నారని నేను అనుకుంటున్నాను వాళ్ళని మాకు కనిపించేలా చెయ్యి అని దండం పెట్టుకుంటుంది. ఒకపక్క హిమ, శౌర్య, నిరూపం భావల పెళ్లి ఎలాగైనా జరిగేలా జై దేవుడా అని దండం పెట్టుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది