Jabardasth Naresh : మరీ అంతటి అవమానమా?.. జబర్దస్త్ నరేష్ కన్నీటిగాథ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Naresh : మరీ అంతటి అవమానమా?.. జబర్దస్త్ నరేష్ కన్నీటిగాథ..!

 Authored By bkalyan | The Telugu News | Updated on :31 August 2021,12:15 pm

Jabardasth Naresh : సమాజంలో ఎలా ఉన్న గెలి చేసే వారు మాత్రం కొందరు ఉంటారు.పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా.. సన్నగా ఉన్న లావుగా ఉన్నా..నల్లగా ఉన్నా.. తెల్లగా ఉన్నా ఏదో ఒక వంక పెట్టుకుని మరీ ఏడిపిస్తుంటారు. అవమానిస్తుంటారు. అది కూడా ఎక్కడో దూరాన ఉన్న వారు కాదు. మన పక్కన ఉన్న వారే మనల్ని ఏడిపిస్తుంటారు. అలా మరుగుజ్జు అయిన నరేష్‌కు కూడా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయట. తాజాగా నరేష్ తన కష్టాలు, అవమానాల గురించి చెప్పుకొచ్చారు.

Jabardasth Naresh Gets Humiliated

Jabardasth Naresh Gets Humiliated

Jabardasth Naresh : ఎక్స్ ట్రా జబర్దస్త్ 350వ ఎపిసోడ్ స్పెషల్ భాగంగా జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల రియల్ లైఫ్ స్టోరీలను స్కిట్ల రూపంలో వేసేశారు. ఇందులో జబర్దస్త్ నరేష్ తన జీవితంలో జరిగిన ఘటనలు, తనకు జరిగిన అవమానాలను స్కిట్ రూపంలో చేసి ఏడిపించేశాడు. హైట్ పెరగడం లేదని, తన కాలనీలో ఆకతాయిలు ఎలా ఏడిపించే వారో, ఎలా హింసించే వారో చెప్పుకొచ్చాడు. కొట్టే వారు కూడా అని ఆ స్కిట్ రూపంలో చూపించేశాడు. ఇక దారుణమైన అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పేశాడుచెప్పేశాడు.

Jabardasth Naresh Gets Humiliated

Jabardasth Naresh Gets Humiliated

 

Jabardasth Naresh : మరీ అంతటి అవమానవా?.. జబర్దస్త్ నరేష్ కన్నీటిగాథ

వీడి ఏళ్లు వస్తున్నాయ్ కానీ హైట్ మాత్రం పెరగడం లేదు.. వీడి చేతి వేళ్లే ఇంత ఉన్నాయ్ అంటే.. అని అక్కడితో ఆపేశారు. ఇక తరువాతి డైలాగ్ ఏంటో ప్రేక్షకుడి ఊహకే వదిలేశారు. అలా తనకు ఎన్నో అవమానాలు జరిగాయని నరేష్ ఏడ్చేశాడు. తాను హైట్ పెరగకపోవడం తాను చేసిన తప్పా? సమాజం ఎందుకిలా చేస్తుంది? అంటూ భోరున ఏడ్చేశాడు. ఆ దెబ్బతో అక్కడి వారంత కూడా ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి నరేష్ అందరినీ కదిలించేశాడు.

YouTube video

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది