Karthika Deepam 01 Sep Today Episode : కార్తీక్ ని తన బుట్టలో పడేసేందుకు డ్రామాలాడుతున్న మోనిత… వంటలక్కని తీసుకొస్తా అంటున్న కార్తీక్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 01 Sep Today Episode : కార్తీక్ ని తన బుట్టలో పడేసేందుకు డ్రామాలాడుతున్న మోనిత… వంటలక్కని తీసుకొస్తా అంటున్న కార్తీక్…

 Authored By aruna | The Telugu News | Updated on :1 September 2022,10:00 am

Karthika Deepam 01 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈ సీరియల్ తాజాగా రిలీజ్ అయింది. ఈ రోజు ఎపిసోడ్ 1446 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మోనిత కార్తీక్ ని తన వలలో వేసుకోవడానికి తన చేతులు కాలినట్టుగా డ్రామా ఆడుతూ ఉంటుంది. కానీ తన డ్రామాలకి కొంచెం కూడా చేలించడు. అప్పుడు ఇంకాస్త డోస్ పెంచి నీకోసం నేను ఏమి వదులుకున్నానో తెలుసా… నీకు నా మీద కాస్త కూడా ప్రేమ కలగడం లేదు.. అప్పుడు కార్తీక్ నువ్వు నాకు ఎట్లా తెలుస్తుంది నాకు గుర్తు లేదు కదా.. ఏమి వదులుకున్నావ్? నాకు అవన్నీ గుర్తుండవు కదా చెప్పు అని అంటాడు. అప్పుడు మౌనిత తన బిడ్డని వదిలేసుకున్నట్లుగా డ్రామాలాడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ తన మాయలో కొద్ది కొద్దిగా పడుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత కార్తీక్ ని హత్తుకుని ఈ విధంగానే నేను డోస్ పెంచుకుంటూ నిన్ను నా వాడిని చేసుకుంటా అని అనుకుంటుంది తన మనసులో. కట్ చేస్తే దీప డాక్టర్ వాళ్ళింట్లో వంటచేసి వాళ్లకి వడ్డిస్తూ ఉండగా…

డాక్టర్ నీ చేతిలో ఏదో మాయ ఉందమ్మా నీ చేతి వంట అద్భుతం అని అంటాడు. అప్పుడు పెద్దావిడ కూడా అవునమ్మా నీ భర్త అదృష్టవంతుడు ఇంత గొప్పగా వంట చేసే భార్య దొరికినందుకు అని అంటుంది. అప్పుడు ఏ అదృష్టం ఏంటో ఎప్పుడు కష్టాలేగా అమ్మ అను బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పెద్దావిడ, డాక్టర్ వాళ్ళిద్దరు దీపకు ధైర్యం చెబుతూ ఉంటారు. అప్పుడు డాక్టర్ నువ్వు నీ వంటతోనే నీ భర్త నీ దగ్గరికి తెచ్చుకోవచ్చమ్మ.. ఈ విధంగా నువ్వు వంట చేసి కార్తీక్ తినిపించు తను నీ దగ్గరికి రావడానికి ప్రపంచం కూడా అడ్డుకోదు అని అంటాడు. అప్పుడు సరే అన్నయ్య నీలాంటి వాళ్లు నాకు తోడుగా ఉన్నంతవరకు నా భర్త నా దగ్గరకు వస్తాడు అన్నయ్య అని అంటుంది. అప్పుడు పెద్దావిడ సరేగాని నువ్వు అక్కడికి ఎలా వెళ్తావ్ అమ్మ ఎలా తినిపిస్తావు తనకి అని అంటుంది. అప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా అని చెప్తుంది దీప. కట్ చేస్తే వారణాసి ఆటోకి వెళ్లడానికి రెడీ అయి వెళ్తూ ఉంటాడు. అప్పుడు సౌర్య నేను కూడా వస్తా అమ్మ వాళ్ళని వెతుకుతా అని అంటుంది. అప్పుడు చంద్ర, గండ వద్దమ్మా నువ్వు కూడా లేకపోతే మాకు బోర్ కొడుతుంది అని అంటారు.

Karthika Deepam 01 September 2022 Full Episode

Karthika Deepam 01 September 2022 Full Episode

అప్పుడు శౌర్య మిమ్మల్ని అందుకే నేను హోటల్ పెట్టుకోమని చెప్పాను అని అంటుంది. అప్పుడు వారణాసి సరే రానివులే అన్న.. అని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు వారణాసి నీకు హిమ మీద కోపం ఎప్పుడు తగ్గుతుంది. అమ్మ అని సౌర్యని అడుగుతాడు. అప్పుడు శౌర్య దాని పేరు ఎత్తకు దాని పేరు తలుచుకుంటే మండిపోతుంది. అమ్మ నాన్న బ్రతికొస్తేనే దాన్ని క్షమిస్తా.. అని అంటుంది. అప్పుడు వారణాసి చచ్చిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారు అమ్మ అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. కట్ చేస్తే కార్తీక్ మంచిగా రెడీ అయి బయటికి వస్తాడు శివుని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అప్పుడు మౌనిత ఎక్కడికి వెళ్తున్నావ్ కార్తీక్ అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా అందుకే బయటకి వెళ్తున్నామని చెప్తాడు.. అప్పుడు మౌనిత ఎక్కడికి వెళ్తున్నావ్ చెప్పు ప్లీజ్ అని అడుగుతుంది అప్పుడు నీకోసం వంట లెక్క తీసుకొద్దాం అనుకుంటున్నా.

నువ్వు ఇబ్బంది పడుతుంటే నేను చూడలేకపోతున్నా అని అంటాడు. అప్పుడు మౌనిత ఆగ్రహంతో వద్దు కార్తీక్ దాన్ని ఎందుకు తీసుకొస్తావ్ అలాంటి అదొక పెద్ద మాయలేడీ అని తీసుకురావద్దు అని చెప్తుంది. ఇప్పుడు సరే ఓకే ఓకే వదిలేయ్.. ఇక దాని గురించి వదిలేయ్ అని బయటికి వెళ్తాడు కార్తీక్.. కట్ చేస్తే దీప కార్తి దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ వాళ్ళు అందరూ ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అమ్మ అదేదో అని అంటారు. అప్పుడు వెల్లక తప్పదు అన్నయ్య అని దీప అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో దీప మౌనిత ఇంటి ఎదురుగా తిష్ట వేసి బిర్యానీ వండుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ స్మెల్ చూసి ఎవరో చాలా బాగా చేస్తున్నారు.. అని మౌనితను తన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ బిర్యానీ ఉండేది దీపనే.. అది చూసి కార్తీక్ సంతోషంతో నువ్వేనా అని అంటాడు. మౌనిత మాత్రం భయపడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం ఎదురు చూడాలి..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది