Intinti Gruhalakshmi 1 Sep Today Episode : సామ్రాట్ తో తెగదెంపులు చేసుకున్న తులసి.. తన మ్యూజిక్ స్కూల్ ఆగిపోయినట్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 1 Sep Today Episode : సామ్రాట్ తో తెగదెంపులు చేసుకున్న తులసి.. తన మ్యూజిక్ స్కూల్ ఆగిపోయినట్టేనా?

Intinti Gruhalakshmi 1 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 సెప్టెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 726 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ మాజీ భార్య అతి షో చూస్తుంటే క్లాప్స్ కొట్టాలనిపించడం లేదా అని నందుతో లాస్య అంటుంది. దీంతో ఏంటి ఈ నాటకాలు అని అడుగుతుంది అనసూయ. దీంతో నాటకం మాది కాదు అత్తయ్య. ఈ మహానటిది. సామ్రాట్ ముందు నందు […]

 Authored By gatla | The Telugu News | Updated on :1 September 2022,9:00 am

Intinti Gruhalakshmi 1 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 సెప్టెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 726 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ మాజీ భార్య అతి షో చూస్తుంటే క్లాప్స్ కొట్టాలనిపించడం లేదా అని నందుతో లాస్య అంటుంది. దీంతో ఏంటి ఈ నాటకాలు అని అడుగుతుంది అనసూయ. దీంతో నాటకం మాది కాదు అత్తయ్య. ఈ మహానటిది. సామ్రాట్ ముందు నందు పరువు తీయాలని డిసైడ్ అయింది. దీపక్ ను పిలిపించి నందునే తన భర్త అని తులసికి తెలిసేలా చేసింది అని అంటుంది లాస్య. దీంతో మీరు ఇది నమ్ముతున్నారా అని అడుగుతుంది తులసి. దీంతో నమ్ముతున్నాను అంటాడు నందు. నేను అలా చేయాలనుకుంటే భూమి పూజరోజే ఎందుకు అలా చేస్తాను. నాకు అది పండగ రోజు.. అని అంటుంది తులసి. నిజంగా చెప్పాలనుకుంటే ఆరోజే సామ్రాట్ కు చెప్పేది కదరా. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తుంది అని అడుగుతాడు పరందామయ్య.

intinti gruhalakshmi 1 september 2022 full episode

intinti gruhalakshmi 1 september 2022 full episode

అమ్మకు ఆ విషయం సామ్రాట్ గారికి తెలిసేలా చేస్తే అమ్మకు ఏం వస్తుంది. అమ్మకు ఏం లాభం అంటాడు ప్రేమ్. దీంతో మిమ్మల్ని ఆ కంపెనీ నుంచి తరిమేసేందుకు తులసి చేసిన ప్లాన్ ఇది అంటాడు నందు. అంతే కాదు నందు.. మనం లేకపోతే అక్కడ తను ఆడింతే ఆట.. పాడిందే పాట అంటుంది లాస్య. దీంతో సారీ.. వెరీ వెరీ సారీ అంటుంది తులసి. సారీ ఎందుకు అని అంటాడు నందు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకొని నా మీద నిందలు వేసినందుకా. నీ తమ్ముడితో మాటలు అనిపించినందుకా. సామ్రాట్ తో నేనే నీ భర్త అని తెలిసేలా చేసినందుకా ఎందుకు చెబుతున్నావు అని అడుగుతాడు నందు. దీంతో కిచెన్ లోకి వెళ్లి ఒక పీట తీసుకొచ్చి నందు ముందు పెడుతుంది తులసి. దాని మీదికి ఎక్కి తన ముందు నిలబడుతుంది.

నేను సారీ చెప్పింది మీరు అనుకున్న దేనికీ కాదు. మిమ్మల్ని భయపెట్టినందుకు అంటుంది తులసి. దీంతో భయమా.. నాకా అంటాడు నందు. నన్ను చూసినందుకు కాదు.. మీ భయం దీన్ని చూసి. నేను మీ ఆయనతో సమానంగా ఎదిగిపోతాననే భయం.. అంటే కదా లాస్య. ఏరోజైతే నేను ఫ్యాక్టరీని సొంతంగా నడపడం మొదలుపెట్టానో అప్పుడే మీలో భయం మొదలైంది అంటుంది తులసి.

రేస్ లో ఉండే మగాళ్ల చేతుల్లో కేవలం డిగ్రీ మాత్రమే ఉంటుంది.. అంటుంది తులసి. కానీ ఆడదాని చేతుల్లో గిన్నెలు, గరిటెలు, చీపుళ్లు.. ఉతకాల్సిన బట్టలు.. మొగుడి బాధ్యత.. అత్తామామల బాధ్యత, సంప్రదాయపు కట్టుబాట్ల సంకెళ్లు..  ఇవన్నీ ఉంటాయి అని చెబుతుంది తులసి.

వీటన్నింటినీ మోస్తూ భరిస్తూ ఆడది మొగుడితో సమానంగా పరిగెత్తాలి. ఆడది ఎందుకు వెనుకబడిందో అర్థం అయిందా? అగ్నిహోత్రం చుట్టూ అడుగులు వేసినప్పుడు భార్య వెనుక నడిచింది కాబట్టి జీవితాంతం మొగుడి వెనుకే నడవాలని అనుకుంటాడు మగాళ్లు.

Intinti Gruhalakshmi 1 Sep Today Episode : మీరు భయపడుతున్నారని నాకు తెలుసు అని నందుతో అన్న తులసి

ఆ భ్రమలో నుంచి బయటికి రండి నంద గోపాల్ గారు. నా గొంతు తగ్గదు. వింటున్నావా లాస్య.. ఇది కేవలం మీ ఆయనకు మాత్రమే కాదు.. నీకు కూడా చెబుతున్నాను. ఇంతకు పదింతలు గొడవలు లేపినా.. మీరు ఏం చేయలేరు.

నన్ను ఎదగకుండా ఆపలేరు అంటుంది తులసి. ఇన్ని రోజులు అందరి గురించి ఆలోచించాను. ఇప్పుడు నా గురించి ఆలోచించుకుంటున్నాను. మీరు భయపడుతున్నారు అని నాకు తెలుసు. మీ మనసుకు ప్రశాంతత ఇవ్వమని నేను ఆ దేవుడిని వేడుకుంటాను అంటుంది తులసి.

చూడు తులసి.. ఎదగడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా నేను నీకంటే ఎత్తులోనే ఉంటాను.. అంటాడు నందు. దీంతో మీరు నా ముందు తల దించుకునే ఉంటారు. నేను మీ ముందు తల ఎత్తుకునే ఉంటాను అని చెబుతుంది తులసి. దీంతో ఇంట్లో వాళ్లంతా తనకు సపోర్ట్ చేస్తూ చప్పట్లు కొడతారు.

కట్ చేస్తే అభి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు సామ్రాట్. అభి ఎందుకు అలా మాట్లాడాడో సామ్రాట్ కు అర్థం కాదు. అక్కడే ఉన్న చేతి అచ్చుల పేపర్ ను చింపబోతాడు సామ్రాట్. ఇంతలో అక్కడికి వచ్చిన బాబాయి ఆగు సామ్రాట్ అంటాడు.

ఎవరి మీద కోపంతో ఆ పేపర్ ను చింపేద్దాం అనుకుంటున్నావు అంటాడు. నందు తులసి మాజీ భర్త అని నీకు చెప్పలేదని కోపమా.. లేక అభి నీ మీద వేసిన నిందల కోపమా అని ప్రశ్నిస్తాడు బాబాయి.

నా మీద నాకే కోపం బాబాయి అంటాడు. తులసి గారికి నేను చేసిన సాయం వల్లే ఇప్పుడు తులసి గారు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది అంటాడు నందు. ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు అంటాడు బాబాయి.

దీంతో నేను మగాడిని… దులుపేసుకుంటాను కానీ.. తులసి గారు అలా కాదు.. కన్న కొడుకు అన్న మాటలకు అవమానాన్ని ఎలా తట్టుకుంటుంది అంటాడు సామ్రాట్. తులసిని ఆదుకోవాలనే ఉద్దేశం తప్ప నీకు ఇంకేం ఆలోచన లేదా అని అడుగుతాడు బాబాయి.

దీంతో ఏం లేదు.. ఎందుకు నన్ను అడిగిందే అడుగుతుంటారు అని ప్రశ్నిస్తాడు సామ్రాట్. ఆ తర్వాత ప్రేమ్ కసరత్తులు చేస్తుండగా అక్కడికి పాలు తీసుకొని వస్తుంది శృతి. అక్కడ పెడుతుంది.

ఇంతలో తులసి వస్తుంది. ఆంటికి అన్ని విషయాలు చెప్పేస్తాను అంటూ ప్రేమ్ ను బెదిరిస్తుంది శృతి. ఎక్సర్ సైజ్ తెచ్చిన వెంటనే పాలు తెమ్మన్నాడు. తేగానే ఇప్పుడు మాత్రం పాలు తాగడం లేదు అంటుంది శృతి. దీంతో ఏరా ఎందుకు ఇలా చేస్తున్నావు. పాలు తాగు అంటుంది తులసి.

కానీ.. ఆ పాలల్లో ఉప్పు కలుపుతుంది శృతి. ఆ పాలు ఎలా తాగాలో అర్థం కాదు ప్రేమ్ కు. మరోవైపు నందు, లాస్య ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మ్యూజిక్ స్కూల్ తో పాటు తనతో బిజినెస్ పార్టనర్ గానూ తప్పుకుంటున్నట్టు తులసి సామ్రాట్ కు మెసేజ్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది