Karthika Deepam 05 Sep Today Episode : కార్తీక్ కి గతం గుర్తొచ్చేలా చేస్తున్న దీప.. ముంబై వెళ్లాలి అనుకుంటున్నా మౌనిత, కార్తీక్…!
Karthika Deepam 05 Sep Today Episode : కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1449 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప తన పిల్లల గురించి కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మౌనిత దీపం ఎలాగైనా ఇక్కడినుంచి పంపించేయాలి అని ప్లాన్లు వేస్తూ ఉంటుంది. చివరగా కార్తీక్ ని ఇక్కడనుంచి ముంబై తీసుకెళ్లాలని ప్లాన్ వేసి కార్తీక్ దగ్గరికి వెళ్లి మనం ముంబైకి వెళ్ళిపోదాం.. మీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అని కార్తీక్ కి చెప్తుంది. అప్పుడు కార్తీక్ మాది ముంబాయా నాకు తెలుగు ఎలా వస్తుంది అని అంటాడు. అప్పుడు మీరు తెలుగు వాళ్ళు అని ఏదో ఒక సాకు చెప్పి తనని నమ్మేలా చేస్తుంది. అప్పుడు కార్తీక్ నువ్వేమో ముంబై అంటున్నావ్ నేనేమో హైదరాబాద్ అనుకుంటున్నా.. మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అని అనుకుంటున్నా అని అంటాడు.
అప్పుడు నేను చెప్పింది నమ్మవా అని అంటుంది. అప్పుడు కార్తీక్ సరే గాని నాకు ఆకలిగా ఉంది టిఫిన్ పెట్టు అని అంటాడు. అప్పుడు సరే నేను వంటలక్క దగ్గరికి వెళ్లి టిఫిన్ చేయమని చెప్తాను.. మనం ఎలాగో నైట్ ముంబై వెళ్ళిపోతున్నాం కదా అని అంటుంది. అప్పుడు మౌనిత దీప దగ్గరికి వెళ్లి దర్జాగా చైర్ లో కూర్చొని ఉంటుంది. దీప ఏంటి దర్జాగా వచ్చి కూర్చున్నావు అని అంటుంది. అప్పుడు ఇక మీద నుంచి అంత దర్జాగానే ఉంటుంది అని అంటుంది మోనిత. అప్పుడు దీప నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే నువ్వు నా డాక్టర్ బాబు నేను నా నుంచి దూరం చేయలేవు అని అంటుంది. అప్పుడు మౌనిత ఇలాంటి వంటలు నువ్వు ఎన్ని చేసినా నా కార్తీక్ ని నా నుంచి దూరం చేయలేవు అంటూ ఇద్దరు ఘర్షణ పడుతూ ఉంటారు. చివరగా మౌనిత నీ డాక్టర్ బాబు టిఫిన్ తీసుకు రమ్మని చెప్పాడు చేసుకొని తీసుకొని రా అని దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ మోనిత అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కార్తీక్ మొనితాను నిజంగా మాది ముంబై ఏనా అని అడుగుతూ ఉంటాడు.

Karthika Deepam 05 September 2022 Full Episode
కట్ చేస్తే సౌర్య వారణాసిని వాళ్ళ అమ్మానాన్న గురించి అడుగుతూ ఉంటుంది. అప్పుడు వారణాసి వాళ్లు బ్రతికే ఉంటే ఎప్పుడో మన ఊరు వచ్చేవాళ్ళు కదా.. అమ్మ అని అంటాడు. అప్పుడు వస్తే మన ఇంటికి వస్తారు కదా.. అని అంటుంది. సరే ఇదంతా కాదు ఎలాగైనా నేను అమ్మానాన్నని వెతుకుతానులే కానీ అమ్మానాన్నలకి యాక్సిడెంట్ అయింది ఎక్కడ నాకు ఆ ప్లేస్ చూపించు అని అంటాడు వారణాసి. అప్పుడు సౌర్య వద్దు నేను అక్కడికి వస్తే నాకు ఇంకా హిమ మీద కోపం పెరిగిపోతుంది అని అంటుంది. కట్ చేస్తే దీప టిఫిన్ తీసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ వచ్చావా వంట లక్క అని అనగానే దీప సంబరపడిపోతూ ఉంటుంది. ఇక దీప తెచ్చిన టిఫిన్ కార్తిక్ కి వడ్డిస్తూ ఉంటుంది. తింటూ చాలా బావుంది అని అంటాడు.
అప్పుడు దీప కార్తిక్ కి గతం గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు మౌనిత దీపపై మండిపడుతూ ఉంటుంది. ఇక మౌనిత టిఫిన్ తింటూ ఒక్కసారిగా వామ్టింగ్స్ అయినట్లుగా డ్రామా ఆడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఏమైంది మోనిత అని ఒక్కసారిగా లేచి కంగారు పడుతూ ఉంటాడు. ఇంకాస్త డోస్ పెంచి మౌనిత డ్రామా ఎక్కువ చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ కంగారుపడుతూ శివాని పిలిచి డాక్టర్ని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు శివ వెళ్తాడు. దీప కి మాత్రం ఇదంతా డ్రామా అని డౌట్ వస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మౌనిత ఆడిన డ్రామాలని కార్తీక్ నమ్మి.. దీపి దగ్గరికి వెళ్లి తనని కోప్పడుతూ ఉంటాడు. దాంతో దీప బాధ పడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…