Karthika Deepam 10 May Today Episode : అడ్డంగా ఇరుక్కుపోయిన జ్వాల.. నిరుపమ్, హిమకు పెళ్లి అనౌన్స్ చేసిన సౌందర్య.. దీంతో జ్వాల షాకింగ్ నిర్ణయం

Authored By Varun G | The Telugu News | Published on: May 10, 2022, 10:30 am

Karthika Deepam 10 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 1348 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వప్నకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబతాడు సత్యం. జీవితంలో కలిసి నడవలేకపోయినా.. లోపలిదాకా అయినా కలిసి నడుద్దాం పదా అంటాడు సత్యం. ఆ తర్వాత ఇద్దరూ హాల్ లోపలికి వెళ్తారు. వెల్ కమ్ న్యూ కపుల్ అంటాడు నిరుపమ్. కొత్త జంటకు స్వాగతం అంటాడు ప్రేమ్. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని అందరూ చెబుతారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు.. వచ్చినందుకు థాంక్స్ స్వప్న.. అంటుంది సౌందర్య. ఇది వచ్చిందంటే ఇప్పటికీ నాకు నమ్మకంగా అనిపించడం లేదు అని అనుకుంటుంది సౌందర్య.

karthika deepam 10 may 2022 full episode

karthika deepam 10 may 2022 full episode

నన్ను తక్కువ అంచనా వేయకు మమ్మీ అని అనుకుంటుంది స్వప్న. మరోవైపు కారులో ఫంక్షన్ కు వెళ్తూ ఉంటుంది జ్వాల. ఇంతలో కారును పోలీసులు ఆపుతారు. జ్వాలకు అర్థం కాదు. కారు నీదేనా అని డ్రైవర్ ను అడుగుతారు పోలీసులు. నాదే సార్ అంటాడు. డిక్కీ చెక్ చేయండి అంటారు పోలీసులు. కానిస్టేబుల్స్ వెళ్లి డిక్కీ తెరిచి సార్ ఒకసారి ఇటు రండి సార్ అంటారు. అందులో చూస్తే డబ్బు, నగలు ఉంటాయి. వాటిని చూసి జ్వాల కూడా షాక్ అవుతుంది. బిజినెస్ ఇదేనా.. మీ బాబాయి చాలా కష్టజీవి అంటారు పోలీసులు.

బాబాయి ఏంటిది అంటుంది. కష్టపడి దొంగతనం చేసి సంపాదించిన సొమ్ము అంటారు పోలీసులు. ఈ దొంగతనాలతో ఏ సంబంధం లేదు సార్ అంటుంది జ్వాల. కానీ… పోలీస్ స్టేషన్ కు వచ్చి వెళ్లాలి అంటారు పోలీసులు. మరోవైపు సత్యం, స్వప్న పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి.

మరోవైపు శౌర్య ఎక్కడ వస్తుందో అని హిమ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు కేక్ కట్ చేస్తూ సత్యం, స్వప్న.. ఇద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. అందరి కోసం అయినా ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం అని తన చేతిని తీసుకొని సత్యం కేక్ కట్ చేస్తాడు.

ఆ తర్వాత సౌందర్య.. మీ అందరి సమక్షంలో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటుంది. నా మనవరాలు హిమను.. నా మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించాను అంటుంది సౌందర్య. దీంతో హిమను తనకే ఇవ్వబోతున్నారు అని అనుకుంటాడు ప్రేమ్.

ఈ సందర్భంగా నా మనవడికి, నా మనవరాలికి పెళ్లి చేయబోతున్నాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటుంది సౌందర్య. దీంతో స్వప్నకు కోపం వస్తుంది. మమ్మీ ఏంటిది అంటుంది. దీంతో చెప్పాను కదా స్వప్న.. నీకు ఇది మ్యారేజ్ డే గిఫ్ట్ అని అంటుంది సౌందర్య.

Karthika Deepam 10 May Today Episode : స్వప్నకు షాకిచ్చిన సౌందర్య

మమ్మీ.. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అంటుంది. వీటినే సర్ ప్రైజెస్ అంటారు అంటుంది సౌందర్య. హిమ ఇలా రా అమ్మ అంటుంది సౌందర్య. వెళ్లు హిమ అంటాడు ప్రేమ్. నా మనవరాలిని నా మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను.

ఆ మనవడు ఎవరంటే.. డాక్టర్ హిమను పెళ్లి చేసుకోబోయే మనవడు డాక్టర్ నిరుపమ్ ని ఇక్కడకి రావాల్సిందిగా కోరుతున్నాను అంటుంది సౌందర్య. దీంతో ప్రేమ్ షాక్ అవుతాడు. ప్రేమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో అక్కడి నుంచి ప్రేమ్ వెళ్లిపోతాడు.

ఫంక్షన్ అయిపోయాక.. అందరూ వెళ్లిపోయాక ఏమనుకుంటున్నావు మమ్మీ అంటుంది స్వప్న. అంటే.. నాకు ఎలాంటి సమాచారం లేకుండా అందరి ముందు సడెన్ గా చెబితే అయిపోతుందా. తెలివిగా పెళ్లి గురించి చెప్పి నన్ను లాక్ చేశానని సంతోషపడుతున్నావా అంటుంది స్వప్న.

మరోవైపు జ్వాలకు ఫంక్షన్ కు వెళ్లేందుకు లేట్ అవుతుంది. ఆటోలో వెళ్తూ ఉంటుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా తప్పు లేదని నిరుపించుకొని వచ్చేసరికి ఇంత సమయం పట్టిందని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp