Karthika Deepam 10 Sep Today Episode : సీన్ రివర్స్.. గన్ లాక్కొని మోనితకే గురిపెట్టిన దీప.. కోర్టులో కార్తీక్ పై విచారణ.. కోపంలో దీప మోనితను చంపేస్తుందా? లేక కోర్టుకు తీసుకొస్తుందా?

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
Karthika Deepam 10 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 10 సెప్టెంబర్ 2021, శుక్రవారం రోజుది తాజాగా విడుదలైంది. లేటెస్ట్ ఎపిసోడ్ 1141 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓవైపు కార్తీక్ ను కోర్టుకు తీసుకెళ్తారు పోలీసులు. మరోవైపు పెట్రోల్ అయిపోయిందని వారణాసి.. పెట్రోల్ తేవడానికి వెళ్తాడు. దీంతో కారు దగ్గరే ఉంటుంది దీప. ఇక.. మోనిత దీపను చూసి అబ్బ.. భలేగా దొరికింది.. ఎలాగైనా దీపను ఇక్కడే చంపేయాలని అనుకుంటుంది మోనిత.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
తన దగ్గర ఉన్న గన్ తీసుకొని దీప దగ్గరికి వస్తుంది. కారులో పెట్రోల్ అయిపోయిందని తెలుసుకున్న మోనిత.. నెమ్మదిగా గన్ పట్టుకొని కారు వెనుక నుంచి తన దగ్గరికి వస్తుంది.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
కట్ చేస్తే.. కోర్టు సీన్ వస్తుంది. కార్తీక్ బోన్ లో నిలబడతాడు. జడ్జి అప్పుడే వస్తాడు. ప్రొసీడ్ అంటాడు. వెంటనే లాయర్ లేచి.. కార్తీక్ ఒక డాక్టర్ అని చెప్పి.. కార్తీక్, మోనితకు మధ్య ఉన్న సంబంధం గురించి చెబుతాడు. మోనిత గర్భం దాల్చిందని.. ఆ తర్వాత కార్తీక్ మొహం చాటేసి.. తనను చీదరించుకున్నాడని చెబుతాడు. రోషిణి మేడమ్ కేసును టేకప్ చేసిందని.. కార్తీక్ పై మోనిత కేసు పెట్టిందని చెబుతాడు. దీంతో ఆమెను చంపాలనుకొని రివాల్వర్ తో షూట్ చేసి చంపేయడంతో పాటు ఆ శవాన్ని కూడా దాచేశాడు. మానవత్వం చూపించాల్సిన డాక్టర్.. రాక్షసత్వం చూపించి తన వృతికే మోసం చేశాడు. కాబట్టి.. కార్తీక్ కు కఠినమైన శిక్ష వేయాలని లాయర్ జడ్జిని కోరుతాడు.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
Karthika Deepam 10 Sep Today Episode : ఏసీపీ రోషిణిని బోనులోకి పిలిచిన కార్తీక్ తరుపు లాయర్
కార్తీక్.. తరుపు లాయర్ ఏసీపీ రోషిణిని బోనులోకి పిలిచి.. మాట్లాడుతాడు. ముద్దాయి కార్తీక్ న మీరే కదా అరెస్ట్ చేసింది. అసలు.. కంప్లయింట్ ఎవరు ఇచ్చారు.. అని అడుగుతాడు లాయర్. మోనిత పనిమనిషి ప్రియమణి.. అని చెబుతుంది రోషిణి. ఆమెకు కార్తీకే చంపాడని ఎలా తెలుసు. కంప్లయింట్ ఇచ్చింది కాబట్టి.. శవాన్ని చూడకుండానే.. అలా ఎలా కార్తీక్ ను అరెస్ట్ చేస్తారని అడుగుతాడు కార్తీక్ తరుపు లాయర్.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ లేరా అని అడిగితే.. ప్రత్యక్ష సాక్షి ఉంది.. కార్తీక్ అత్త భాగ్య.. అని చెబుతుంది రోషిణి. కార్తీకే ఈ హత్య చేశాడని చెప్పిన పోలీసులు.. కార్తీకే ఈ హత్య చేశాడని చెప్పేందుకు ప్రత్యక్ష సాక్షులను మాత్రం తీసుకురాలేకపోయారు.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
ఇక.. మిగిలింది మిస్ అయిన రివాల్వర్ లోని రెండు బుల్లెట్స్. అవి ఏమయ్యాయో తెలియడానికి.. కార్తీక్ తల్లి సౌందర్యను ప్రశ్నించాలి.. అని అడుగుతాడు లాయర్. మీ పేరు.. అని అడుగుతాడు లాయర్. మీకు లైసెన్స్ రివాల్వర్ ఉందా? అని అడుగుతే ఉంది.. అని చెబుతుంది. మరి ఆ రెండు బుల్లెట్లు ఏమయ్యాయి అని అడుగుతాడు లాయర్. ఒకటి మోనిత బాడీలో, రెండోది మోనిత మిస్ అయిన దగ్గర ఉండాలి.. అని ఏసీపీ రోషిణి చెబుతుంది. అయితే.. మోనిత మా ఇంటికి తరుచూ వస్తుండేది.. తనే తీసి ఉంటుందని నాకు అనుమానం.. అని చెబుతుంది సౌందర్య. మోనిత, కార్తీక్.. రిలేషన్ షిప్ గురించి అడిగితే.. వాళ్లు క్లాస్ మెట్స్ అని చెబుతుంది సౌందర్య.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
Karthika Deepam 10 Sep Today Episode : దీప తలకు గన్ గురి పెట్టిన మోనిత
కట్ చేస్తే.. మోనిత.. దీప తలకు గన్ గురి పెడుతుంది. కదలకు.. వెంటనే కాల్చేస్తా.. అని చెబుతుంది. కారెక్కు అంటుంది. వారణాసి అని పిలుస్తుంది. కారు ఎక్కు అని అంటుంది. బెదిరించిన. వారణాసి డ్రైవ్ చేయి అని అంటుంది. అతి తెలివి చూపించకు. తిన్నగా ఊరవతలి బ్రిడ్జి దగ్గరికి తీసుకెళ్లు.. అని వారణాసిని బెదిరిస్తుంది మోనిత.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
నీకు ఏం కావాలనుకుంటున్నావు.. అని ప్రశ్నిస్తుంది దీప. ఇంకా ఏం చేద్దామనుకుంటన్నావు అంటే.. కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటన్నాను. నువ్వు చచ్చిపోతే.. మీ ఆయనన్ను నేను పెళ్లి చేసుకుంటా. నాకు కావాల్సింది అదే. కాసేపట్లో కార్తీక్ ను పెళ్లి చేసుకుందామనుకునే సరికి.. నువ్వొచ్చి అంతా వేస్ట్ చేశావు. నువ్వు చచ్చిపో బంగారం.. మీ ఆయన్ను నాకు ఇచ్చిపో.. అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది మోనిత.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
Karthika Deepam 10 Sep Today Episode : కోర్టు బోనులో కార్తీక్ తల్లి సౌందర్య
కట్ చేస్తే.. మళ్లీ కోర్టు సీన్ మొదలవుతుంది. కోర్టు బోనులో నిలబడ్డ ప్రతి నిందితుడి తల్లి తన కొడుకు నిర్దోషే అని చెబుతుంది. ఈ కేసు నుంచి బయట పడాలని కోర్టును కోరుతుంది. కానీ నేను అలా కాదు. తప్పు చేస్తే నాకొడుక్కి శిక్ష వేయమనే అంటాను. నా కొడుక్కే కాదు.. నేరం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే.. కానీ.. నాకొడుకు నిర్దోషి.. ఒక నిండు ప్రాణం తీసేంత కర్కోటకుడు కాదు. వాడిని నేను అలా పెంచలేదు. నీతిని న్యాయాన్ని, దర్మాన్ని విలువలను.. నేర్పి పెంచాను. అలాంటి వాడు ఈ హత్య చేశాడంటే నేను నమ్మలేను. మోనిత చేసిన దారుణాలన్నీ తెలిసి.. ఆవేశంగా వెళ్లిన మాట మాత్రం వాస్తవం. కానీ.. వివేకం వాడిని ఆపింది. విచక్షణ.. వెనక్కి తిరిగి వచ్చేలా చేసింది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలన్నీ కల్పితాలు. నీతికి సాక్ష్యం అడిగితే నేను తీసుకురాలేను. నిజాయితికి సాక్ష్యం అడిగితే.. వాడికి తెలిసిన ఎందరినో తీసుకురాగలను. శబ్దం భయంకరమైనది.. నిశ్శబ్దం ఇంకా భయంకరమైనది. నా కొడుకు ఇప్పుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. నిత్తేజంగా ఒక చేతనావస్థలో కనబడుతున్నాడు. ఈ విరక్తి, ఈ వైరాగ్యం, ఈ వైరాగ్యం.. ఈ మౌనం.. నిర్దోషిని పట్టుకొని దోషిగా నిలబడితే నిశ్ఛేష్టుడయ్యాడు.. అని చెబుతుంది సౌందర్య.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
హత్య చేశాడు అనడానికి అవకాశాలే తప్ప.. చేయలేదు అనడానికి ఆధారాలు ఎక్కడా నాకు కనిపించలేదు.. వినిపించలేదు.. అని సౌందర్య.. కోర్టులో చెబుతుంది.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
Karthika Deepam 10 Sep Today Episode : కార్తీక్ పై విరుచుకుపడ్డ మోనిత తరుపు లాయర్
కట్ చేస్తే.. మోనిత తరుపు లాయర్.. మళ్లీ కార్తీక్ పై విరుచుకుపడతాడు. వ్యక్తిగత జీవితంలో ఇతడు ఒక అనుమానపు మొగుడు. గర్భవతిగా మారిన మోనిత.. తనకు న్యాయం కావాలని పోరాటం మొదలు పెట్టింది. తన అడ్డు తొలగించుకోవడం కోసం నిలువునా ప్రాణాలు తీశాడు. అని చెబుతాడు లాయర్.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa
కట్ చేస్తే.. తను ఉండే రూమ్ కు దీపను మోనిత తీసుకెళ్తుంది. ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే నిన్ను చంపేస్తాను. క్షణాలు లెక్కపెట్టుకో.. అంటుంది మోనిత. దీంతో ఒకటి రెండు అంటూ లెక్కపెట్టినట్టు యాక్షన్ చేసిన దీప.. వెంటనే మోనిత చేతుల్లోంచి గన్ లాక్కొని మోనితకు గురి పెడుతుంది. అంతే.. దెబ్బకు మోనిత భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

karthika deepam 10 september 2021 friday episode 1141 highlightsa