Karthika Deepam 11 March Today Episode : కారు ప్రమాదంలో అర్ధంతరంగా చనిపోయిన కార్తీక్, దీప.. తృటిలో చావును తప్పించుకున్న హిమ.. కార్తీక్, దీప చనిపోవడంతో మోనిత షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 11 March Today Episode : కారు ప్రమాదంలో అర్ధంతరంగా చనిపోయిన కార్తీక్, దీప.. తృటిలో చావును తప్పించుకున్న హిమ.. కార్తీక్, దీప చనిపోవడంతో మోనిత షాకింగ్ నిర్ణయం

 Authored By gatla | The Telugu News | Updated on :11 March 2022,10:33 am

Karthika Deepam 11 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 మార్చి 2022, శుక్రవారం ఎపిసోడ్ 1297 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమకు డ్రైవింగ్ పిచ్చి పట్టింది అంటుంది శౌర్య. దీంతో దాన్ని ఏమనకు.. మళ్లీ అలుగుతుంది అంటుంది దీప. నాన్నకు సిగ్నల్స్ దొరకడం లేదేమో నేను అటు వెళ్లి ట్రై చేస్తాను అంటుంది శౌర్య. అమ్మ.. కూర్చోవా.. అంటుంది హిమ. రా కూర్చో అని తనను కారులో కూర్చోబెడుతుంది. అమ్మ.. సీటు బెల్టు పెట్టుకో అంటుంది. నేను ఇప్పుడు కారు నడుపుతాను అంటుంది హిమ. దీంతో వద్దు వద్దు అని వారించినా కూడా హిమ వినదు. హిమ కారు స్టార్ట్ చేసి నడిపిస్తూ ఉంటుంది. కానీ.. తనకు కంట్రోల్ తప్పుతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు.

karthika deepam 11 march 2022 full episode

karthika deepam 11 march 2022 full episode

ఇంతలో కార్తీక్.. కారును చూస్తాడు. ఆపండి.. అంటూ కారు వెనుక పరిగెత్తుతుంటాడు కార్తీక్. హిమ.. ఆపు అంటాడు. కానీ.. తను కారును కంట్రోల్ చేయలేకపోతుంది. మరోవైపు సౌందర్య దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలో దీప కాల్ వస్తుంది. శౌర్య కాల్ చేసి ఆ తర్వాత మరిచిపోయి.. కారు వెనుక పరిగెడుతూ ఉంటుంది. సౌందర్య ఫోన్ లిఫ్ట్ చేసి.. అమ్మ.. అమ్మ అంటూ అరుస్తూ వెళ్లడం విని సౌందర్య భయపడుతుంది. ఇంతలో కారును అందుకొని కార్తీక్ లోపలికి వెళ్తాడు. కారు స్టీరింగ్ అందుకుంటాడు. అంతలో ఓ రాయి మీదకి కారు టైరు ఎక్కి.. కారు అదుపుతప్పుతుంది. దీంతో కారు బోల్తా పడి లోయలో పడిపోతుంది.

లోయలో పడి కారు నుజ్జునుజ్జు అవుతుంది. ఆ తర్వాత కారు ఒక్కసారిగా పేలిపోతుంది. కారుకు మంటలు అంటుకుంటాయి. ఫోన్ ఆన్ లోనే ఉండటంతో శౌర్య మాట్లాడే మాటలు అన్నీ వింటుంది సౌందర్య. ఆ తర్వాత శౌర్య స్పృహతప్పి పడిపోతుంది.

మరోవైపు లక్ష్మణ్ అన్నం తింటూ టీవీ చూస్తుంటాడు. ఇంతలో వార్తల్లో చిక్ మగళూరులో కారు ప్రమాదంలో కార్తీక్ చనిపోయినట్టు వార్త రావడం చూసిన లక్ష్మణ్.. వెంటనే బస్తీ వాళ్లతో కలిసి వెళ్లి మోనితను కలుస్తాడు. డాక్టర్ బాబు చనిపోయారని టీవీలో చూపిస్తున్నారమ్మా అని చెబుతాడు.

వెంటనే టీవీ పెట్టి.. వార్త చూసి కుప్పకూలిపోతుంది మోనిత. కట్ చేస్తే కార్తీక్ ఇంటికి అందరూ బంధువులు వచ్చి ఏడుస్తూ ఉంటారు. దీప తండ్రి కూడా వస్తాడు. మరోవైపు చిక్ మగళూరు వెళ్లి శౌర్యను తీసుకొని వస్తారు సౌందర్య వాళ్లు. బంధువులు.. సౌందర్య, ఆనంద రావును ఓదార్చుతారు.

మేడమ్.. ఇంత అన్యాయం జరిగిపోయింది మేడమ్ అంటాడు వారణాసి. దీపక్క మంచితనం, డాక్టర్ బాబు మంచితనం చూసి ఆ దేవుడికే కన్ను కుట్టినట్టుంది. లేకుంటే ఇలా ఎందుకు జరుగుతుందమ్మా అంటాడు వారణాసి. మా దీపక్క మంచితనం ముందు ఆ దేవుడు కూడా కనిపించడని.. దీపక్కను, డాక్టర్ బాబును ఆ దేవుడు బలి తీసుకున్నాడమ్మా అంటాడు వారణాసి.

మా దీపక్కే మాకు దిక్కు మేడమ్. ఇప్పుడు దీపక్క లేకుండా ఎలా బతుకుతాం మేడమ్ అంటాడు వారణాసి. అప్పుడే పూజారి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది సౌందర్య. అక్కడ పూజారి కూడా ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్లి మీకు ముందే తెలుసు కదా పూజారి గారు అని అడుగుతుంది.

స్థల ప్రభావం.. జాగ్రత్త అన్నారు కానీ.. మీ బిడ్డలకు ప్రమాదం అని ఎందుకు చెప్పలేదు అయ్యా అని ప్రశ్నిస్తుంది. నా కన్నపేగు కాలిపోతుందని ఎందుకు హెచ్చరించలేదు అంటుంది సౌందర్య. ప్రాణమే పోతుందంటే ఊరు దాటనిచ్చేదాన్నా అంటుంది సౌందర్య.

నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా నా ప్రాణాలు కాపాడుకునేదాన్ని కదా.. ఎందుకు చెప్పలేదు అంటుంది సౌందర్య. దీంతో ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా అంటాడు పూజారి. బావ గారు నా బిడ్డతో పాటు కష్టాలు కూడా పుట్టాయి అన్నట్టుగా.. అది పుట్టినప్పటి నుంచి కష్టాల మధ్యనే బతికింది అని అంటాడు దీప తండ్రి.

Karthika Deepam 11 March Today Episode : కార్తీక్, దీప, హిమకు పిండప్రదానం చేసిన సౌందర్య ఫ్యామిలీ

నా బిడ్డ కష్టాలు తీర్చమని దేవుడికి మొక్కని రోజు లేదు. కానీ.. దాని కష్టాన్ని ఇలా తీరుస్తాడని అనుకోలేదు. వందేళ్ల కష్టాన్ని అనుభవించావు.. చాలమ్మా అని నా బిడ్దను తీసుకెళ్లిపోయాడు ఆదేవుడు అని బాధపడతాడు దీప తండ్రి.

అయ్యో భగవంతుడా.. నా బిడ్డలకు ఇంతమంది అభిమానాన్ని ఇచ్చి.. నూరేళ్ల ఆయుష్షును ఇవ్వలేకపోయావు ఏంటయ్యా అని బాధపడుతుంది సౌందర్య. మమ్మీ.. ఊరుకో మమ్మీ అంటాడు ఆదిత్య. మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి.. మీరే ఇలా అయిపోతే ఎలా అత్తయ్య అంటుంది శ్రావ్య.

మరోవైపు కార్తీక్, దీప, హిమలకు పిండప్రదానం చేస్తారు. వాళ్ల ఫోటోలకు దండలు వేసి కార్యక్రమాలు చేస్తారు. ఇంతలో సౌందర్య కూతురు ఇంటికి వస్తుంది. కార్తీక్ ఫోటోను చూసి ఏంటి తమ్ముడు ఇది.. నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు.. అంటుంది.

నీ జీవితం బాగుపడుతుందని తెలిసినప్పుడు అందరికంటే ముందు సంతోషపడింది నేనే తెలుసా అంటుంది కార్తీక్ అక్క. నా తమ్ముడు సంతోషంగా ఉన్నాడని చెప్పుకుంటూ ఉన్నాను. కానీ.. ఇంతలోపే ఇంత ఘోరం జరిగిపోయింది అని ఏడుస్తుంది.

నీ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది ఏంట్రా అని ఏడుస్తుంది. మీ అందరి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని మొక్కుతుంది. నాన్న అంటూ ఆనంద రావు దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది. బాధపడకు నాన్న.. మన చేతుల్లో ఏముంది. జరగకూడనిది జరిగిపోయింది. గుండెను రాయి చేసుకొని ఉండటం తప్ప.. చేయగలిగింది ఏదీ లేదిప్పుడు అంటుంది.

ఇంతలో తన అల్లుడు కూడా వస్తాడు. అయిపోయింది అల్లుడు అంటాడు గోవిందరాజు. నా బిడ్డ మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు అంటాడు. మనం చేయగలిగింది ఏముంది. ఇలా జరుగుతుందని ఎవరు మాత్రం అనుకుంటారు. రాసి పెట్టి ఉంది.. జరిగిపోయింది అంటాడు తన అల్లుడు.

మిమ్మల్ని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు అంటాడు అల్లుడు. దీంతో మా రాత ఏంటయ్యా ఇలా రాశాడు అని అంటుంది సౌందర్య. మా కొడుకు కోడలు కలిశారు.. ఇక సంతోషంగా ఉంటారు అని అనుకున్నాం కానీ.. అర్ధాంతరంగా ఇలా వదిలేసి వెళ్లిపోయారు అని అంటుంది సౌందర్య.

వాళ్ల జీవితం అలా ముగిసిపోయింది. కనీసం మీరైనా కలిసి ఉంటారనుకుంటే మాకు ఆ ఆనందం కూడా లేదు అంటుంది సౌందర్య. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా బతికేస్తున్నారు అంటుంది సౌందర్య. దీంతో వద్దు అత్తయ్య దాని గురించి మాట్లాడటంలో ప్రయోజనం ఏముంది అంటాడు అల్లుడు.

ఇంతలో మోనిత తెల్లచీర కట్టుకొని సౌందర్య ఇంటికి వస్తుంది. కార్తీక్ ఫోటో దగ్గరికి వెళ్లి.. నీ ఆత్మకు మాత్రం శాంతి కలగాలని కోరుకుంటున్నాను కార్తీక్ అని అంటుంది మోనిత. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని ఆవేశపడతాడు ఆదిత్య. దీంతో వద్దు అంటుంది సౌందర్య.

ఎప్పుడూ కళ్ల ముందు ఉండే కార్తీక్.. ఈరోజు ఈ ఫోటోలో మిగిలిపోయాడు అంటుంది మోనిత. నా కార్తీక్ చచ్చిపోయాడు. కాదు.. చంపేశారు అంటుంది మోనిత. అవును.. తన చావుకు కారణం మీరే అంటుంది మోనిత. ఒక్క రోజు అయినా అతడిని మనశ్శాంతిగా ఉంచారా అని ప్రశ్నిస్తుంది మోనిత.

కనీసం తన ఇష్టానికి తనను వదిలేశారా అంటుంది. ఎంత సేపు నాతో కలిసి తిరుగుతున్నాడని.. తనను బాధపెడుతూ వచ్చారు. దూరం పెడుతూ వచ్చారు అంటుంది మోనిత. చివరికి ఎవరికీ అందనంత దూరం పంపించేశారు.. అంటుంది మోనిత.

దీంతో మా అన్నయ్యను మేము ఎలా చూసుకున్నామో.. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అంటాడు ఆదిత్య. దీంతో తెలుసు నాకు అంటుంది మోనిత. ఎన్నోసార్లు కార్తీక్ కళ్లలో కన్నీరు వచ్చిన ప్రతిసారి తనకు ఓదార్పు నేను అయ్యాను అంటుంది మోనిత.

మీరు ఎంత బాగా చూసుకున్నారు అన్నది కార్తీక్ నాకు సేద తీరిన ఎన్నోసార్లు నాతో చెప్పుకున్నాడు అంటుంది మోనిత. అంతెందుకు.. ప్రపంచంలో భార్యాభర్తలు విడిపోవడానికి విడాకులు ఉన్నట్టు.. తల్లిదండ్రుల నుంచి కొడుకు విడిపోవడానికి ఏదైనా అవకాశం ఉందా మోనిత అని అడిగి మరీ నా దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డాడు అంటుంది మోనిత.

ఒక్క విషయం మాత్రం చెబుతున్నాను.. అంటుంది మోనిత. నాతో కార్తీక్ బంధం మీరు అనుకున్నట్టు తెంపేస్తే తెగిపోయే బంధం కాదు అంటుంది మోనిత. చాలా పవిత్రమైనది. మాది ప్రేమ బంధం అంటుంది మోనిత. ఆ బంధానికి ఆస్తులు.. అంతస్తులు ఏవీ అవసరం లేదు అంటుంది మోనిత.

ప్రేమకు ప్రేమ తోడుంటే చాలు అంటుంది. అంతకు మించి ప్రేమ ఎప్పుడూ ఏమీ కోరుకోదు అంటుంది మోనిత. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. రోడ్డు ప్రమాదంలో కార్తీక్, దీప మాత్రమే చనిపోతారు. హిమ ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది.

అయితే.. శౌర్య దృష్టిలో మాత్రం హిమ ఒక హంతకురాలిగానే మిగిలిపోతుంది. ఎందుకంటే.. తన వల్లే తన అమ్మానాన్న చనిపోయారని భావించి.. ఇంట్లో తన వస్తువులేవీ లేకుండా చేస్తుంది. తన ఫోటోను కూడా తీసి బయట విసిరిపారేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది