Karthika Deepam 11 May Today Episode : నిరుపమ్ కు షాకిచ్చిన హిమ.. జ్వాల కోసం నిరుపమ్ ను త్యాగం చేస్తోందా? జ్వాల ప్రేమ విషయం హిమకు తెలిసిందా?

Karthika Deepam 11 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 మే 2022, 1349 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి ఆటోలో ఫంక్షన్ కు వెళ్తూ ఉంటుంది జ్వాల. తొందరగా వెళ్లాలని అనుకుంటుంది. ఫంక్షన్ అయిపోకుండా చూడు అని దేవుడిని వేడుకుంటుంది. అయినా.. గొప్పింటోళ్లు కదా.. వాళ్ల ఫంక్షన్లు నైట్ అంతా జరుగుతూనే ఉంటాయి అని అనుకుంటుంది జ్వాల. త్వరగా ఫంక్షన్ హాల్ కు వెళ్తుంది కానీ.. అక్కడ ఎవ్వరూ ఉండరు. చూసి షాక్ అవుతుంది. ఎవరూ లేరేంటి అని అనుకుంటుంది. ఫంక్షన్ అయిపోయిందా అని అక్కడున్న వాళ్లను అడుగుతుంది. దీంతో ఎప్పుడో అయిపోయింది మేడమ్ అంటారు.

Advertisement
karthika deepam 11 may 2022 full episode
karthika deepam 11 may 2022 full episode

డాక్టర్ సాబ్.. సారీ. నేనే లేట్ అయ్యాను అని అనుకుంటుంది. మరోవైపు హిమ, నిరుపమ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆకాశంలో చుక్కలు, ఈ వాతావరణం బాగుంది కదా హిమ అంటాడు. నాతో ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడుతున్నావా అంటుంది హిమ. మమ్మీ వాళ్ల మ్యారేజ్ ఫంక్షన్ తో పాటు.. మన పెళ్లి గురించి కూడా అమ్మమ్మ చెప్పడంతో నాకు చాలా సంతోషం వేస్తోంది అంటాడు నిరుపమ్. మొత్తానికి ఇద్దరూ సంతోషంగా ఉంటారు. హిమ కూడా నిరుపమ్ ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇద్దరూ కాసేపు సరదాగా గడుపుతారు. అమ్మమ్మ పుణ్యమాని మనిద్దరం ఒక్కటవబోతున్నాం కదా అంటాడు నిరుపమ్.

ఇంతలో సౌందర్య వస్తుంది. నానమ్మ.. నా జీవితంలో సగం శౌర్య ఉంది. నా సంతోషంలో సగం శౌర్య ఉండాలి అని చెబుతుంది హిమ. కానీ.. లేదు నానమ్మ. శౌర్య లేకపోతే నా సంతోషం, నా జీవితం అన్నీ సగమే నానమ్మ అంటుంది హిమ.

తను లేకుండా నేను లేను అంటుంది. హిమ.. శౌర్య లేకుండా నేను పెళ్లి చేసుకోను అని నువ్వు అన్నమాట నాకు గుర్తుంది. శౌర్య వచ్చాకే నువ్వు పెళ్లి చేసుకుంటావు. ఇది ముమ్మాటికీ నిజం. నీ ఇష్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి సరేనా. ఇంకేమీ ఆలోచించకు అంటుంది సౌందర్య.

దీంతో శౌర్య వస్తుంది అని మనసులో అనుకుంటుంది హిమ. మరోవైపు సత్యం ఆనందంలో మందు కొడుతూ ఉంటాడు. ఇంతలో గ్లాస్ పట్టుకొని వస్తాడు ప్రేమ్. నాకు కూడా పోయి డాడీ అంటాడు. నువ్వు తాగుతావా అని అడుగుతాడు. దీంతో ఈరోజే మొదలు పెడుతాను అంటాడు ప్రేమ్.

Karthika Deepam 11 May Today Episode : సత్యంతో కూర్చొని హిమనే తలుచుకుంటూ మందు తాగిన ప్రేమ్

నేనేదో నిరుపమ్, హిమ పెళ్లి కుదిరిందని తాగుతున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా అంటాడు సత్యం. నిరుపమ్.. నాకన్నా పెద్దోడని అమ్మమ్మ వాడికి ప్రిఫరెన్స్ ఇచ్చిందా అని అనుకుంటాడు ప్రేమ్. నాకు మాత్రం చాలా బాధగా ఉంది అని అనుకుంటాడు ప్రేమ్.

నాకు కూడా మందు పోయి డాడీ అంటాడు ప్రేమ్. దీంతో ఏంట్రా నీ ఆనందం అంటాడు సత్యం. కచ్చాగానే తాగేస్తాడు ప్రేమ్. దీంతో ఒరేయ్ అలా తాగకురా అంటాడు. కానీ.. ప్రేమ్ ప్రేమను సత్యం అర్థం చేసుకోలేకపోతాడు. మరోవైపు స్వప్నకు తీవ్రంగా కోపం వస్తుంది.

ఇంట్లో ఉన్న వస్తువులు అన్నింటినీ పగులగొట్టేస్తుంది. పట్టరానంత కోపం వస్తుంది. మమ్మీ ధైర్యం ఏంటి. అందరి ముందు అలా చేస్తే నేను కాదనను అనా.. మా మమ్మీ ఏమనుకుంటోంది అని ఇంట్లో ఉన్న వస్తువులను విసిరేస్తుంది. ఇంతలో సౌందర్య అక్కడికి వస్తుంది.

స్వప్న.. విసిరేసుకోవడం.. పారేసుకోవడం చాలా ఈజీ కానీ.. మళ్లీ వాటిని తెచ్చుకోవడం చాలా కష్టం అంటుంది సౌందర్య. పోగొట్టుకున్నవి మళ్లీ కొనుక్కోవచ్చు కానీ.. అవి వస్తువులు అయితేనే. బంధాలను మాత్రం కొనుక్కోలేవు అంటుంది సౌందర్య.

ఆ నష్టజాతకురాలిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టుకొని నా పెద్ద కోడలు అని ఊరేగమంటావా అంటుంది స్వప్న. దీంతో హిమ నష్టజాతకురాలు కాదు అని చెబుతుంది సౌందర్య. నా కొడుకు నా ఇష్టం అంటుంది స్వప్న. ఎంత చెప్పినా స్వప్న మాత్రం వినదు.

మరోవైపు జ్వాలను చూసి తన కారు ఆపుతుంది హిమ. తన దగ్గరికి వెళ్తుంది. షాపింగ్ కు వెళ్తున్నా.. నువ్వు కూడా పదా అంటుంది. డాక్టర్ సాబే రమ్మన్నాడు అంటుంది. దీంతో సరే.. పదా వెళ్దాం అంటుంది జ్వాల. నీ వెనుకే నా ఆటో వస్తుంది పదా అంటుంది జ్వాల.

డాక్టర్ సాబ్ పిలవడం.. నేను వెళ్లకపోవడమా అని అనుకుంటుంది జ్వాల. మరోవైపు హిమ, నిరుపమ్ ఎంగేజ్ మెంట్ జరుగుతూ ఉంటుంది. ఓ గుడిలో వాళ్ల ఎంగేజ్ మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో అదే గుడికి వచ్చిన జ్వాలను చూస్తుంది హిమ.

తాంబూలాలు మార్చుకునే సమయానికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది హిమ. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోబోతుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement