Karthika Deepam 11 Oct Monday Episode : నన్ను ముట్టుకోవద్దు డాడీ.. అని కార్తీక్ పై హిమ సీరియస్.. అందరూ షాక్
Karthika Deepam 11 Oct Monday Episode : కార్తీక దీపం సీరియల్ ఆదివారం ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 11 అక్టోబర్ 2021, సోమవారం రోజున ప్రసారం అయ్యే ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసు కదా. దీపకు యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడిన ప్రియమణి.. తన బాధలను దీపకు చెప్పుకుంటుంది. తినడానికి తిండి కూడా లేదని చెప్పింది. ఎవ్వరూ పని ఇవ్వడం లేదని.. కుదిరితే తమ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి.. అని దీపను కోరుతుంది. దీంతో దీప కాస్త తడబడుతుంది. నాకు ఓకే కానీ.. అత్తయ్య గారు ఒప్పుకుంటారో లేదో అని అంటుంది దీప. సౌందర్య గారు ఒప్పుకుంటేనే నేను పనిలో చేరుతానమ్మా.. నాకు మీరు డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. మూడు పూటలా తిండి పెడితే చాలు అని అంటుంది ప్రియమణి.

karthika deepam 11 october 2021 episode highlights
దీంతో ప్రియమణిని ఇంటికి తీసుకెళ్తుంది దీప. ఇంతలో కార్తీక్ పుట్టిన రోజు సందర్భంగా తన పిల్లలు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతారని అనుకుంటాడు కార్తీక్. కానీ.. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకుండా వెళ్లిపోతుంది హిమ. శౌర్య మాత్రం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంది. పిల్లలు ఎందుకు తనను చూసి అలా దూరం వెళ్తున్నారో అర్థం కాదు కార్తీక్ కు. ఇంతలో ప్రియమణి ఇంటికి రావడం చూసిన కార్తీక్.. నువ్వెందుకు వచ్చావు.. ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్లు అంటూ సీరియస్ అవుతాడు. నీలాంటి దాన్ని చేరదీయడం చాలా తప్పు అంటాడు. కానీ.. సౌందర్య కాళ్ల మీద ప్రియమణి పడటంతో.. సరే ఎటువంటి నాటకాలు ఆడకుండా బుద్ధిగా ఉండాలంటూ ప్రియమణికి చెబుతుంది సౌందర్య.
Karthika Deepam 11 Oct Monday Episode : హిమ ఆసుపత్రికి వచ్చిన విషయం తెలుసుకున్న కార్తీక్
అసలు.. హిమ ఎందుకు తనతో మాట్లాడటం లేదని కార్తీక్ బాధపడుతుండగా అసలు విషయం చెబుతుంది దీప. ఆరోజు ఆసుపత్రికి హిమ వచ్చిందని చెబుతుంది. మిమ్మల్ని కలిసి వెళ్లేందుకు హిమ ఆసుపత్రికి వచ్చిందని దీప చెబుతుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. హిమ ఆసుపత్రికి వచ్చిందా? అని అడుగుతాడు.

karthika deepam 11 october 2021 episode highlights
అవును.. మీరు ఆపరేషన్ లో బిజీగా ఉండటంతో వెయిట్ చేసి వచ్చేసిందట.. అని చెబుతుంది దీప. అంటే.. ఆరోజు మోనిత వచ్చి తనతో మాట్లాడటం హిమ చూసిందా? అని టెన్షన్ పడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. వెంటనే హిమ దగ్గరికి వెళ్తాడు. డాడీ మీద కోపం ఏంటమ్మా హిమ అని అడుగుతాడు. తన తలను పట్టుకొని నిమిరేందుకు ప్రయత్నించగా నన్ను ముట్టుకోవద్దు.. అని అంటుంది హిమ. నన్ను అస్సలు ముట్టుకోవద్దు డాడీ అని చెప్పి దూరంగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.