Karthika Deepam 12 Sep Today Episode : వంటలక్క వేసిన ఎత్తుకి భయపడిపోతున్న మౌనిత… ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్న మౌనిత… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 12 Sep Today Episode : వంటలక్క వేసిన ఎత్తుకి భయపడిపోతున్న మౌనిత… ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్న మౌనిత…

 Authored By prabhas | The Telugu News | Updated on :12 September 2022,10:00 am

Karthika Deepam 12 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1455 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శౌర్యని గుర్తు చేసుకుంటూ తనని నేను ఎక్కడో చూశాను. బాగా దగ్గర మనిషిలా అనిపిస్తుంది. ఎంతమందిని చూసినా అలా అనిపించలేదు. కానీ తనను చూస్తే నాకెందుకు బాగా గుర్తొస్తుంది. అని మౌనితకి చెప్పుకుంటు నీకు గుర్తుందా మౌనిత అని అంటాడు. అప్పుడు మౌనిత తెలియని వారి గురించి ఎందుకు అలా ఆలోచిస్తావు ఇక మర్చిపో అని అంటుంది. అప్పుడు కార్తీక్ నిన్న అడిగాను చూడు అది నా తప్పే అని వంటలక్కని పిలిచావా పూజకి అని అడుగుతాడు. అప్పుడు మౌనిత పిలిచాను.. కార్తీక్ కానీ వాళ్ళింట్లో పూజ చేసుకుంటుందంట రాను అని చెప్పింది అని అంటుంది. అప్పుడు సరే అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

కట్ చేస్తే దీప పూజ చేస్తూ డాక్టర్ బాబు గురించి ఆలోచిస్తూ దేవుని నా భర్తని నా దగ్గరికి చేర్చు దేవుడా లేదా ఆ మౌనిత మీద నమ్మకం పోయేలా చెయ్యి అని కోరుకుంటూ పూజంత కంప్లీట్ చేస్తుంది. కట్ చేస్తే మౌనిత పూజ కార్యక్రమాలు చేస్తూ నా కార్తిక్ గతమంతా మర్చిపోయి నాతో సంతోషంగా ఉండేలా చెయ్ దేవుడా అని మొక్కుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ పంచ కట్టుకోవడం రాక ఇబ్బంది పడుతూ మౌనిత అని పిలుస్తాడు. తనకి కూడా కట్టడం రాదు అదంతా వంటలక్క చూసి.. బయటికి వెళ్ళు బాధపడుతూ శివని పంపిస్తుంది. అప్పుడు శివా ఎల్లి మేడం మీకు పంచ కట్టడం చేతకావడం లేదంట కదా నేను కడతాను అని అంటాడు. ఎవరు చెప్పారు రా నీకు అని అనగానే వంట లెక్క చెప్పింది మేడం అని అంటాడు. అప్పుడు ఒక్కసారిగా కార్తీక్ వంటలక్క వచ్చిందా అని గబగబా వెళ్లబోతుండగా మౌనిత కార్తీక్ ని నువ్వు ఇంకా పంచ కట్టుకోలేదు అని ఆపుతుంది. ఇక శివ పంచ కడతాడు. దీప కార్తీక్ గురించి బాధపడుతూ ఏడుస్తూ ఉండగా కార్తీక్ అక్కడికి వచ్చి ఏమైంది వంటలక్క ఎందుకు బాధపడుతున్నావు నాతో చెప్పు అని అంటుండగా..

Karthika Deepam 12 Sep Today Full Episode

Karthika Deepam 12 Sep Today Full Episode

దీప ఏం మాట్లాడదు.. ఇక అంతలో పంతులు గారిని తీసుకొని మోనిత వస్తు కార్తీక్ చూసి ఈరోజు కోప్పడకూడదు అనుకుంటూ వంటలక్క ఎప్పుడొచ్చావు అని ప్రేమగా మాట్లాడుతూ తనని పంతులు గారి దగ్గర బుక్ చేస్తుంది. ఇక ఇక పూజ సంగతి చూద్దాం పదండి అని అందరూ లోపలికి వెళ్తారు పంతులుగారు దంపతులను పిటల మీద కూర్చోండి అని చెప్తూ ఉండగా అప్పుడు మౌనిత కార్తీక్ ఫీట్ల మీద కూర్చుంటూ ఉండగా.. ఒక్కసారిగా దీప ఆగండి డాక్టర్ బాబు నేను మీకు ఒక విషయం చెప్పాను అది మర్చిపోయారా అని అంటుండగా నాకా గుర్తులేదు వంటలక్క అని అంటాడు. అప్పుడు దీప నేను మీరు ఇలా మర్చిపోతారని ఒక చిట్టి రాసి మీకు జేబులో పెట్టాను ..అనగానే కార్తీక్ లోపలికి వెళ్లి ఆ చిట్టిని తీసుకొచ్చి చదువుతూ ఉంటాడు. ఇక దానిలో నేను ఒక్కడినే పూజలో కూర్చొని పూజ చేయాలి. అనగానే మౌనిత ఒక్కసారిగా ఆగ్రహం తో మండిపడిపోతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నువ్వు ఇలా కోప్పడొద్దని చెప్పాను కదా అని అంటాడు. అప్పుడు దీప మిగతాది కూడా చదవండి..

అనగానే కార్తీక్ నా భార్య అనుకున్నది జరగాలి. నా భార్య నేను సంతోషంగా ఉండాలి. నా భార్యని నన్ను విడదీయాలనుకున్న వాళ్ళు నాశనం అయిపోవాలి. అని చదువుతాడు. అప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో మోనిత ఉంటుంది. ఇక దీప తెగ సంతోషపడబోతూ ఉంటుంది. ఇక పంతులుగారు కూర్చోండి పూజ జరిపిస్తాను అని అంటాడు. అప్పుడు దీప మీకు ఇంతకుముందు ఇలాంటి పూజ చేసినట్టు గుర్తుందా అని గతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మౌనిత భయపడి పోయి ఇక చాలు ఆపు అని నీకు అలాంటి గతం ఏమీ లేదు నేను చెబుతున్న అని అంటుంది. ఇక తర్వాత పూజ లో కూర్చొని పూజ అంతా కంప్లీట్ చేస్తాడు కార్తీక్. ఇక పంతులుగారు వెళ్ళిపోతాడు. ఇక దీప కూడా కార్తిక్ కి థాంక్స్ అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక తర్వాత మౌనిక కార్తీక్ ని నువ్వు దాని ఇంటికి ఎప్పుడు వెళ్ళావ్ అని అంటుండగా.. కార్తీక్ నేను రాత్రి వెళ్ళాను అని చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది