Karthika Deepam 14 Jan Today Episode : మోనిత తాడికొండ వచ్చిందని చెప్పిన కార్తీక్.. దీప షాక్.. ఇంతలో మరో ట్విస్ట్.. మోనితకు దగ్గరైన బస్తీవాసులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 14 Jan Today Episode : మోనిత తాడికొండ వచ్చిందని చెప్పిన కార్తీక్.. దీప షాక్.. ఇంతలో మరో ట్విస్ట్.. మోనితకు దగ్గరైన బస్తీవాసులు

 Authored By gatla | The Telugu News | Updated on :14 January 2022,2:00 pm

Karthika Deepam 14 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 జనవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 1249 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ వంట గదిలోకి వస్తేనే నీకు అంత కోపం వస్తే.. నా పిల్లల మీద కన్నేస్తే నాకెంత కోపం రావాలి. చాలా పద్ధతిగా చెబుతున్నాను వినండి. నా పిల్లల జోలికి అస్సలు రాకండి. అర్థమయిందా? అంటూ రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది దీప. ప్రశాంతంగా, శాంతంగా నేను చెప్పాల్సింది చెప్పాను. మీకు అర్థం అయింది అనుకుంటున్నాను. కూరలో ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. నేను వంట బాగా చేస్తాను అంటూ గరిటెను తీసుకొచ్చి చేయి చాపమంటుంది దీప. ఏంటి అలా చూస్తున్నారు వాత పెడతా అనుకుంటున్నారా.. అలా దొంగ దెబ్బ తీయను లేండి. ఏదైనా చెప్పే చేస్తాను. వేడిగా ఉంది కదా చేయి చాపండి అంటుంది. టేస్ట్ చేయండి అంటుంది. దీంతో చేయి మీద కూర వేస్తే తిని కారం తగ్గింది దీప. నేను అందరి కంటే కారం ఎక్కువ తింటాను.. బిడ్డలకు కూడా కారం ఎక్కువ పెట్టు.. అంటుంది.

karthika deepam 14 january 2022 full episode

karthika deepam 14 january 2022 full episode

నీ బిడ్డలకు ఇక్కడికి వచ్చాక రోషం పౌరుషం పెరగాలి కదా అంటుంది రుద్రాణి. గడువులోగా అప్పు తీర్చే రోజులు దగ్గర పడ్డాయి. చూద్దాం.. అప్పు తీరుస్తారో లేక పిల్లలను.. అంటూ రుద్రాణి అనబోయేసరికి.. అంత దాకా రానివ్వను లేండి రుద్రాణి గారు.. నా పిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటుంది దీప. వెళ్లొస్తాను రుద్రాణి గారు.. అప్పు తీరుస్తాను కదా అప్పుడు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప. ఏంట్రా ఇది నా ఇంటికి వచ్చి నా వంట గదిలోకి దూరి.. వంట చేసుకోవడమే కాకుండా.. నన్నే బెదిరిస్తుందా. ఈ రోజు నుంచి వంట గదిని మూసేయండి. ఈరోజు నుంచి వంట గదిని వాడను. రేపటి నుంచి భోజనం హోటల్ నుంచి తెప్పించండి అంటుంది రుద్రాణి.

మరోవైపు దీప కోసం కార్తీక్ వెయిట్ చేస్తూ ఉంటాడు. దీప ఇంకా రాలేదేంటి అని అనుకుంటుండగానే దీప వస్తుంది. ఏంటి దీప.. ఎక్కడికి వెళ్లావు అంటే.. పిల్లలు చెప్పలేదా.. గ్యాస్ అయిపోతే వంట చేసుకొని తీసుకొస్తున్నాను అంటుంది దీప. ఎక్కడ చేసుకొచ్చావు అని అడుగుతాడు కార్తీక్.

వీధి చివర తెలిసిన వాళ్లు ఉంటే అక్కడ వండుకొని వచ్చాను అంటుంది దీప. ఇంతలో కార్తీక్ చేతికి అయిన గాయాన్ని చూస్తుంది దీప. నాకు తెలియకుండా ఎక్కడైనా పనిచేస్తున్నారా అని అడుగుతుంది దీప. లేదు దీప.. నాకు ఏం పని వస్తుంది చేయడానికి అంటాడు కార్తీక్.

Karthika Deepam 14 Jan Today Episode :  బస్తీ మహిళకు కడుపునొప్పి వస్తే ట్రీట్ మెంట్ చేసిన మోనిత

కష్టాలు అనేవి వర్షాకాలంలో వర్షం లాంటివి. వర్షం వెలిశాక కష్టాలు కూడా పోతాయి. కష్టాలు వర్షంలా కాదు దీప.. నీడలా మన వెంటే వస్తుంటాయి అంటాడు కార్తీక్. మరోవైపు బస్తీకి అప్పుడే వస్తుంది మోనిత. తనకు కడుపు నొప్పి అని బస్తీకి చెందిన ఓ మహిళ ఏడుస్తూ ఉంటుంది.

తనను తీసుకెళ్లడానికి వారణాసి ఆటో తీయబోతాడు కానీ.. ఆటో స్టార్ట్ కాదు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు బస్తీ వాళ్లకు. ఇంతలో మోనిత వెళ్లి వాళ్లను తన క్లీనిక్ కు తీసుకురావాలని చెబుతుంది. తనను తీసుకెళ్లడంతో వెంటనే ట్రీట్ మెంట్ చేస్తుంది. తన ప్రాణాలను కాపాడుతుంది మోనిత.

ఏంటి.. ఎవ్వరూ ఏం మాట్లాడరు ఏంటి.. ఇప్పుడు మీ దీపక్క వచ్చి కాపాడిందా.. నేను కాపాడాను. మీ దీపక్క మీద ప్రేమ ఉంటే తన ఫోటోను ఇంట్లో పెట్టుకొని ఊరేగండి కానీ.. అవసరం ఉన్నప్పుడు ఇలా మన మధ్య విభేదాలు వద్దు అని చెబుతుంది మోనిత.

మరోవైపు కార్తీక్.. మోనిత గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో దీప వచ్చి ఏమైంది అని అడుగుతుంది. మోనిత ఈ ఊరు వచ్చింది అని చెబుతాడు. మోనిత ఇక్కడికి వచ్చిందా.. మిమ్మల్ని చూసిందా అని అడుగుతుంది దీప. లేదు అంటాడు కార్తీక్. కాఫీ తాగుదామని హోటల్ కు వెళ్తే అక్కడ కనిపించింది.. అంటాడు కార్తీక్.

ఆ మోనిత మనల్ని వదిలేలా లేదు. మనం ఇక్కడున్నామని తనకు తెలిసిందా లేక వేరే పని మీద వచ్చిందా అనేది అర్థం కావడం లేదు అంటాడు కార్తీక్. కట్ చేస్తే ఉదయం అవుతుంది. పిల్లలు స్కూల్ కు రెడీ అవుతారు. ఇంతలో కార్తీక్.. టిఫిన్ తీసుకొస్తాడు.

అమ్మ ఎక్కడికి వెళ్లింది డాడీ. ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు అని అడుగుతారు పిల్లలు. అమ్మ వంట చేయడానికి వెళ్లింది. తను మీకు లంచ్ బాక్స్ తెస్తుంది అని చెబుతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది