Karthika Deepam 14 Nov Today Episode : దీపను వాల్తేరు వాణితో మోనిత చంపించబోయిందన్న నిజం తెలుసుకున్న కార్తీక్ ఏం చేస్తాడు? దీపతో కలిసి వెళ్లిపోతాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam 14 Nov Today Episode : దీపను వాల్తేరు వాణితో మోనిత చంపించబోయిందన్న నిజం తెలుసుకున్న కార్తీక్ ఏం చేస్తాడు? దీపతో కలిసి వెళ్లిపోతాడా?

Karthika Deepam 14 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 1509 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవాళ మీ ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి. అయితే కార్తీక్ లేదంటే నువ్వు.. ఇద్దరిలో ఒకరే ఉండాలి అంటూ మోనిత.. దీపపై సీరియస్ అవుతుంది. దీంతో దీపకు కోపం వస్తుంది. ఆపవే.. అమ్మోరుకు బలి ఇస్తా అంటూ తిరిగి వార్నింగ్ ఇచ్చి […]

 Authored By gatla | The Telugu News | Updated on :14 November 2022,9:30 am

Karthika Deepam 14 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 1509 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవాళ మీ ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి. అయితే కార్తీక్ లేదంటే నువ్వు.. ఇద్దరిలో ఒకరే ఉండాలి అంటూ మోనిత.. దీపపై సీరియస్ అవుతుంది. దీంతో దీపకు కోపం వస్తుంది. ఆపవే.. అమ్మోరుకు బలి ఇస్తా అంటూ తిరిగి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు హిమ.. ఆనంద్ తో ఆడుకుంటూ ఉంటుంది. మీ నానమ్మ వచ్చేస్తుందట అంటాడు ఆనంద రావు. శౌర్య ఆలోచిస్తోంది కరెక్టేనేమో. ఒకవేళ అమ్మానాన్నలు బతికే ఉన్నారేమో. అక్కడే ఉన్నారేమో అంటుంది హిమ. దీంతో ఇప్పటికే ఈ ఆలోచనతో శౌర్య వెళ్లిపోయింది. నువ్వు కూడా వెళ్లిపోతావా అంటాడు ఆనంద రావు. అమ్మానాన్నలు బతికే ఉంటే బాగుండు అని అనిపిస్తోంది అంతే అంటుంది హిమ. దీంతో వాళ్లు లేరు.. రారు అని చెబుతాడు ఆనంద రావు.

karthika deepam 14 november 2022 full episode

karthika deepam 14 november 2022 full episode

మరోవైపు దీపాలు కోనేరులో వదిలేందుకు దీప కోనేరు దగ్గరకు వచ్చి కళ్లు మూసుకొని పూజ చేస్తుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత.. నాకే వార్నింగ్ ఇస్తావా.. ఇప్పుడు నేను నీ అంతు చూస్తానే అని అనుకుంటుంది మోనిత. తన చేతుల్లో ఉన్న దీపాలను పక్కన పెట్టి.. తనను కోనేరులో తోసేయబోతుంది. దీంతో అప్పుడే వచ్చిన కార్తీక్.. ఏయ్ అంటూ తనను ఆపి పైకి తీసుకొచ్చి ఏం చేస్తున్నావు. తన ప్రాణాలు తీయాలని చూస్తున్నావా అంటాడు. దీంతో అవును.. నీకు, నాకు మధ్య ఎవరు వచ్చినా ఎవ్వరినీ బతకనివ్వను అంటుంది మోనిత. ఎందుకు తన మీద అంత కోపం. తనేదో తన భర్త కోసం పూజ చేసుకుంటుంటే నీకేంటి కోపం అంటాడు కార్తీక్. దీంతో ఆమె భర్త కోసం పూజ చేసుకుంటుంటే నువ్వెందుకు దీపాలు వెలిగించావు అని అడుగుతుంది మోనిత.

తప్పేముంది. నువ్వు నిన్న డబ్బులు ఇవ్వలేదా.. ఇప్పుడు నేను దీపాలు పెట్టడంలో హెల్ప్ చేశాను అంటాడు కార్తీక్. ఈరోజుతో మీ ఆటలకు ముగింపు పలకాలి. ఈరోజు నుంచి నువ్వు వంటలక్కను కలవకూడదు. మాట్లాడకూడదు అంటుంది మోనిత.

వంటలక్కతో మాట్లాడనని నాకు మాటివ్వు అంటుంది మోనిత. లేదంటే అక్కడే ఉన్న దీపాన్ని తీసుకుంటుంది. ఇక్కడే నన్ను తగలబెట్టుకుంటాను అంటుంది. ఎవ్వరూ దగ్గరికి రావద్దు. వంటలక్కతో మాట్లాడనని చెప్పు కార్తీక్. లేదంటే తగలబెట్టుకుంటాను అంటుంది మోనిత.

దీంతో తగలబెట్టుకో.. చూస్తావేంటి తగలబెట్టుకో. డాక్టర్ బాబు నన్ను కలుస్తారు. మాట్లాడుతారు. ఇందులో ఏ మార్పు ఉండదు. చూడలేకపోతే తగలబెట్టుకో. లేదంటే చెప్పు నేనే తగలబెడతాను అంటుంది. దీంతో మోనితకు భయం వేస్తుంది. నన్ను తగులబెడతావా. గుడిలో చెబుతున్నా విను. రేపు ఈ టైమ్ వరకు నువ్వో, డాక్టర్ బాబూ.. ఇద్దరిలో ఒకరే మిగులుతారు. నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.

Karthika Deepam 14 Nov Today Episode : శౌర్యను మరోసారి నమ్మించి మోసం చేసిన ఇంద్రుడు, చంద్రమ్మ

మరోవైపు ఇంద్రుడు, చంద్రమ్మ.. శౌర్య ముందే కావాలని తనను వినడం లేదన్నట్టుగా మాట్లాడుకుంటారు. జ్వాలమ్మ మనల్ని అనుమానిస్తోంది అంటాడు ఇంద్రుడు. వాళ్ల అమ్మానాన్నలను కలవడం మనకు ఇష్టం లేదని అనుకుంటోంది అంటాడు.

ఆటో అమ్మేశాం కదా. వాళ్ల అమ్మానాన్నలను ఇష్టం లేకే అనుకుంటోంది అంటాడు. ఇంతకుముందులా అడిగిన వెంటనే బయటికి తీసుకెళ్లలేకపోతున్నా. కానీ.. బిడ్డ పెద్దమనిషి అయింది. బయటికి వెళ్తే అందరి దిష్టి తగులుతుంది. దీనికి ఒక్కటే పరిష్కారం చంద్రమ్మ. తొందరగా తన అమ్మానాన్నలు ఎక్కడున్నారో కనుక్కోవాలి అంటాడు.

దీంతో అక్కడికి వచ్చిన శౌర్య.. నన్ను క్షమించు బాబాయి. మీ ఇష్టం ఉన్నప్పుడే అమ్మానాన్నలను వెతకండి అని చెప్పి వెళ్తుంది శౌర్య. మరోవైపు ఆ మోనిత గురించే ఆలోచిస్తూ ఉంటుంది దీప. ఇంతలో కార్తీక్.. తన కోసం టిఫిన్ తీసుకొస్తాడు. పొద్దున నుంచి ఏం తినలేదు కదా. ఈ టిఫిన్ తిను అంటాడు.

చాటుగా ఇవన్నీ చూస్తూ ఉంటుంది మోనిత. ఎందుకు డాక్టర్ బాబు. నాకోసం కష్టపడి తెచ్చారు అంటుంది దీప. దీంతో ఆకలితో ఉన్నప్పుడు ఆరాలు తీయకూడదు అని అంటాడు. హడావుడిగా బాక్స్ లో టిఫిన్ తీసుకొస్తుంటే ఎవరికోసమో అనుకున్నాను. ఈ వంటలక్క కోసమేనా అని అనుకుంటుంది మోనిత.

నేను కూడా ఉపవాసం ఉన్నా కదా. మరి నాకు తినిపించొచ్చు కదా అని అనుకుంటుంది మోనిత. మరోవైపు ఉదయమే దీప గుడిలో ఊడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పూజారి రాత్రి కార్తీక పూజ ఎలా జరుగుతుంది అని అడుగుతాడు. దీంతో ఏం పూజ పూజారి గారు.

నా పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు అంటుంది దీప. నీ పరిస్థితి వింటుంటే ఆ సీతమ్మ తల్లే గుర్తొస్తుంది. కష్టాలే తోబుట్టువులు అన్నట్టుగా సాగింది తన కష్టం. కష్టాలు వచ్చాయని బెదిరిపోకుండా ఆ దేవుడి మీద భారం వేసి ముందుకు సాగుతుంటే ఏదో ఒక సమయంలో ఆ దేవుడే మనల్ని ఆ కష్టాల నుంచి బయటపడేస్తాడు.

దానికి కావాల్సింది కాస్త ఓపిక అని చెప్పి పూజారి అక్కడి నుంచి గుడిలోకి వెళ్తాడు. మరోవైపు కార్తీక్ కు గతం గుర్తొచ్చిందా లేదా అని టెన్షన్ పడుతుంది మోనిత. దుర్గతో వాల్తేరు వాణి గురించి మాట్లాడుతుండగా కార్తీక్ వింటాడు. వాల్తేరు వాణి నిన్ను చంపడానికి ప్రయత్నించిందా? అని తెలుసుకొని వెంటనే మోనిత దగ్గరికి వెళ్లి సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది