Karthika Deepam 15 Nov Today Episode : కొత్తగా, వింతగా మాట్లాడి కార్తీక్ ను కంగారు పెట్టిన దీప.. బస్తీకి వెళ్లిపోతోందని కార్తీక్ కు అర్థం అయిందా?
Karthika Deepam 15 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 నవంబర్ 2021, సోమవారం 1197 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీప మాట్లాడే పద్ధతి చూసి కార్తీక్ కు అనుమానం వస్తుంది. అసలు దీప ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అనుకొని భయపడతాడు. ఇంతలో మోనిత ప్రియమణికి డబ్బులు ఇచ్చి బాబుకు కావాల్సినవి కొనుక్కొనిరా అని చెబుతుంది. సరే అమ్మ అంటుంది ప్రియమణి. అమ్మా.. కొంచెం జీతం పెంచమ్మా అని చెప్పబోతోంది. సరేలే.. నీ మనసులోని మాట అర్థం అయిందిపో.. అంటుంది మోనిత.
ఇంటికి సంబంధించిన లెక్కలు అయిపోయాయి.. ఇక నా జీవితానికి సంబంధించిన లెక్కలు మిగిలి ఉన్నాయి అని అనుకొని ఏదో పేపర్ మీద లెక్కలు రాస్తుంది మోనిత. ఆ పేపర్ కిందపడటంతో దాన్ని తీసేందుకు వంగగా తాళి కనిపిస్తుంది. అప్పుడే మోనిత ఇంటికి భారతి వస్తుంది. మోనిత మెడలో ఉన్న తాళి చూసి షాక్ అవుతుంది భారతి. ఏంటిది.. మెడలో తాళి ఏంటి.. కార్తీక్ కట్టాడా.. అంటుంది. లేదు.. నేనే కట్టుకున్నాను అంటుంది. మనకంటూ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి కదా.. వాటిని పాటించాలి కదా అంటుంది భారతి.
నా మనసుకు నచ్చిందే చేస్తా నేను.. అని మోనిత అంటే.. అవునులే నీకు సంప్రదాయాలు ఏంటి. ఎక్కడ మొదలు పెట్టావు మోనిత. ఎక్కడ ఆపుతావు.. అసలు నీ గమ్యం ఏంటి అంటూ ప్రశ్నిస్తుంది. చివరకు నాతో కూడా అబద్ధం చెప్పించావు.. అంటుంది భారతి. పేగు మెడకు వేసుకొని పుట్టాడు అని చెప్పిన ఒక్క అబద్ధం వల్ల చూశావు కదా.. ఎన్ని మంచి పనులు జరిగాయో అంటుంది మోనిత.
మరోవైపు దీప ప్రవర్తన తేడాగా ఉండటంతో అందరూ షాక్ అవుతారు. సౌందర్య, ఆనంద రావు, కార్తీక్.. అందరూ భయపడతారు. అసలు దీపకు ఏమైందిరా అని సౌందర్య.. కార్తీక్ ను ప్రశ్నిస్తుంది. ఏమో అమ్మ.. ఏం అర్థం కావడం లేదు అంటాడు కార్తీక్. మనకు కనిపించే దీప నిజం కాదేమో.. అన్నీ తెలుసుకొని ఏం తెలియనట్టు మనసు చంపుకొని బతుకుతుందేమో అంటాడు ఆనంద రావు.
Karthika Deepam 15 Nov Today Episode : సంతోషంగా కనిపించిన దీప
ఇలా మాట్లాడుతుండగానే దీప పిల్లలకు ఏదో కథలు చెబుతూ కిందికి తీసుకువస్తూ కనిపిస్తుంది. పిల్లలతో కలిసి సరదాగా నవ్వుతుంది దీప. అమ్మా.. నీకు ఈ కథలన్నీ ఎలా తెలుసు అంటుంది శౌర్య. నా జీవితంలో పెద్ద పెద్ద జోకులు జరిగాయి. వాటి ముందు ఈ జోక్ ఎంత.. అని పిల్లలతో అంటుంది దీప.
ఏంటి ముగ్గురు అలా చూస్తున్నారు అంటుంది దీప. భోజనానికి లేవండి అంటుంది. ఈరోజు వంటకాలు మామూలుగా ఉండవు తెలుసా అంటుంది. అత్తయ్యకు ఇష్టమైన కొత్తిమీర పచ్చడి.. మామయ్య గారికి ఇష్టమైన ఉల్లిగడ్డ చారు.. డాక్టర్ బాబుకు ఇష్టమైన గుత్తివంకాయ, దోసకాయ పచ్చడి అని చెబుతుంది దీప.
ఏంటి అమ్మా.. అన్నీ వాళ్లకు ఇష్టమైనవే చేశావా.. మాకు ఇష్టమైనవి చేయలేదా అంటుంది శౌర్య. అంటే.. ఇక్కడ అన్నీ వాళ్ల ఇష్టాలే నడుస్తున్నాయి కదా. అందుకే వాళ్లకు ఇష్టమైనవే చేశా అంటుంది దీప. వదినా నేనే రాగానే పిల్లలు టెన్షన్ పడుతున్నారు తెలుసా నువ్వు రాలేదని.. అని భోజనం చేస్తుండగా ఆదిత్య చెబుతాడు దీపతో.
నేను ఎటువెళ్తాను రా.. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే మీకు వీళ్లందరూ ఉన్నారు కదరా అంటుంది దీప. అదేంటి అలా అంటున్నావు అంటుంది సౌందర్య. అంటే నాకు జ్వరం లాంటిది ఏదైనా వస్తే డేర్ గా ఉండాలి అని అంటున్నాను అంటుంది దీప. అందరూ మీకు ఇష్టమైనవి తినేయండి.. మళ్లీ ఎప్పుడు తింటారో ఏమో అంటూ వింతగా మాట్లాడుతుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.