Karthika Deepam 20 June Today Episode : నిరుపమ్ కు ప్రపోజ్ చేసిన జ్వాల.. సౌందర్యకు శౌర్య గురించి చెప్పిన శోభ.. ఇంతలో ట్విస్ట్

Karthika Deepam 20 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 1383 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు రా.. నీతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.. అంటూ జ్వాలను నిరుపమ్ తీసుకెళ్లబోతుండగా హిమ ఆపుతుంది. ఆగు.. నేను కూడా వస్తాను అంటుంది హిమ. దీంతో నువ్వెందుకు తింగరి అంటుంది హిమ. బావ నువ్వు వెళ్లు.. మేము వస్తాం అంటుంది హిమ. వద్దు జ్వాల ప్లీజ్ అని హిమ బతిమిలాడటంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల. మరోవైపు సౌందర్యకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో శోభ అక్కడికి వస్తుంది. మీతో కాస్త మాట్లాడాలి అంటుంది. ఇక్కడ కాదు.. రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది శోభ. వీళ్లిద్దరితోనే నాకు తలనొప్పిగా ఉంది అంటే. ఈ స్వప్న మళ్లీ ఏమైనా తలనొప్పి తెచ్చిందా.. ఈ శోభతో కబురుపంపిందా అని అనుకుంటుంది సౌందర్య.

Advertisement
karthika deepam 20 june 2022 full episode
karthika deepam 20 june 2022 full episode

మీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ.. అవన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది వినండి అని అంటుంది శోభ. మరోవైపు జ్వాల.. నిరుపమ్ ను కలిసిందా అని టెన్షన్ పడుతుంది హిమ. దీంతో వాళ్లను కలిసేందుకు వెళ్తుంది. మీ మనవరాలు హిమను నిరుపమ్ పెళ్లి చేసుకుంటే.. తను ఎటూ కాకుండా పోతాడనే మీ ఉద్దేశం కదా అంటుంది శోభ. తను చనిపోతుందని తెలిసినా నిరుపమ్ పెళ్లి చేసుకుంటున్నాడు. అది నిరుపమ్ గొప్పతనం. హిమ చావు విషయంలో ఎవరూ ఏం చేయలేరు కదా. హిమ తర్వాత మిమ్మల్ని నానమ్మ అని పిలిచేవాళ్లే ఉండరు. ఉన్నా.. ఎక్కడున్నారో తెలియదు అని అంటుంది శోభ. దీంతో ఇదేంటి శౌర్య గురించి మాట్లాడుతోంది అని టెన్షన్ పడుతుంది సౌందర్య. పోనీ.. ఎక్కడున్నారో అని.. ఎప్పుడు వస్తారో అని మీరు ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ వృథా అవుతాయి అంటుంది. మీరు ఎంత వెతికినా పారిపోయిన మీ మనవరాలు మీకు దొరకదు కాక దొరకదు అని అంటుంది శోభ. కారు తీస్తూ శోభ మాటలను వింటుంది హిమ.

Advertisement

ఎవరికీ కనిపించని మీ మనవరాలు.. ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ మనవరాలు ఎంత వెతికినా కనిపించని మీ ముద్దుల మనవరాలు నాకు కనిపించింది అని అంటుంది శోభ. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. శోభ మాటలు విని హిమ కూడా షాక్ అవుతుంది.

ఎక్కడ కనిపించింది చెప్పు అని అడుగుతుంది సౌందర్య. నీకేం కావాలి చెప్పు అంటుంది. శౌర్యకు హిమను నేనే అంటూ ఫోన్ చేసింది ఈ శోభేనా అని అనుకుంటుంది హిమ. మీరు ఏమిస్తారు అని అడుగుతుంది శోభ. నిరుపమ్ ను నాకిచ్చి పెళ్లి చేయండి అంటుంది శోభ.

శౌర్యను అడ్డుపెట్టుకొని నానమ్మను బ్లాక్ మెయిల్ చేస్తోందా అని అనుకుంటుంది హిమ. ఈ విషయం స్వప్నకు తెలుసా అని అడుగుతుంది సౌందర్య. ఎవ్వరికీ తెలియదు. మీకు మీ మనవరాలు కావాలంటే.. తనను చూడాలనుకుంటే నిరుపమ్ తో నా పెళ్లి జరిపించండి అంటుంది శోభ.

దానికి, దీనికి లింక్ పెట్టకు. ఎప్పుడో తప్పిపోయిన నా మనవరాలును చూడటం కోసం నేను తపించి పోతున్నాను. నా మనవరాలు ఎక్కడుందో చెప్పు.. అంటుంది. కానీ.. శోభ మాత్రం చెప్పదు. హిమకు కోపం వస్తుంది. మేడమ్.. హిమ చనిపోబోతుందని తెలిసే నిరుపమ్ తో పెళ్లి వద్దంటోంది కదా. ఆ పెళ్లి ఏదో నాతో చేయండి అంటుంది శోభ.

ఏదో ఒకటి తేల్చండి. మీ మనవరాలు మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే.. నీ మనవడు నా మెడలో తాళి కట్టాల్సిందే. తనెవరో మీకు అప్పుడే చూపిస్తాను. పెళ్లయ్యాక తూచ్ నాకు తెలియదు అని అన్నా.. ఒకవేళ నేను మాట మార్చి మీ మనవరాలును నేను చూపించనని అనుకోకండి. అందుకే విడాకుల కాగితం రాయించి సంతకం చేసి తీసుకొచ్చాను అంటుంది. దూరం అయిపోయిన మీ మనవరాలు తిరిగి వస్తుంది. ఈ డాక్టర్ తో మీ మనవడికి పెళ్లి అవుతుంది అంటుంది శోభ.

Karthika Deepam 20 June Today Episode : జ్వాలకు అన్ని విషయాలు చెప్పేందుకు ప్రయత్నించిన నిరుపమ్

మరోవైపు జ్వాల.. నిరుపమ్ ను కలుస్తుంది. డాక్టర్ సాబ్.. మీకు ఇవాళ ఒక విషయం చెప్పాలి అంటుంది. ఆగు జ్వాల నీతో చాలా మాట్లాడాలి అంటుంది. ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంది జ్వాల. ఎంత చెప్పినా వినదు. జ్వాలను బతిమిలాడి సారీ చెప్పాలి అని అనుకుంటాడు నిరుపమ్.

ఇంతలో అక్కడికొచ్చిన జ్వాల.. వాటర్ తాగండి అంటుంది కానీ.. వద్దు అంటాడు. ఇంతలో ఒక పేపర్ తీసుకొచ్చి దాన్ని చూపిస్తుంది. అది నిరుపమ్ బొమ్మ. డాక్టర్ సాబ్ ఈ ప్రపంచంలో ఇష్టాన్ని చాలామంది చాలా రకాలుగా చెప్పి ఉండొచ్చు కానీ.. ఇది నా స్టయిల్ అనుకోండి. నా ఆలోచనలో నా మాటల్లో ప్రతి క్షణం మీరే ఉంటారు తెలుసా. మీరు నా ఎదురుగా ఉంటే కనురెప్ప కొడితే ఆ క్షణం మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతానో అని కనురెప్ప కూడా ఒక్కసారి కొట్టను.

మీరంటే అంత ఇష్టం డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల. పొద్దుననుండి రాత్రి దాక మీరే నా లోకం, మీరే నా ధ్యాస. అన్నీ మీరే మీరే అంటుంది జ్వాల. అంతా మీరే డాక్టర్ సాబ్. అందుకే మీ బొమ్మను నా రక్తంతో గీశాను అంటుంది జ్వాల. తీసుకోండి అంటుంది జ్వాల.

ఆ బొమ్మను తీసుకొని షాక్ అవుతాడు నిరుపమ్. డాక్టర్ సాబ్.. నాకు బొమ్మలు గీయడం రాదు. ముగ్గులు వేయడం కూడా రాదు. అయినా.. ఇంత బాగా మీ బొమ్మ గీశానంటే.. ఆ గొప్పదనం కూడా మీదే డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల. నా ఊహ మీరే.. నా ఊపిరి మీరే.. మీరే నేను.. నేనే మీరు అంటుంది జ్వాల.

అంతిష్టం మీరు నాకంటే. ఇష్టం అనేది కూడా చిన్నపదం డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల. మీరు కాదు లేదు అంటూ చిరాకులో చెప్పారంటే ఖచ్చితంగా నా గుండె ఆగిపోతుంది. అందుకే ఇన్నాళ్లు చెప్పలేదు అంటుంది జ్వాల. నన్ను ఆటపట్టించడానికైనా నా మీద ప్రేమ లేదు అని అనొద్దు డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల.

నేను ఆ క్షణమే కన్ను మూస్తానేమో అంటుంది జ్వాల. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను డాక్టర్ సాబ్.. అంటుంది జ్వాల. కట్ చేస్తే.. జ్వాల హిమ దగ్గరికి వెళ్తుంది. తెగ నవ్వుతూ ఉంటుంది. ఏంటి తింగరి నువ్వు నేను నవ్వుతుంటే నీకు నవ్వు రావడం లేదా అంటుంది జ్వాల.

మామూలుగా ఒకరు నవ్వుతుంటే ఇంకొకరు నవ్వుతారు కదా. అక్కడ ఏం జరిగిందని ఆలోచిస్తున్నావా.. అంటుంది. నేను అన్నీ చెబుతా. నేను డాక్టర్ సాబ్ ఆశ్రమంలో ఉన్నాం.. అంటుంది. తనకు ప్రపోజ్ చేసిన విషయం చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement