Karthika Deepam 21 March Today Episode : పెరిగి పెద్దయిన హిమ, శౌర్య.. డాక్టరయిన హిమ.. ఆటో డ్రైవర్ గా మారిన శౌర్య.. ఇప్పటికైనా ఇద్దరూ కలుసుకుంటారా?
Karthika Deepam 21 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 1305 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య ఎక్కడుందో అని ఇల్లంతా వెతుకుతారు కానీ.. శౌర్య కనిపించదు. ఇల్లు వదిలి బయటికి వచ్చేస్తుంది శౌర్య. ఆ ఇంట్లో తనో నేనో ఒక్కరే ఉండాలి. ఇద్దరం కలిసి ఉండలేం. తనను చూస్తే నేను అస్సలు ఉండలేను. హిమ.. బయట బతకలేదు. […]
Karthika Deepam 21 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 1305 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య ఎక్కడుందో అని ఇల్లంతా వెతుకుతారు కానీ.. శౌర్య కనిపించదు. ఇల్లు వదిలి బయటికి వచ్చేస్తుంది శౌర్య. ఆ ఇంట్లో తనో నేనో ఒక్కరే ఉండాలి. ఇద్దరం కలిసి ఉండలేం. తనను చూస్తే నేను అస్సలు ఉండలేను. హిమ.. బయట బతకలేదు. అందుకే.. నేను బయటికి వచ్చేశాను. కానీ.. నేను ఎక్కడికి వెళ్లాలి అని అనుకుంటుంది శౌర్య. బస్తీకి వెళ్లనా.. వారణాసిని కలిస్తే వద్దు.. నానమ్మకు చెబుతాడు. కానీ.. ఎక్కడికి వెళ్లాలో ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటుంది.
ఇంతలో ఓ బైక్ ను ఆపి.. అంకుల్ లిఫ్ట్ ఇవ్వరా అంటుంది. ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతాడు. దీంతో మీరు ఎక్కడి దాకా వెళ్తారు అని అడుగుతుంది. దీంతో నేను హయత్ నగర్ వరకు వెళ్లాలి అంటాడు. దీంతో నేను కూడా హయత్ నగర్ వరకు వెళ్లాలి అంటుంది. దీంతో తనను బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడు ఆ వ్యక్తి. కట్ చేస్తే శౌర్య ఒక లెటర్ రాసి ఇంట్లో పెట్టి వెళ్లిపోతుంది. ఆ లెటర్ ను చూసి ఆదిత్య తీసుకొచ్చి సౌందర్యకు ఇస్తాడు. పైన గదిలో ఈ లెటర్ పెట్టి ఉంది అని చెబుతాడు. ఆ లెటర్ ను తీసుకొని చదువుతుంది సౌందర్య.
నానమ్మ.. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను. నన్ను వెతకొద్దు. అమ్మానాన్నల్ని చంపిన హిమ ఉన్న ఇంట్లో నేను ఉండలేను. అందుకే నేనే వెళ్లిపోతున్నాను.. అని అందులో రాసి ఉండటంతో నువ్వు వెళ్లిపోవడం ఏంటి శౌర్య.. తప్పు చేసింది నేను.. కారు నడిపింది నేను.. అమ్మానాన్నల చావుకు కారణం అయింది నేను.. నేను చచ్చిపోయినా బాగుండేది.. అయ్యో అంటూ ఏడుస్తుంది హిమ.నా కళ్ల ముందు అమ్మానాన్నలను హిమ చంపేసింది నానమ్మ. తన మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. తనను చూస్తూ నేను ఉండలేను. తనను చూస్తున్న ప్రతిసారి అమ్మనాన్నల చావే గుర్తొస్తుంది. కాబట్టి నేనే వెళ్లిపోతున్నాను.. మళ్లీ చెబుతున్నాను. నాకోసం వెతకొద్దు. నాకోసం వెతకడానికి ప్రయత్నిస్తే నా మీద ఒట్టే.. అని లెటర్ లో రాసింది శౌర్య.
అయ్యో శౌర్య.. ఎంత పని చేశావే అని అంటుంది సౌందర్య. నువ్వు చెప్పింది నిజమే శౌర్య. అమ్మానాన్నలను నేనే చంపాను.. ఆ కారు నడపకున్నా బాగుండేది. అమ్మానాన్నలను నేనే చంపేశాను నానమ్మ.. అంటుంది హిమ. వెక్కి వెక్కి ఏడుస్తుంది.
Karthika Deepam 21 March Today Episode : శౌర్య కోసం వెతుకులాట ప్రారంభించిన సౌందర్య, ఆదిత్య, హిమ
ఆదిత్య.. కారు తీయు అది ఎటువెళ్లిందో ఏంటో అని అంటుంది సౌందర్య. మరోవైపు శౌర్య.. బైక్ మీద వెళ్తూ ఉంటుంది. ఇంతలో అనాథ పిల్లలు కనిపిస్తారు. బండి ఆపి డబ్బులు ఇవ్వమంటారు. వీళ్లను చూసి అనాథలు అనుకొని.. వీళ్లతో వెళ్తే బెటర్ అనుకుంటుంది శౌర్య.
అందుకే.. ఇక్కడే దిగుతా బండి ఆపేయ్ అంటుంది శౌర్య. పిల్లలను వెళ్లి కలిసి నేను అనాథను అంటుంది. కానీ.. ఆ పిల్లలు మేము అనాథలం కాము. అనాథ పిల్లల కోసం మేము డబ్బులు కలెక్ట్ చేస్తున్నాం అంతే అంటారు దీంతో ఏం చేయాలో తెలియక.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటుంది.ఇంతలో చంద్రమ్మ.. ఓ దుకాణం దగ్గర ఓ మహిళ పర్సులో నుంచి డబ్బులు కొట్టేస్తుంది. తను డబ్బులు కొట్టేస్తుండగా శౌర్య చూస్తుంది. చూసి తనను వెళ్లి ఆపి.. ఎంత కొట్టేశావు అని అడుగుతుంది. ఆ తర్వాత తన దగ్గర నుంచి వంద తీసుకొని వెళ్తుంది.
మళ్లీ తన దగ్గరికి వెళ్లి ఇంకో వంద తీసుకుంటుంది. ఇద్దరూ ఇంకోసారి దొంగతనాలు చేయకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత ఆ డబ్బును అనాథ పిల్లలకు ఇచ్చేస్తుంది. మరోవైపు శౌర్యను వెతుక్కుంటూ సౌందర్య, హిమ, ఆదిత్య వస్తారు.
శౌర్యను చూస్తారు. మరోవైపు ఇంద్రుడు, చంద్రమ్మను పోలీసులు వెతుకుతుంటారు. దీంతో పోలీసులను తప్పించుకొని పరిగెడుతుంటారు. శౌర్యను చూసిన హిమ కూడా పరిగెడుతుంది. దీంతో ఇంద్రుడు, చంద్రమ్మతో పాటు శౌర్య కూడా బస్సు ఎక్కేస్తారు. బస్సును మధ్యలో ఆపి చూసినా కూడా శౌర్య కనిపించదు. దీంతో సౌందర్య వెక్కి వెక్కి ఏడుస్తుంది.
కట్ చేస్తే.. కొన్ని ఏళ్లు గడిచిపోతాయి. హిమ బర్త్ డే వేడుకలు జరుగుతూ ఉంటాయి. హిమ డాక్టర్ అవుతుంది. పెద్దవుతుంది. హిమను కిందికి తన నానమ్మ సౌందర్య తీసుకొని వస్తుంది. కిందికి వచ్చాక.. కార్తీక్, దీప ఫోటోకు దండం పెడుతుంది హిమ.అమ్మ, డాడీ.. మిమ్మల్ని నేనే చంపుకున్నాను. మీ చావుకు కారణం నేనే అని అనుకుంటుంది హిమ. శౌర్య.. నువ్వు నా మీద కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయావు. ఒక్కటిగా పుట్టి.. ఒక్కటిగా పెరిగి ఇలా వెళ్లిపోయాం. ఆ రోజు నుంచి ఈరోజు దాకా.. నీకోసం వెతికిస్తూనే ఉన్నాను.
నేను అమెరికాలో ఉన్నా నా ప్రాణం ఇక్కడే ఉండేది. అమ్మానాన్నల చివరి కోరిక మనం కలిసి ఉండాలనేది. నిన్ను వెతికిస్తూనే ఉంటాను. నిన్ను కలుసుకుంటాను. అమ్మానాన్నల చావుకు కారణం అయ్యానన్న ఆ ఫీలింగ్ నాతో పాటే ఉండిపోయింది. నిన్ను కలిస్తే కానీ అది పోదేమో శౌర్య అని అనుకుంటుంది హిమ.
మరోవైపు నిరుపమ్ వస్తాడు. తనకు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతాడు. దీంతో తను థ్యాంక్స్ చెబుతుంది. నేను ఇక్కడ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాను. శౌర్య మాత్రం ఎక్కడో ఉంది.. అని అంటుంది హిమ. శౌర్య నన్ను క్షమిస్తుందా అని నిరుపమ్ తో అంటుంది. ఎప్పటికైనా నేను శౌర్యను కలుస్తా అంటుంది హిమ….
కట్ చేస్తే శౌర్య కూడా పెరిగి పెద్దదవుతుంది. ఓ వ్యక్తిని చితకబాదుతూ ఉంటుంది. ఏరా.. ఏమన్నావు.. అంటూ బెదిరిస్తుంది. వస్తావా.. అంటావా. ఏంట్రా వచ్చేది.. ఏంట్రా అంటూ కొడుతుంది. అమ్మాయి ఆటో నడిపితే ఇంత చులకనా నీకు అంటుంది శౌర్య.
ఆటో వస్తావా అనబోయి వస్తావా అన్నాను అంటాడు. దీంతో కావాలని అన్నావని నాకు తెలుసురా అంటుంది. దీంతో సారీ అక్క అంటాడు. దీంతో తనకు ఇంకా కోపం పెరుగుతుంది. అక్క అనగానే హిమ గుర్తొస్తుంది. ఇంకా ఎక్కువ కొడుతుంది. సారీ చెల్లి అంటాడు. అయినా కూడా కొడుతుంది.
తెలుగులో నాకు నచ్చని బంధాలు అక్కా చెల్లి.. అంటుంది. ఇదేం విచిత్రం అంటాడు. దీంతో ఇంకా రెండు పీకుతుంది. రేయ్.. ఆ పదాలు, బంధాలు నాకు నచ్చవు అని చెప్పాను కదా అంటుంది శౌర్య. ఇంతలో ఆటో మీద వొదిలేదేలే.. అని రాయించుకున్న విషయాన్ని చూసి షాక్ అవుతాడు.
ఇంతలో శౌర్యకు ఫోన్ వస్తుంది. ఆటో స్టాండ్ కు వస్తున్నా అని చెబుతుంది శౌర్య. ఇంతలో ఏమండి.. రెండు ప్రశ్నలు అడగొచ్చా అని అంటాడు. దీంతో ఏంటి అని అంటుంది. ఈ ఆటో మీద వొదిలేదేలే అని రాశారంటే.. ఎవరిని వదిలేది లేదన్నట్టు.. నా లాంటి వాళ్లనా అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.