Karthika Deepam 22 April Today Episode : శౌర్యకు నిజం తెలిసినట్టు కలగన్న హిమ.. ప్రేమ్ ప్రేమను హిమ ఒప్పుకుంటుందా? సౌందర్యకు అసలు నిజం తెలుస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam 22 April Today Episode : శౌర్యకు నిజం తెలిసినట్టు కలగన్న హిమ.. ప్రేమ్ ప్రేమను హిమ ఒప్పుకుంటుందా? సౌందర్యకు అసలు నిజం తెలుస్తుందా?

Karthika Deepam 22 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1333 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యాక్సిడెంట్స్ అంటే నాకు చాలా భయం అంటుంది జ్వాల. కాసేపట్లో ఆ ముసలావిడకు స్పృహ వస్తుందని చెబుతాడు నిరుపమ్. దీంతో హిమకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. తను ఒకవేళ చూస్తే ప్రాబ్లమ్ అవుతుందని.. నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి […]

 Authored By gatla | The Telugu News | Updated on :22 April 2022,10:30 am

Karthika Deepam 22 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1333 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యాక్సిడెంట్స్ అంటే నాకు చాలా భయం అంటుంది జ్వాల. కాసేపట్లో ఆ ముసలావిడకు స్పృహ వస్తుందని చెబుతాడు నిరుపమ్. దీంతో హిమకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. తను ఒకవేళ చూస్తే ప్రాబ్లమ్ అవుతుందని.. నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ. మరోవైపు నీ చెంప కందిపోయింది ఏంటి అని అడుగుతాడు. ఇంతలో డాక్టర్ ను సిస్టర్ పిలుస్తుంది. మరోవైపు జ్వాల.. తనను కొట్టిన సౌందర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్నాళ్లకు నానమ్మను చూశాను. తను ఇంకా అలాగే ఉంది. అయినా తనకు నా మీద ఎలాంటి బెంగ లేదనుకుంటాను.

karthika deepam 22 april 2022 full episode

karthika deepam 22 april 2022 full episode

నానమ్మ ఇక్కడ ఉందంటే.. అది కూడా ఇక్కడే ఉందేమో. నా శత్రువును కనిపెట్టే మంచి అవకాశం పోయింది. ఈ పాటికి హిమకు పెళ్లి అయిపోయి ఉంటుందా. దానికేం టెన్షన్. చూస్తా.. దాని సంగతి చూస్తా. అందరూ ఇక్కడే ఉన్నారు అయినా నాకోసం ఎవ్వరూ వెతకడం లేదు అని అనుకుంటుంది జ్వాల. మరోవైపు రవ్వ ఇడ్లీ.. తన అమ్మానాన్న గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మీరెవరు.. మీ వివరాలేంటో.. మీ పేర్లేంటో.. మీ చుట్టాలెవరో.. అసలు నాకు ఎవరున్నారో కూడా నాకు తెలియకుండా నన్ను ఒంటరిని చేసి మీరు వెళ్లిపోయారు అంటాడు రవ్వ ఇడ్లీ. నేను ఒక్కడినే ఎందుకు ఇలా అయ్యాను. నాకు ఎందుకు ఇలా జరిగింది.. అని అనుకుంటాడు.

ఇంతలో పెద్దమ్మ వస్తుంది. నీకు దండం పెడతాను పెద్దమ్మ. మా అమ్మానాన్న గురించి ఒక చిన్న ఆధారం చెప్పు పెద్దమ్మ అంటాడు. దీంతో నాకు వాళ్లు ఎవరో తెలియదు. అస్తమానం అడిగిందే అడిగి విసిగించకు. నీకు ఎవ్వరూ లేరు. నీకు ఎవరైనా ఉంటే.. నిన్ను వెతుక్కుంటూ ఎవరైనా వచ్చేవారు కదా. విసిరి పారేసిన విస్తరి లాంటోడివి అని అంటుంద పెద్దమ్మ.

మరోవైపు సౌందర్య ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. టెన్షన్ పడుతు ఉంటుంది. ఉదయం.. జ్వాలను కొట్టిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రిజిస్ట్రేషన్ పని అయిపోయింది కానీ.. అనవసరంగా ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నాను అని బాధపడుతుంది సౌందర్య.

మళ్లీ ఎప్పుడైనా కనిపిస్తే సారీ చెప్పాలి. అప్పుడు గానీ నా మనసులోని బాధ తగ్గదు అనుకుంటుంది సౌందర్య. ఇంతలో స్వప్న వచ్చి ఆనందరావుతో మాట్లాడుతుంది. నా మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవాలని అనుకుంటున్నా అంటుంది స్వప్న.

Karthika Deepam 22 April Today Episode : శౌర్యకు అసలు నిజం తెలిసినట్టుగా కలగన్న హిమ

సౌందర్యను క్షమిస్తున్నావా అంటాడు ఆనంద రావు. అది ఎప్పటికీ జరగదు అంటుంది స్వప్న. నా పిల్లలను నాకు ఇష్టమైన వాళ్లకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా అంటుంది స్వప్న. ఇంట్లో అమ్మాయిని పెట్టుకొని వేరే వాళ్లతో పెళ్లి ఏంటి అంటాడు. హిమ ఉంది కదా అంటే.. హిమను నా కొడుకుకు అస్సలు ఇవ్వను అంటుంది స్వప్న.

అది ఒక నష్టజాతకురాలు. అలాంటి దాన్ని తీసుకొచ్చి నిరుపమ్ కు ఎలా పెళ్లి చేస్తానని అనుకున్నారు అంటుంది స్వప్న. మీ మనవరాలు వద్దు.. మీ చుట్టరికం అస్సలు వద్దు అంటుంది స్వప్న. మీరు ఈ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకండి అంటుంది స్వప్న.

పెళ్లికి పిలుస్తాను. వచ్చి నాలుగు అక్షింతలు వేసి వెళ్లండి అంటుంది స్వప్న. కట్ చేస్తే.. జ్వాల, హిమ ఇద్దరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో కారులో సౌందర్య, ఆనంద రావు ఇద్దరూ దిగి వాళ్ల వద్దకు వస్తారు. వాళ్లను చూసి జ్వాల షాక్ అవుతుంది.

నానమ్మ, తాతయ్య ఏంటి సడెన్ గా ఇలా వచ్చారు అనుకుంటుంది హిమ. శౌర్య వీళ్లను గుర్తు పట్టిందా అనుకుంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది. దేవుడా ఏంటి ఇలా చేశావు అని అనుకుంటుంది. ఆరోజు నువ్వు బైక్ మీద వెళ్లింది తనతోనే కదా హిమ అంటుంది సౌందర్య.

దీంతో జ్వాల షాక్ అవుతుంది. ఎవరే నువ్వు. నీతో బైక్ మీద వెళ్లాక.. వివరాలు అడిగితే హిమ ఏదేదో చెబుతుంది. నేను నమ్మాను అనుకుంది అంటుంది సౌందర్య. అవునమ్మ.. నిన్ను చూస్తుంటే నాకు కూడా మనసులో ఏదో తెలియని ఫీలింగ్. చాలా ఆత్మీయంగా అనిపిస్తున్నావు అంటాడు ఆనందరావు.

నిజం చెప్పండి అంటుంది సౌందర్య. దీంతో జ్వాల చేయి మీద ఉన్న హెచ్ అనే పచ్చబొట్టును సౌందర్యకు చూపిస్తుంది హిమ. జ్వాలనే మన శౌర్య నానమ్మ అంటుంది హిమ. దీంతో సౌందర్య.. జ్వాలను చూసి ఆశ్చర్యపోతుంది. నువ్వేనా మా శౌర్యవు అంటుంది.

ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే. మమ్మల్ని చూసి కూడా పలకరించలేదా. లేక మేము ఎప్పుడూ కనిపించలేదా అంటుంది. దీంతో ఆపండి మీ నాటకాలు. మీ కపట ప్రేమలు, కన్నీళ్లు అంటుంది శౌర్య. దీంతో ఏం మాట్లాడుతున్నావు అమ్మ. నేను మీ తాతయ్యను అంటాడు ఆనంద రావు.

తను నీ హిమ అంటాడు. దీంతో నా హిమ కాదు.. నా శత్రువు హిమ అది అంటుంది శౌర్య. మా అమ్మానాన్నలను మింగేసిన రాక్షసి అది. ఏమే.. ఇన్నాళ్లు నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తావా.. ఛీ ఛీ అంటుంది శౌర్య. దీంతో ఏంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి రౌడీ అంటుంది సౌందర్య.

అవును.. రౌడీ రౌడీ అని పిలుస్తూ నన్ను నిజంగానే రౌడీని చేశారు అంటుంది శౌర్య. మీరేమో లగ్జరీగా బతకాలి.. నేను మాత్రం ఇలా ఉండాలి. నా మీద మీకు ప్రేమ లేదు. నన్ను వెతకలేదు. నాకు మీరంటే ప్రేమ లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది శౌర్య.

అదొక్కతే మీకు మనవరాలు అంటుంది శౌర్య. మీకు, నాకు ఎలాంటి బంధం లేదు. చుట్టరికం లేదు. వెళ్లండి అంటుంది శౌర్య. దీంతో శౌర్య.. ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి.. అంటాడు ఆనంద రావు. నాకు ఎవ్వరూ లేరు అంటుంది శౌర్య.

శౌర్య.. నన్ను క్షమించు శౌర్య అంటుంది హిమ. దీంతో మాట్లాడకు. నీ వల్లే అమ్మానాన్న చనిపోయారు అంటుంది శౌర్య. నీ వల్లే నేను ఇంట్లో నుంచి పారిపోయాను అంటుంది శౌర్య. నేను ఇక్కడ కష్టపడుతుంటే నువ్వు సంతోషంగా ఉంటావా. అమ్మానాన్నల ప్రాణాలు తీసినందుకు నిన్ను వదిలిపెడతా అనుకున్నావా? నిన్ను వదలను అంటుంది శౌర్య.

నువ్వు నా శత్రువువు అంటుంది. నువ్వు ఎలా మనశ్శాంతిగా ఉంటావో నేను చూస్తాను. పో అవతలకు అంటూ తనను కిందికి నెట్టేస్తుంది. దీంతో శౌర్య అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది హిమ. అదంతా కల. నిజం కాదు. శౌర్య.. నీ గురించి నానమ్మ వాళ్లకు చెప్పాలని అనిపిస్తున్నా నువ్వు ఎలా ఫీల్ అవుతావో అర్థం కావడం లేదు. నేనే హిమను అని తెలిస్తే నీ కోపం ఇంత తీవ్రంగా ఉంటుందా అని అనుకుంటుంది.

మరోవైపు ప్రేమ్.. హిమను ఎదో అర్జెంట్ పని తీసుకొని వస్తాడు. నాకోసం నువ్వు కాఫీ తాగే టైమ్ కూడా ఇవ్వలేవా. ఇది మరీ అన్యాయం అంటాడు ప్రేమ్. దీంతో కాఫీ ఏంటి.. పొద్దున నుంచి సాయంత్రం దాకా టైమ్ స్పెండ్ చేయమన్నా చేస్తాను అంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది