Karthika Deepam 22 Dec Today Episode : మోనిత, సౌందర్య మధ్య పెద్ద గొడవ.. డాక్టర్ గా పనిచేసి డబ్బు సంపాదించాలని అనుకున్న కార్తీక్.. ఇంతలో ట్విస్ట్

Authored By Varun G | The Telugu News | Published on: December 22, 2021, 9:05 am

Karthika Deepam 22 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 డిసెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 1229 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా కొడుకును ఎవరు ఎత్తుకెళ్లారు అని తెగ టెన్షన్ పడుతుంటుంది మోనిత. ఇంతలో ఆదిత్య, శ్రావ్య వస్తారు. రండి మరిది గారు అంటూ వరుసలు కలుపుతుంది మోనిత. నీకు వరుసలు కలపడం బాగా తెలుసు అంటాడు ఆదిత్య. రాగానే ఏదో ఒకటి అనకుండా ఉండవా? అంటుంది. చూడు మోనిత.. నువ్వు ఒక డాక్టర్ వి అంటూ ఏదో అనబోతాడు. ఇంతలోనే మోనిత సెటైర్లు వేస్తుంది. ఇవన్నీ నాకు చెప్పకు అంటుంది. దీంతో మోనితపై కోపంగా విరుచుకుపడబోతాడు. శ్రావ్య ఆపుతుంది. నా కొడుకును ఎక్కడ దాచావో చెప్పు అంటుంది మోనిత. నీ కొడుకును దాయాల్సిన అవసరం నాకేంటి అంటాడు ఆదిత్య. నా కొడుకు దొరికే వరకు నేను ఇక్కడే ఉంటా.. అంటూ మోనిత చెబుతుంది.

మరోవైపు శ్రీవల్లి కొడుకు బాగా ఏడుస్తుంటారు. ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోడు. శ్రీవల్లి ఎంతో ట్రై చేస్తుంది. పిల్లలు కూడా ఆ పిల్లాడిని ఊరుకుంచుకునేందుకు ఎంతో ట్రై చేస్తారు కానీ.. పిల్లాడు ఏడుపును ఆపడు. ఇంతలో కార్తీక్ వచ్చి పిల్లాడిని ఎత్తుకుంటాడు. దీంతో పిల్లాడు ఊరుకుంటాడు. అదరూ షాక్ అవుతారు. ఆ తర్వాత పిల్లాడిని తీసుకుంటుంది శ్రీవల్లి. మళ్లీ పిల్లాడిని తీసుకునే సరికి.. ఏడుపు ప్రారంభిస్తాడు. మళ్లీ కార్తీక్ ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. ఇంతలో కోటేశ్ వచ్చి బాబుకు చుక్కల మందు వేయించాలని పిల్లాడిని తీసుకెళ్తాడు. మరోవైపు దీప.. సేటు దగ్గర తాకట్టు పెట్టిన నగలతో డబ్బులు తీసుకొని ఇంట్లోకి కావాల్సిన సరుకులను తీసుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఒకవేళ ఈ విషయం కార్తీక్ బాబుకు తెలిస్తే ఊరుకుంటారా అని భయపడుతుంది దీప. అంత ఆస్తినే వదిలేశారు.. ఇదో లెక్కా అని అనుకుంటుంది దీప.

మరోవైపు రుద్రాణి.. కారులో ఎక్కడికో వెళ్తుంది. అరేయ్.. మెల్లగా పోనియ్ రా.. రుద్రాణిని ఈ ఊరి వాళ్లు చూడాలి.. అంటుంది. ఇంతలో కోటేశ్, శ్రీవల్లి పిల్లాడిని తీసుకొని నడుచుకుంటూ వెళ్తుంటారు. రుద్రాణి వాళ్లను చూస్తుంది. దీంతో షాక్ అవుతారు. ఏరా కోటేశ్.. మమ్మల్ని చూసి తలదించుకొని వెళ్తున్నావు.

కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వచ్చినట్టు నీకు టైమ్ బాగున్నట్టుందే. నీ బిడ్డను ఇటు తీసుకురా అంటుంది. దీంతో తన కొడుకును చూస్తుంది రుద్రాణి. బాబు చాలా ముద్దుగా ఉన్నాడు అంటుంది. బిడ్డకు దిష్టి తీస్తుంది రుద్రాణి. నీ బిడ్డకు నేను తీశాను. మరి నీకు ఎవరు దిష్టి తీస్తారు చెప్పు.. అంటుంది రుద్రాణి.

Karthika Deepam 22 Dec Today Episode : ఏదో ఒక పని చేసి రుద్రాణి అప్పు తీర్చాలని అనుకున్న కార్తీక్

మనం ఎంత గొప్పవాళ్లం అయినా గుడికి వెళ్లాలి.. దండం పెట్టుకోవాలి అంటుంది. నీ ఇంట్లో దిక్కు దివానా లేని ఇద్దరు వచ్చి ఉండేసరికి.. నీకు రుద్రాణి మీద భయం పోయిందా అంటుంది రుద్రాణి. వాళ్లను ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. పిలిచాను… వార్నింగ్ ఇచ్చాను.. గడువు దాటాక మీ పరిస్థితి ఏంటో అప్పుడు తెలుస్తుంది అంటుంది రుద్రాణి.

మరోవైపు కార్తీక్ అసలు తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటాడు. డబ్బులు ఎలా కట్టాలా అని ఆలోచిస్తుంటాడు. ఏదో ఒక పని చేయాలి. ఎలాగైనా అని అనుకుంటుండగానే ఓ వ్యక్తి డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ పిలుస్తాడు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. అక్కడే పక్కన ఓ ఆర్ఎంపీ వేరే వ్యక్తికి వైద్యం చేస్తుంటాడు.

అతడు.. డబ్బులు తక్కువగా ఇస్తున్నారని వైద్యాన్ని నిర్లక్ష్యంగా చేస్తున్నాడని తెలుసుకుంటాడు కార్తీక్. దీంతో ఏం చేయాలో అతడికి అర్థం కాదు. అసలు ఈ ఊళ్లో మంచి డాక్టరే లేడా అని అనుకుంటాడు కార్తీక్. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు.

మీరే నా బిడ్డను ఎత్తుకెళ్లారేమో అంటూ సౌందర్యతో గొడవకు దిగుతుంది మోనిత. అప్పుడు హిమను ఎత్తుకొచ్చుకొని ఉంచుకున్నారు కదా.. అలాగే ఇప్పుడు కూడా నా బిడ్డను ఎత్తుకెళ్లి ఎక్కడైనా దాచిపెట్టారేమో అని అంటుంది మోనిత. దీంతో నోర్మూయ్ మోనిత అంటూ సీరియస్ అవుతుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Rashmi Gautam : రష్మితో లిప్‌లాక్ కావాలన్న కమెడియన్.. బుల్లెట్ భాస్కర్ కౌంటర్‌..!"

  2. "Chicken Shop Business : చికెన్ షాప్ పెడితే లాభమా.. న‌ష్ట‌మా..1 కిలోకు ఎంత మిగులుతుందంటే? అసలు లెక్కలు ఇవే!"

  3. "Today Horoscope : 25 నవంబర్ 2026 బుధ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు..!"

  4. "Huzurnagar News : నిరుద్యోగులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు.. రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు"

  5. "December New Rule : డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌.. గ్యాస్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఛార్జీలపై బిగ్ అలర్ట్!"

  6. "PM Kisan 25th Installment : రూ.2,000 కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్.. ఈ 5 పనులు వెంటనే పూర్తి చేయండి!"

  7. "Gold Adulteration Alert : కొత్త మోసం.. 22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారమా..? 916 హాల్‌మార్క్ ఉన్నా జాగ్రత్త పడాల్సిందేనా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp