Nisha Agarwal : వన్నె తగ్గని సుకుమారి.. నిశా అగర్వాల్‌ను ఇలా చూస్తే తట్టుకోలేరు.. !

Authored By mallesh | The Telugu News | Updated on: December 22, 2021, 8:38 am

Nisha Agarwal : బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సిస్టర్ నిశా అగర్వాల్.. తెలుగు ప్రేక్షకులకు ‘ఏమైంది ఈ వేళ’ చిత్రంతో పరిచయమయింది. ఆ చిత్రంలో ఈ భామ అందాలు, నటనను చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందాల చందమామ కాజల్ లాగే అభినయంలోనూ నిశా అగర్వాల్ చక్కటి ప్రతిభ చూపించిందని ప్రశంసించారు. ఇకపోతే ఈ భామ ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో కథానాయికగా నటించి మంచి పేరు కూడా సంపాదించుకుంది. అయితే, ఈ భామ ఊహించిన దాని కంటే చాలా ముందే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.

అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే చెల్లి నిశా అగర్వల్ మ్యారేజ్ చేసుకుంది. బిజినెస్ మ్యాన్ కరన్ వాలేచాను పెళ్లి చేసుకున్న నిశా అగర్వాల్ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కూడా. ఇన్నాళ్లు తనయుడి ఆలనా పాలనా చూసుకున్న నిశా అగర్వాల్ తాజాగా మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చినంత పని చేసింది. సోషల్ మీడియా వేదికగా నిశా అగర్వాల్ షేర్ చేసిన ఫొటో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

Nisha agarwal shared her latest photos in social media

Nisha agarwal shared her latest photos in social media

Nisha Agarwal : చీరకట్టు, ఎద అందాల ఆరబోతోలో తగ్గేదేలే..

ఈ భామ ఫొటోలను చూసి నెటిజన్లు ఆనందం, ఆశ్చర్యం రెండూ వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి అయి పిల్లాడు పుట్టినప్పటికీ నిశా అగర్వాల్ వన్నె ఇంకా తగ్గలేదని అంటున్నారు. ఇక ఫొటోల్లో నిశా అగర్వాల్ చీర కట్టులోనూ అందాలను ఆరబోస్తోంది. అలా కొంటెగా చూస్తూ తన చేతులను నడుముపై పెట్టుకుని, ఎద అందాలను బయట పెట్టేసి నిశా అగర్వాల్ సెగలు రేపుతోంది. లైట్ బ్లూ కలర్ శారీలో నిశా అగర్వాల్ పిచ్చెక్కిస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp