Karthika Deepam 26 April Today Episode : శౌర్య చిన్నప్పటి ఫోటోతో తను ఎక్కడుందో సౌందర్య తెలుసుకుంటుందా? ఈ విషయం జ్వాలకు తెలుస్తుందా?

Karthika Deepam 26 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1336 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మామిడికాయ తనకు అందకపోవడంతో నిరుపమ్ వచ్చి ఎత్తుకుంటాడు. దీంతో తను మామిడికాయ కోస్తుంది. దీంతో థాంక్యూ బావా.. నన్ను గెలిపించావు అంటుంది. నిన్ను ఎప్పుడూ నేను గెలిపిస్తూనే ఉంటాను అంటాడు నిరుపమ్. వీళ్లను అక్కడే ఉన్న స్వప్న చూస్తుంది. వీళ్ల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి అని అనుకుంటుంది స్వప్న. వెంటనే ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది. కట్ చేస్తే ఆనందరావు, సౌందర్య కారులో వెళ్తుంటారు. శౌర్య కనిపించినట్టు నాకు కల వచ్చింది అని చెబుతాడు.

Advertisement
karthika deepam 26 april 2022 full episode
karthika deepam 26 april 2022 full episode

ఇంతలో తను శౌర్య చిన్నప్పటి బొమ్మతో పెద్దయ్యాక ఎలా ఉంటుందో బొమ్మను గీయించే ఆర్టిస్ట్ గీత దగ్గరికి వెళ్దాం అంటుంది. ఇంతలో తను సడెన్ బ్రేక్ వేస్తుంది. దీంతో వెనుకే వస్తున్న జ్వాల ఆటో తన కారును ఢీకొడుతుంది. దీంతో కారు దిగి వెనక్కి వచ్చి జ్వాలను చూసి షాక్ అవుతారు. ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. నీ కారుకు ఎంతవుతుందో చెప్పు.. నేను ఆ డబ్బు ఇస్తా అంటుంది జ్వాల. నా ఆటో నీ కారును గుద్దుకోవడంలో నా తప్పు ఏం లేదు. మొన్న నువ్వు నా చెంప చెళ్లుమనిపించావు. ఈరోజు నేను నీ కారును ఢీకొట్టాను. చెళ్లుకు చెళ్లు.. అంటుంది జ్వాల. నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు తప్పిపోయిన నా మనవరాలే గుర్తొస్తుంది అంటాడు ఆనందరావు.

నా మనవరాలి లాంటి దానివి.. ఈ డబ్బులు తీసుకో అంటాడు ఆనంద రావు. మీ తాతయ్య ఇస్తున్నాడనుకో.. తీసుకో అంటాడు. ఆ తర్వాత వాళ్లను ఫాలో అవ్వాలనుకుంటుంది జ్వాల. కానీ.. తన ఆటో స్టార్ట్ కాదు. మరోవైపు స్వప్న.. నిరుపమ్, హిమ మీద చాలా కోపంగా ఉంటుంది.

Karthika Deepam 26 April Today Episode : ఆనంద రావుపై సీరియస్ అయిన స్వప్న

ఇదంతా వాళ్ల నానమ్మ ట్రెయినింగే. నా కొడుకు నిరుపమ్ అమాయకుడు. అందరూ తనలాగే మంచివాళ్లు అనుకుంటాడు. వాడిని ట్రాప్ చేస్తున్నారు. ఆ హిమ అమెరికాలో ఉన్నప్పుడే నా కొడుకు బాగున్నాడు. ఇటు హిమ.. అటు ఆ ఆటోది.. ఇద్దరూ తోడయ్యారు. ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది స్వప్న.

ఇంతలో ఆనంద రావు వస్తాడు. రండి రండి.. నేను చాలా కోపంలో ఉన్నాను అంటుంది. నా కొడుకును వలలో వేసుకోవడానికి నీ మనవరాలిని హాస్పిటల్ లో పెట్టారని నాకు ఎప్పుడో అర్థం అయింది. ఆ విషయం ఎప్పుడో చెప్పాను అంటుంది స్వప్న.

వాళ్లిద్దరూ బావా మరదళ్లు అంటాడు ఆనంద రావు. దీంతో హిమ హద్దులు మీరుతోంది అంటుంది స్వప్న. తోటలో నేను నా కళ్లతో చూశాను. ఒకవైపు ఆ ఆటోది.. మరోవైపు హిమ. ఈ ఇద్దరూ నా కొడుకును ఏం చేస్తారో అని టెన్షన్ గా ఉంది అంటుంది స్వప్న.

లాభం లేదు డాడీ.. నా కొడుకుకు పెళ్లి చేస్తాను. అందరూ షాక్ అయ్యేలా చేస్తా అని అనుకుంటుంది. కట్ చేస్తే ఆటో స్టాండ్ వద్ద ఆటోలో కూర్చుంటుంది జ్వాల. హిమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన గీత.. జ్వాలను చూసి ఒక అమ్మాయి ఆటో నడపడం ఏంటి అనుకుంటుంది.

జూబ్లీహిల్స్ వస్తావా అని అడుగుతుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎంతో ధైర్యంగా ఆటో నడుపుతున్నావు అంటుంది. ఆటో దిగాక.. మేడం మీరు ఏం చేస్తారు. ఈ పెన్సిల్స్.. పేపర్స్ ఇవేంటి అని అడుగుతుంది. ఇంతలో ఆటోలో కూర్చొని తన బొమ్మ గీచి.. తనకు ఇస్తుంది గీత.

నేను ఆటో నడుపుతుంటే వెనుక కూర్చొని ఇంత బాగా గీచారా. గ్రేట్ మేడమ్ అంటుంది జ్వాల. దీంతో నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ను. బొమ్మలు గీయడమే నా వృత్తి అంటుంది. అక్కడి నుంచి తన ఆఫీసులోకి వెళ్తుంది. ఇంతలో అక్కడ సౌందర్య తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.

మా మనవరాలి చిన్నప్పటి ఫోటో చూసి తను ఇప్పుడు ఎలా ఉంటుందో బొమ్మ గీయాలి అంటుంది. దీంతో షూర్ మేడమ్ తప్పకుండా అంటుంది. తన ఫోటోను చూపిస్తుంది. దీంతో ఆ ఫోటోను చూస్తుంది. మరోవైపు అప్పుడే జ్వాల తన ఆఫీసు లోపలికి వస్తుంది.

గీత దగ్గరికి వెళ్తుంది. అక్కడ సౌందర్యను చూస్తుంది. ఏం సీనియర్ సిటిజన్.. నువ్వేంటి ఇక్కడ అంటుంది. షటప్.. నన్ను అలా పిలవకు అంటుంది సౌందర్య. తర్వాత తన బొమ్మ గీసినందుకు గీత ఇచ్చిన డబ్బులను వెనక్కి ఇచ్చేస్తుంది.

ఇంతలో లాప్ టాప్ లో తన చిన్నప్పటి ఫోటోను గీత చూడటం చూస్తుంది జ్వాల. ఇంతలో గీతకు ఫోన్ రావడంతో తను మాట్లాడటానికి వెళ్తుంది. సీనియర్ సిటిజన్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అంటుంది. నీకు అవసరమా అంటుంది. తర్వాత చిన్నప్పుడు నా మనవరాలు తప్పిపోయింది అంటుంది.

దీంతో తప్పిపోయిందా పారిపోయిందా అంటుంది. దీంతో అలిగి వెళ్లిపోయింది అంటుంది. తను ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించి బొమ్మ గీయిద్దామని వచ్చాను అంటుంది సౌందర్య. ఆటో నడుపుకునే దానివి.. నీ పని నువ్వు చూసుకో అంటుంది సౌందర్య.

ఆటో నడుపుకునే దాన్ని కదా.. మీ మనవరాలి వివరాలు చెబితే ఎక్కడైనా కనిపిస్తే చెబుతా అంటుంది జ్వాల. తను కాకుండా ఇంకెవరైనా తప్పిపోయారా. నీకు ఎంతమంది మనవళ్లు, మనవరాళ్లు అని అడుగుతుంది జ్వాల. దీంతో ఇంకో మనవరాలు ఉంది అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement