Karthika Deepam 26 Sep Today Episode : ప్లీజ్ దీపా వెళ్లొద్దు అంటూ రిక్వెస్ట్ చేసిన కార్తీక్‌.. సంతోషంలో తెలిపోతున్న దీప‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 26 Sep Today Episode : ప్లీజ్ దీపా వెళ్లొద్దు అంటూ రిక్వెస్ట్ చేసిన కార్తీక్‌.. సంతోషంలో తెలిపోతున్న దీప‌..!

 Authored By aruna | The Telugu News | Updated on :26 September 2022,10:00 am

Karthika Deepam 26 Sep Today Episode : కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1467 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప వంట చేయడానికి కాలనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళగా.. అప్పుడు వాళ్లు ఒక నాటకం గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. అదంతా విన్న దీప నా దగ్గర ఒక కథ ఉన్నది అది మీకు చెప్తాను అని చెప్తుంది. అప్పుడు ఆ కథ అంత వాళ్లు విని సరే అమ్మ చాలా బాగుంది. కానీ ఇందులో నువ్వు మెయిన్ క్యారెక్టర్ చేయాలి అని చెప్తారు అప్పుడు సరే అని దీప అక్కడి నుంచి వెళ్లి కార్తీక్ ని ఆ నాటకాన్ని చూడడానికి రమ్మని చెప్తుంది. అప్పుడు కార్తీక్ నేను ఎందుకు రావాలి. నేను ఎందుకు చూడాలి అసలు నీ భర్త ఎవరు అని అడుగుతాడు. అప్పుడు దీప నా భర్త ఎవరో తెలియాలి అంటే నేను వేసి నాటకాన్ని మీరు చూడాలి. ఆ నాటకంలో నా భర్త ఎవరు తెలిసిపోతుంది అని చెప్తుంది.

అప్పుడు సరే వస్తాను అని చెప్పి.. శివ తోని మీ మేడంకి నాటకం మాత్రమే చూడ్డానికి వెళ్లాను అని చెప్పు ఇదంతా చెప్పకు అని అంటాడు. అప్పుడు శివ సరే సార్ అని అంటాడు. ఇక దీప కార్తీక్ ఇద్దరు కలిసి ఆ అసోసియేషన్ ప్రోగ్రాం దగ్గరికి వెళ్లి దీప కార్తీక్ ని వాళ్లకి పరిచయం చేస్తుంది. తర్వాత కార్తీక్ నాకు నాటకాలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కాబట్టి తొందరగా మొదలు పెట్టండి అని దీపతో అంటాడు. అప్పుడు దీప సరే డాక్టర్ బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే శౌర్య హిమనీ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. అప్పుడు హిమ నేను రాను అని అంటూ. నాయనమ్మ వాళ్ళు పిలిస్తేనే నేను రాలేదు నువ్వు పిలిస్తే ఎలా వస్తాను అని అనుకుంటున్నావు అని అంటుంది సౌర్య. అంతలో సౌందర్య వాళ్ళిద్దరిని వెతుకుతూ వస్తుంది. సౌందర్యని చూసిన సౌర్య అక్కడినుంచి వాష్ రూమ్ అని చెప్పిపారిపోతుంది.

karthika deepam 26 september 2022 full episode

karthika deepam 26 september 2022 full episode

ఇక సౌందర్య హిమ దగ్గరికి వచ్చి ఏంటి ఇలా వచ్చేసావ్ ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నారే ఆయన సూర్య ఏది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హిమ వాష్రూమ్ వెళ్ళింది నాయనమ్మ అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సౌర్య ఎంతసేపటికి రాపోయేసరికి అది నన్ను చూసింది అనుకుంటా అందుకే అది మళ్ళీ పారిపోయింది అని చెప్పి హిమని మాత్రమే తీసుకొని వస్తూ ఉంటుంది. కట్ చేస్తే మౌనిత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి మాకు తెలిసిన ఒక అతను యాక్సిడెంట్లో గతం మర్చిపోయాడు. ఆయన భార్య గతం గుర్తు రావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. అలా చేస్తే గతం గుర్తొస్తుందా అని అడుగుతుంది. అప్పుడు ఆ డాక్టర్ అలా గుర్తొచ్చే ఛాన్సులు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఎలా అనేది ఎవరికి తెలియదు అని చెప్పగానే… అప్పుడు మౌనిత ఇక ఎలాగైనా కార్తీక్ ని దీప నుంచి దూరంగా తీసుకెళ్లాలి అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక శౌర్య మోనిత కారు డిక్కీలోకి వెళ్లి దాక్కుతుంది. ఆ కారు మౌనిత తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కట్ చేస్తే దీప దగ్గరికి డాక్టర్ వస్తాడు. అప్పుడు దీప కార్తీక్ గురించి చెప్తూ ఉండగా.. అక్కడికి కార్తీక్ వచ్చి ఈయన ఎవరు అని అడుగుతాడు. అప్పుడు దీప మా అన్నయ్య అని చెప్పాను కదా డాక్టర్ బాబు అని అంటుంది.

అప్పుడు మీ అన్నయ్య అయితే నిన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు.. నీ భర్తని వెతికి నిన్ను నీ భర్తని దగ్గర చేయొచ్చు కదా ఎందుకు పట్టించుకోవడం లేదు.. అని అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూఏమి మాట్లాడ పోయేసరికి, మల్లి కార్తిక్ మీరు పట్టించుకోవడంలేదని నేనే రంగంలోకి దిగాను ఈరోజు ఈ నాటకాన్ని చూసి తన భర్తని ఈ వంటలక్కని కలుపుతాను. అయినా ఈ నాటకం వేసే వరకు నేను ఉండలేను ఇప్పుడు మీరే తను ఎవరు చెప్పరాదండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్లు ఇంతసేపు ఆగారు కదా ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేయండి అని డాక్టర్ కార్తీక్ ని అక్కడినుంచి తీసుకెళ్తాడు.. ఇక రేపటి ఎపిసోడ్లో దీప నాటకం వేస్తూ ఉండగా.. కార్తీక్ అంతా గుర్తు చేసుకుంటూ ఉంటూ దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్లు ఊహించుకొని దీప.. దీప.. ఆగు వెళ్లొద్దు అని గట్టిగా మొత్తుకుంటూ ఒక్కసారిగా కింద పడిపోతాడు.. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది