Karthika Deepam 29 Oct Today Episode : దుర్గకు దొరికిపోయిన వాల్తేరు వాణి.. దీప, కార్తీక్ ను చూసి షాక్ అయిన శౌర్య.. మొత్తానికి కథ సుఖాంతం

Advertisement
Advertisement

Karthika Deepam 29 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 అక్టోబర్ 2022, శనివారం ఎపిసోడ్ 1497 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ కోసం నేను ఎన్నో పాట్లు పడ్డాను. ఆయన కోసం పడ్డ పాట్లు ఈ లోకంలో ఏ ప్రియురాలు ఆ ప్రియుడి కోసం పడి ఉండదు. నా కార్తీక్ కోసం నేను ఎంతో కష్టపడ్డా. ఇంకా పడుతూనే ఉన్నాను. కార్తీక్ దీప ఇద్దరూ భార్యాభర్తలు. ఆ అమ్మాయి వాళ్ల కూతురే. అందుకే వాళ్లు రేపు ఆ అమ్మాయిని కలవకూడదు అని వాణితో చెబుతుంది మోనిత. దీంతో మీ ప్రేమ చాలా గొప్పది మేడం అంటుంది వాల్తేరు వాణి. చనిపోయాడని అనుకున్న కార్తీక్ బతికుండటంతో చివరకు ఎవరికీ తెలియకుండా ఇక్కడ కార్తీక్ తో బతుకుదామని అనుకున్నా కానీ.. మళ్లీ ఆ దీప కూడా బతికివచ్చి నన్ను టార్చర్ పెడుతోంది. ప్రతిరోజు ప్రతిక్షణం నేను ఏ తప్పు చేయలేదని కార్తీక్ ను నమ్మించడంలోనే నాకు సరిపోతుంది అంటుంది మోనిత. దీంతో వాల్తేరు వాణి ఉండగా ఇక మీరు టెన్షన్ పెట్టుకోకండి. మీ ప్రేమకు నేను ఇచ్చే అభిమానం ఇది అనుకోండి అంటుంది. మీరు డబ్బులు ఇవ్వకున్నా ఏం లేదు అంటుంది.

Advertisement

karthika deepam 29 october 2022 full episode

దీంతో వద్దు.. నేను నీకు ఈ పని చేసి పెడితే 2 లక్షలు కాదు.. 10 లక్షలు ఇస్తా అంటుంది మోనిత. దీంతో సరే మేడమ్.. ఇక పని అయిపోయినట్టే. క్యాష్ రెడీ చేసుకోండి అంటుంది వాల్తేరు వాణి. మరోవైపు శౌర్య కోసం పిండి వంటలు చేస్తూ ఉంటుంది దీప. ఇంతలో కార్తీక్ వస్తాడు. శౌర్య కోసమే చేస్తున్నట్టుంది అని అనుకుంటాడు. భగవంతుగా ఆ పాప శౌర్య అయ్యేలా చూడు అని అనుకుంటాడు కార్తీక్. ఈ పిండి వంటలన్నీ శౌర్య కోసమే కదా అంటాడు కార్తీక్. దీంతో అవును డాక్టర్ బాబు. ఇవన్నీ శౌర్యమ్మకు చాలా ఇష్టం. అక్కడ నా బిడ్డ ఎలా ఉందో. ఎప్పుడు తెల్లారుతుందో.. ఎప్పుడు శౌర్యను చూస్తానో అని ఆతృతగా ఉంది డాక్టర్ బాబు అంటుంది దీప. ఇంతలో అక్కడికి వాణి వస్తుంది. వాణికి విషయం తెలుసా అని అడుగుతాడు కార్తీక్. నా కూతురు దగ్గరికి వెళ్తున్నాం వాణి అంటుంది దీప. దీంతో ఈ రాత్రికే నీ పని ఖతం. ఇంకెక్కడికి వెళ్తావు అని మనసులో కొంటుందింది వాణి.

Advertisement

పని పూర్తయ్యే వరకు నేను తోడుగా ఉంటాను అంటుంది వాణి. సరే గుడ్ నైట్. ఉదయమే త్వరగా రెడీ అవ్వు అని చెప్పి వెళ్తాడు కార్తీక్. ఇంకెంత సేపు చేస్తావు. ఇక పడుకో అంటుంది దీప. పడుకోకపోతే నా పని ఎలా అవుతుంది. తొందరగా పడుకోబెట్టాలి అని అనుకుంటుంది వాణి.

మరోవైపు మోనిత.. తన బిడ్డ దగ్గర కూర్చొని కార్తీక్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకిలా కార్తీక్ ప్రతిదానికి రివర్స్ అవుతున్నాడు. నేను ఏం చెప్పినా కాదంటున్నాడు. ప్రతి విషయంలో అనుమానిస్తున్నాడు అని అనుకుంటుంది. వీడిని తీసుకొస్తే మా కొడుకు అని మా బంధం గట్టిదవుతుంది అనుకున్నా.

దీప దగ్గరికే వెళ్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు ఎప్పుడైనా గతం గుర్తొస్తే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటుంది మోనిత. ఇప్పటికే గతం గుర్తొచ్చిందా. కార్తీక్ ప్రవర్తన చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కానీ.. గుర్తొస్తే ఇలా ఉండడే.. నన్ను కాదని దీప దగ్గరికి వెళ్లిపోతాడు కదా.

Karthika Deepam 29 Oct Today Episode : దీప చనిపోతుందన్న సంతోషంలో ఉన్న మోనిత

ఒకవేళ గుర్తొచ్చినా గుర్తురానట్టు నాటకం ఏమన్నా ఆడుతున్నాడా? దాని వల్ల ఏంటి లాభం. అనవసరంగా టెన్షన్ పడుతున్నాను. గుర్తురాలేదు. ఆ దుర్గ గాడు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల కార్తీక్ కు అనుమానం వచ్చింది. ఎలాగూ ఈరోజు రాత్రికే ఇద్దరి పని అయిపోతుంది కాబట్టి.. రేపటి నుంచి ఇక నేను కార్తీక్ సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటుంది మోనిత.

మరోవైపు దీప నిద్రపోతూ ఉంటుంది. దీంతో వాణి తన ప్లాన్ ను స్టార్ట్ చేస్తుంది. గుడిస మీద పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తుంది. కానీ.. నిప్పు అంటుకోదు. ఇంతలో అక్కడికి వచ్చిన దుర్గ.. పెట్రోల్ కాదు అది నీళ్లు. అవి పోస్తే ఎలా అంటుకుంటుంది పాప అంటాడు.

అక్కడ దుర్గను చూసి షాక్ అవుతుంది. నువ్వు వచ్చినప్పుడే నాక నీ మీద డౌట్ వచ్చింది అని దుర్గ తనను పట్టుకుంటాడు. కట్ చేస్తే తెల్లవారుతుంది. మోనిత ఉదయమే లేచి దీప ఇంటి ముందు చూస్తుంది. దీప, దుర్గ చనిపోయారా అనుకుంటుంది. కానీ.. తన ఇల్లు మాత్రం అలాగే ఉంటుంది.

దీంతో మోనిత షాక్ అవుతుంది. అదేంటి ఈ వాణి పని చేయలేదా అని అనుకుంటుంది. వాల్తేరు వాణి ఎక్కడ చచ్చింది అనుకొని ఫోన్ చేస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన దుర్గ.. తన ఫోన్ లాక్కుంటాడు. నన్ను, దీపమ్మను ఏం చేయలేవు అని అంటాడు దుర్గ.

నువ్వు అనుకున్నది ఏం జరగదు అంటాడు. ఇప్పుడు పోలీసులను నేను పిలవనా.. సాక్ష్యంగా వాల్తేరు వాణిని పెట్టనా. అటెంప్ట్ మర్డర్ కేసు. ఈ విషయం కార్తీక్ సార్ కు చెబుదామా అంటాడు దుర్గ. దీంతో ఏ విషయం అంటాడు కార్తీక్. అప్పుడే అక్కడికి వస్తాడు.

ఏ విషయం అంటాడు కార్తీక్. దీంతో వద్దు అని మోనిత దుర్గకు సైగ చేస్తుంది. మీరిద్దరూ మాట్లాడుకొనేటప్పుడు నా ప్రస్తావన కూడా వస్తుందా? అసలు నేను ఒకడిని ఉన్నానన్న సంగతి కూడా మీకు గుర్తుంటుందా? మీకు వేళా పాళా లేదా.. పొద్దున్నే మొదలుపెట్టేశారు అంటాడు కార్తీక్.

జరిగింది మరిచిపోయినట్టు చూసింది కూడా మరిచిపోతే బాగుండేది. కొన్ని దారుణాలు చూసి వెంటనే మరిచిపోవచ్చు.. చీ అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఏంటి బంగారం చెప్పేస్తానని భయపడ్డావా.. చెప్పను బంగారం. వాణి గురించి చెబితే నీకు నాకు పడదని తెలిసిపోతుంది కదా. అందుకే నేను చెప్పను అంటాడు దుర్గ.

మరోవైపు దీప.. శౌర్య దగ్గరికి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఏంటి ఇంత బాగా రెడీ అయ్యావు అంటాడు కార్తీక్. చాలా రోజులు అవుతోంది కదా అంటాడు కార్తీక్. మీరేంటి ఇంకా రెడీ అవ్వలేదు అంటుంది దీప. దీంతో నేను ఎంత సేపు చిటికెలో రెడీ అవుతా అంటాడు కార్తీక్.

మరోవైపు శౌర్యకు పెద్దమనిషి ఫంక్షన్ చేస్తుంటారు. ఇంతలో దీప, కార్తీక్ ఇద్దరూ అక్కడికి వస్తారు. ఇద్దరినీ చూసి లోపలికి పిలుస్తాడు ఇంద్రుడు. అమ్మాయిని చూపించు అంటాడు ఇంద్రుడు. ఇంతలో శౌర్య బయటికి వచ్చి కార్తీక్, దీపలను చూస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

12 minutes ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

8 hours ago

Raashii Khanna : మైమ‌రిపించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోలు వైర‌ల్

Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…

9 hours ago

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!

Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…

10 hours ago

Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?

Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…

11 hours ago

Saree Viral Video : ఓహ్..ఈ టైపు చీరలు కూడా వచ్చాయా..? దేవుడా..?

Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…

12 hours ago

Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్- లావణ్య కేసులో సంచలన ట్విస్ట్..!

Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…

13 hours ago

Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

Chandrababu  : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…

14 hours ago