Ram Charan : ఇంటికి పిలిచి కాళ్లకి దండం పెట్టిన రామ్ చరణ్.. షాకింగ్ విషయాలు వెల్లడించిన డైరెక్టర్
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. నటుడిగా, నిర్మాతగా సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నాడు. రీసెంట్‌గా రామ్ చరణ్ తన బర్త్ డే జరుపుకోగా, ఈ ఏడాది చాలా స్పెషల్ గా నిలిచింది. నాలుగేళ్ళ ఆయన శ్రమకు ఆర్ ఆర్ ఆర్ రూపంలో దక్కింది. చరణ్ నటన సినిమాలో హైలెట్ కావడం విశేషం. చరణ్ ముందు ఎన్టీఆర్ పాత్ర తేలిపోయింది. ఆర్ఆర్ఆర్ లో అసలు హీరో చరణ్ అయ్యాడు. బ్రిటిష్ వాళ్లపై పోరాడడానికి రామ్, భీం పాత్రలకు వేరు వేరు కారణాలున్నాయి. అయితే భీమ్ లక్ష్యం తాత్కాలికంగా చేసి రామ్ పోరాటం శాశ్వతమైన కీలకమైనదిగా చూపించారు.
సోషల్ మీడియాలో చరణ్ నటనకు సర్వత్రా ప్రసంశలు దక్కుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ నేపథ్యంలో రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. చరణ్ తన 15వ చిత్రం దర్శకుడు శంకర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేయడానికి సైన్ చేశారు.రామ్ చరణ్ బర్త్ డే నాడు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో మెహర్ రమేష్ చెప్పిన విషయాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రామ్ చరణ్ సంస్కారం గురించి చెబుతూ ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టేశాడు.

meher ramesh emotional comments on ram charan
Ram Charan : చరణ్ గొప్పతనం అంటే ఇది…!
‘బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవి గారిని మళ్లీ తెర మీదకు తీసుకురావాలని చాలా కష్టపడ్డాడు రామ్ చరణ్. దర్శకుడిగా వివి వినాయక్‌ను పెట్టారు. సినిమా ఎలాగైనా సరే హిట్ అవ్వాలని అనుకున్నాడు. అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది జరిగిన ఓ పది నెలల తరువాత వివి వినాయక్‌ను రామ్ చరణ్ ఇంటికి పిలిచాడు. రామ్ చరణ్‌కి తెలుగు రాయడం రాదు. అయినా కూడా వి వి వినాయక్ కోసం లెటర్ రాశాడు. తన ప్రేమను వ్యక్తపరిచాడు. సినిమాను హిట్ చేసినందుకు.. శాలువా కప్పి కాళ్లకు దండం పెట్టాడు అదీ రామ్ చరణ్ సంస్కారం’ అంటూ మెహర్ రమేష్ .. చరణ్‌పై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. మెహర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.