Star Maa Comedy Stars : వారాలు గడుస్తున్నాయి.. మా టీవీలో వస్తున్న కామెడీ స్టార్స్ పరిస్థితి ఏంటీ?
Star Maa Comedy Stars : ఈటీవీ లో ప్రసారం అవుతున్న మల్లెమాల వారి జబర్దస్త్ కామెడీ షో కి పోటీగా ఇప్పటికే పలు కార్యక్రమాలు తెలుగు బుల్లి తెరపై వివిధ ఛానల్స్ లో ప్రసారం అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ ప్రారంభమై తొమ్మిది సంవత్సరాలు కావస్తోంది. ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఈ షో ని ఢీ కొట్టేందుకు దాదాపు అన్ని చానల్స్ కూడా ప్రయత్నించాయి. కానీ ఏ ఒక్క ఛానల్ కి కూడా ఆ స్థాయి రేటింగ్ గాని ఆ స్థాయి గుర్తింపు కాని దక్కలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం స్టార్ మా టీవీ లో కామెడీ స్టార్స్ అనే షో ప్రసారం అవుతుంది.
ఆ షో కి సంబంధించిన రేటింగ్ విషయంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.జబర్దస్త్ కు ఈ మధ్య కాలంలో రేటింగ్ చాలా తగ్గింది అనేది చాలా మందికి తెలిసిన విషయమే. ఇప్పుడు జబర్దస్త్ కు వస్తున్న రేటింగ్ లో కనీసం సగం కూడా కామెడీ స్టార్స్ కి రావడం లేదట. పైగా ఆదివారం ప్రైమ్ టైమ్ లో స్టార్ మా లో ప్రసారం అవుతున్నా కూడా ఏమాత్రం రేటింగ్ దక్కించుకోలేక పోతుంది. రోజులకు రోజులు గడిచిపోతున్నాయి.. వారాల గడిచిపోతున్నాయి ఆయినా కూడా ఇప్పటి వరకు జబర్దస్త్ రేంజ్ లో కాదు కదా కనీసం అందులో సగం కూడా కామెడీ స్టార్స్ అందుకోలేక పోవడంతో ఆ షో కూడా ఖచ్చితంగా త్వరలోనే దుకాణం చేసే అవకాశాలు ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

star maa comedy stars rating with etv jabardast
ఏ కార్యక్రమమైనా రేటింగ్ రాకుంటే ఎక్కువ కాలం కొనసాగడం అసాధ్యం. చేతుల నుండి ఖర్చు పెట్టి ఇబ్బంది పడరు.. ఎందుకంటే పోటీ నుండి తప్పుకోవడం అనేది మార్కెటింగ్ రూల్. కనుక మరి కొన్ని వారాలు చూసి ఆ తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే కచ్చితంగా కామెడీ స్టార్ కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయంటూ బుల్లి తెర వర్గాల వారు మరియు నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఎంట్రీ ఇచ్చినా కూడా పెద్దగా ఉపయోగం లేకపోవడం తో స్టార్ మా నిరుత్సాహం తో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.