Karthika Deepam 4 May Today Episode : నిరుపమ్ ను కలిసిన జ్వాల.. హిమను ప్రేమిస్తున్నా అని జ్వాలతో చెబుతాడా? జ్వాల ఏం చేస్తుంది?

Authored By Varun G | The Telugu News | Published on: May 4, 2022, 10:30 am

Karthika Deepam 4 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 మే 2022, బుధవారం ఎపిసోడ్ 1343 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిరుపమ్ ను కలిసేందుకు వెళ్లబోతుండగా.. సడెన్ గా జ్వాల ఆటో ఆగిపోతుంది. దీంతో జ్వాలకు ఏం చేయాలో అర్థం కాదు. ఎవ్వరూ లిఫ్ట్ కూడా ఇవ్వరు. ఇంతలో సౌందర్య కారు వస్తుంది. అది సౌందర్య కారు అని తెలియక.. వెళ్లి రోడ్డుకు అడ్డంగా నిలుచుకుంటుంది జ్వాల. తీరా చూస్తే అది సౌందర్య కారు. నువ్వేంటే రోడ్డుకు అడ్డంగా నిలుచుకున్నావు.. అంటుంది సౌందర్య. హలో సీనియర్ సిటిజన్ అంటుంది జ్వాల. అర్జెంట్ గా పోవాల్సిన అవసరం వచ్చింది సీనియర్ సిటిజన్. నిన్ను ముద్దుగా ఇప్పటి నుంచి సీసీ అంటాను సరేనా అంటుంది జ్వాల.

karthika deepam 4 may 2022 full episode

karthika deepam 4 may 2022 full episode

అర్జెంట్ గా నాకు లిఫ్ట్ కావాలి అంటుంది జ్వాల. చివరకు డీజిల్ ఇస్తుంది. దీంతో డీజిల్ ను తీసుకొని తన ఆటోలో పోసుకుంటుంది జ్వాల. ఆ తర్వాత సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు స్వప్న.. తల పట్టుకొని కూర్చుంటుంది. తలనొప్పిగా ఉంది అని అనుకుంటుంది. ఒంట్లో కూడా నీరసంగా ఉంది అనుకుంటుంది. ఇంతలో కిందపడబోతుంటే సౌందర్య వచ్చి పట్టుకుంటుంది. వదులు మమ్మీ అంటుంది స్వప్న. ఇప్పుడు కూడా పంతమేనా. పదా లోపలికి అంటుంది. నువ్వెందుకు వచ్చావు అంటుంది స్వప్న. నేను నిన్ను చూడాలని.. నీతో మాట్లాడాలని వచ్చాను. నీకు ఏదైనా అయితే ఏంటి పరిస్థితి. ఇల్లు అంటే అందరూ ఉండాలి స్వప్న. ఒంటరిగా ఉంటే ఇల్లు అనరు. దాన్ని సంసారం అని కూడా అనరు అంటుంది సౌందర్య.

మరోవైపు నిరుపమ్ చెప్పిన అడ్రస్ కు వెళ్తుంది జ్వాల. ఇంతలో నిరుపమ్ వస్తాడు. టీ ఆర్డర్ చేస్తాడు. ఆ తర్వాత నిరుపమ్ తనకు ఏదో చెప్పాలనుకుంటాడు కానీ.. చెప్పలేకపోతాడు. జ్వాల మాత్రం తనకు నిరుపమ్ ఐలవ్యూ చెబుతాడేమో అని అనుకుంటుంది.

ఇద్దరం ఒకే టీ తాగుతాం. సగం సగం తాగుతాం అని అనుకుంటుంది జ్వాల. మరోవైపు స్వప్న పడుకుంటుంది. తననే చూస్తూ కూర్చుంటుంది సౌందర్య. తనను చూసి చిరాకు పడుతుంది స్వప్న. అన్నీ బాగుంటేనే మన పంతాలు, పౌరుషాలు ఉంటాయి స్వప్న.

Karthika Deepam 4 May Today Episode : స్వప్నకు నచ్చజెప్పిన సౌందర్య

మనమంటూ ఆరోగ్యంగా లేకపోతే మనకు తోడంటూ అవసరం అంటుంది. అందుకే మన పెద్దలు కుటుంబ వ్యవస్థను అందించారు అంటుంది సౌందర్య. నీ పరిస్థితిని చూసి నేనేదో దెప్పిపొడుస్తున్నాను అనుకోకు. ప్రేమ్, అల్లుడు అక్కడ.. నిరుపమ్ ఇక్కడ. ఎందుకు స్వప్న.. నీకు అంత పంతం అంటుంది సౌందర్య.

నేను నాకు నచ్చిన కోడలును తెచ్చుకుంటాను. నా సమస్యకు పరిష్కారం అవుతుంది. నువ్వేమీ నా మీద జాలి పడాల్సిన అవసరం లేదు అంటుంది. ఇంతలో హిమ అక్కడికి వస్తుంది. హిమను కోపంగా చూస్తుంది స్వప్న. ఎందుకే అంత కోపంగా చూస్తావు అంటుంది సౌందర్య.

నీకు బాగా లేదని హిమను పిలిచాను అంటుంది. తను నీకు ట్రట్ మెంట్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటి. ముందు నిరుపమ్ కు ఫోన్ చేశా కానీ.. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అంటుంది సౌందర్య. తర్వాత ఏమైంది అత్తయ్య. పొద్దున ఏం తిన్నావు అని అడుగుతుంది హిమ.

దీంతో నేను బాగానే ఉన్నాను. నాకేమీ నువ్వు ట్రీట్ మెంట్ చేయాల్సిన అవసరం లేదు అంటుంది స్వప్న. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp