Karthika Deepam 5 Nov Today Episode : ప్రియమణి అసలు గుట్టు తెలుసుకొని ఇంట్లో నుంచి గెంటేసిన దీప.. దోషనివారణ పూజకు ఒప్పుకోని మోనిత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 5 Nov Today Episode : ప్రియమణి అసలు గుట్టు తెలుసుకొని ఇంట్లో నుంచి గెంటేసిన దీప.. దోషనివారణ పూజకు ఒప్పుకోని మోనిత

 Authored By gatla | The Telugu News | Updated on :5 November 2021,10:00 am

Karthika Deepam 5 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 1189 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత.. ప్రియమణిని పిలిచి ఎలాగైనా కార్తీక్ ఇంటికి వెళ్లాలని.. అక్కడే సెటిల్ అయిపోవాలని చెబుతుంది. ఇంతలో భారతి.. తన ఇంటికి వస్తుంది. ఏంటి విషయాలు అని అడుగుతుంది. సౌందర్య గారు మిమ్మల్ని దోషనివారణ పూజకు రమ్మని చెప్పారు అని అంటుంది. మోనిత మాత్రం అస్సలు పట్టించుకోదు. అస్సలు.. ఆమె చెప్పే విషయాలను వినదు. కార్తీక్ కు చాలా డేంజర్ అట అన్నా కూడా అస్సలే వినదు మోనిత. దీంతో భారతికి చాలా కోపం వస్తుంది. అయినా కూడా మోనిత వినదు. పోనీ నువ్వు వెళ్తావా భారతి అంటుంది. నిన్ను అడగడం ఏంటి.. నన్ను అడగొచ్చు కదా… అంటుంది మోనిత.

karthika deepam 5 november 2021 full episode

karthika deepam 5 november 2021 full episode

వాళ్లు  నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో నీకు తెలుసు కదా. పీటల మీద పెళ్లి ఆపించారు. నన్ను ఎంత హింసించారో తెలుసు కదా. నేను ఆలోచిస్తానులే నువ్వు వెళ్లిపో లేట్ అవుతుంది అని చెప్పి భారతిని పంపించేస్తుంది మోనిత. కట్ చేస్తే.. సౌందర్య, కార్తీక్… ఇద్దరూ మాట్లాడుతుంటారు. నేను పూజకు వస్తాను కానీ.. మోనిత పక్కన మాత్రం అస్సలు కూర్చోను అంటాడు కార్తీక్. ఒకవేళ నేను మోనిత పక్కన కూర్చొని పూజ చేస్తే నేను మోనితను ఒప్పుకున్నట్టే కదా.. అంటాడు కార్తీక్.

పొద్దున ఏం జరిగిందో చూశావు కదా. కరెంట్ షాక్ కొట్టి ఉంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయం వేస్తోంది కార్తీక్. తల్లి బాధను అర్థం చేసుకోరా అంటుంది సౌందర్య. ఇంతలో కార్తీక్.. దేవుడి దగ్గరికి సౌందర్యను తీసుకెళ్లి దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను స్పృహలో ఉండగా ఏ తప్పు చేయలేదు అంటాడు. అరేయ్.. ఇప్పుడు తప్పు ఒప్పుల గురించి మాట్లాడే సమయం లేదురా. నువ్వు పూజ చేస్తేనే నాకు మనశ్శాంతి అని అంటుంది సౌందర్య. ఇంతలో దీప వచ్చి.. శాంతి ఏంటి అత్తయ్య. రాత్రి 11 గంటలకు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది దీప.

Karthika Deepam 5 Nov Today Episode : ఈరోజంతా మాతోనే గడపాలంటూ కార్తీక్ ను కోరిన హిమ

దీప రావడంతో సౌందర్య, కార్తీక్ షాక్ అవుతారు. కానీ… దీపకు అన్నీ అర్థం అవుతాయి కానీ.. ఏదీ తెలియనట్టుగా మాట్లాడుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఏం చేయాలో సౌందర్యకు అర్థం కాదు. ఇంతలో ప్రియమణి వెనుక గేట్ నుంచి ఇంటికి రావడం చూసిన దీప… ప్రియమణిని ఆపుతుంది. అర్ధరాత్రి వేళ ఎందుకు ఇలా దొంగతనంగా వస్తున్నావు అని అడుగుతుంది. దీంతో మోనితమ్మ దగ్గరికి వెళ్లాను దీపమ్మ అంటుంది. ఏంటి మోనితతో ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా? అంటుంది. దీంతో అవును అంటుంది. అసలు మోనితమ్మ నన్ను వదిలిపెట్టదమ్మా అంటుంది. అంటే మోనిత చెబితేనే నువ్వు ఇక్కడికి వచ్చావా? పాపం అని జాలిపడి తీసుకొస్తే నువ్వు చేసే పని ఇదా? నడువు.. బయటికి నడువు. ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్లిపో. ఇంకేం మాట్లాడకు. నాకు కోపం పెరగకముందే ఇక్కడ నుంచి వెళ్లిపో.. అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో ప్రియమణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

karthika deepam 5 november 2021 full episode

karthika deepam 5 november 2021 full episode

మరోవైపు హిమ.. కార్తీక్ ను పిలిచి డాడీ ఈరోజు మనం ఇక్కడే పడుకుందాం. సరదాగా కబుర్లు చెప్పుకుందాం డాడీ. అందరం ఈరోజు ఇక్కడే ఉందాం అని అంటుంది. దీంతో సరేరా నువ్వు అడిగితే కాదంటానా చెప్పు అని అంటాడు కార్తీక్. అమ్మను కూడా రమ్మని చెబుదాం అంటుంది హిమ. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. దీప కూడా వస్తుందా అని అంటాడు. అవును.. ఈరోజు మనం నలుగురం కలిసి ఉందాం అంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది