Karthika Deepam 6 Nov Episode Highlights : మోనిత ప్లాన్ లో అడ్డంగా ఇరుక్కుపోయిన కార్తీక్.. కార్తీక్ అరెస్ట్.. అసలు ట్విస్ట్ ఇదే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 6 Nov Episode Highlights : మోనిత ప్లాన్ లో అడ్డంగా ఇరుక్కుపోయిన కార్తీక్.. కార్తీక్ అరెస్ట్.. అసలు ట్విస్ట్ ఇదే

 Authored By gatla | The Telugu News | Updated on :5 December 2021,9:00 am

Karthika Deepam 6 Nov Episode Highlights : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. డిసెంబర్ 6, 2021 సోమవారం ఎపిసోడ్ 1215 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ చేస్తూ కార్తీక్ ఓ పేషెంట్ ను చంపేస్తాడు. నర్సు కాఫీలో మత్తు ట్యాబ్లెట్లు వేసి కార్తీక్ కు ఇస్తుంది. ఆపరేషన్ కు వచ్చే ముందు కార్తీక్ ఆ కాఫీని తాగి రావడంతో మత్తులా వచ్చి ఆపరేషన్ సరిగ్గా చేయలేకపోతాడు. దీంతో ఆపరేషన్ తప్పుగా చేసి పేషెంట్ ను చంపేస్తాడు. అయితే.. ఇదంతా మోనిత ప్లాన్. మోనిత.. నర్సుకు డబ్బు ఆశ చూపించి ఆ పని చేస్తుంది. కార్తీక్ ను తన దగ్గరికి తెచ్చుకోవడం కోసం.. కార్తీక్ ను డాక్టర్ వృత్తిలోనే లేకుండా ఉండేందుకు ఇదంతా మోనిత చేసిన ప్లాన్.

karthika deepam 6 december 2021 episode

karthika deepam 6 december 2021 episode

కార్తీక్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే.. చనిపోయిన వ్యక్తి భార్య.. కార్తీక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని. ఆపరేషన్ చేయకున్నా నా భర్త బతికేవాడేమో. ఇంకొన్ని రోజులు నా ముందు ఉండేవాడేమో. నా పిల్లలు ఇప్పుడు దిక్కులేని పక్షులు అయ్యారు. మమ్మల్ని రోడ్డుకు ఈడ్చావు కదా.. అంటూ కార్తీక్ ను అంటుంది. ఈ ఇద్దరు పిల్లలను పెట్టుకొని నేనెలా బతకాలి. గొప్ప డాక్టర్ అన్నారు. చచ్చిపోయిన వాళ్లను బతికిస్తారన్నారే.. బతికున్నవాడినే చంపేశావు కదయ్యా. ఇప్పుడు ఎంత ఏడ్చినా మీ నాన్న తిరిగి రాడమ్మా. మనమిక ఎట్లా బతికేది అమ్మా. ఇక మిమ్మల్ని ఎలా బతికించుకోవాలి. మనకేం కర్మ. మనకెందుకు ఈ బాధ.. అంటూ పిల్లలను చూస్తూ ఏడుస్తుంది పేషెంట్ భార్య.

నీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా. వాళ్లకు నా పిల్లల ఉసురు తగులుతుంది. మా ఉసురు తగులుతుంది. మీరు చల్లగా బతుకుతారని అనుకోకండి. నాశనం అయిపోతాడు. మట్టికొట్టుకుపోతారు. నీ పిల్లలకు మా ఉసురు ఖచ్చితంగా తాకుతుంది.

ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏం ప్రయోజనం లేదు. పదండి.. వెళ్లి మనం ఇంత విషం తాగి చచ్చిపోదాం అంటుంది ఆమె. నువ్వు బాగుపడవు. నీ పిల్లలు బాగుపడరు. నా తాళి తెంచి వెళ్తున్నావు. పైన భగవంతుడు ఉన్నాడు. నీకు శిక్ష వేస్తాడు.. అంటుంది ఆమె.

దీంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు కార్తీక్ ఇంట్లో సంబురాలు చేసుకుంటూ ఉంటారు. అందరూ సంతోషంగా ఉంటారు. శౌర్య, హిమ ఇద్దరూ సరదాగా ఆనంద రావు, సౌందర్యతో గడుపుతుంటారు. ఇంతలో కార్తీక్ గొప్పతనం చెబుతుంటుంది సౌందర్య. చీమకు కూడా హాని చేయడు కార్తీక్ అంటుంది సౌందర్య.

Karthika Deepam 6 Nov Episode Highlights : నా కొడుకు బుద్ధిమంతుడు అంటూ పిల్లలతో అన్న సౌందర్య

నా కొడుకు చాలా బుద్ధిమంతుడు. మీరు కూడా నా కొడుకులాగా చదువుకొని గొప్ప డాక్టర్ అవ్వాలి అంటుంది సౌందర్య. మరోవైపు కార్తీక్ ఆపరేషన్ ఎలా చేస్తాడో చెబుతుంది హిమ. డాడీ చాలా గ్రేట్ అంటారు పిల్లలు. మీరు వాడిని గ్రేట్ గ్రేట్ అనడం కాదు.. మీరు కూడా వాడిలా గొప్పవాళ్లు కావాలి అంటుంది సౌందర్య.

మరోవైపు కార్తీక్.. ఇంటికి వెళ్లేందుకు బయలుదేరుతుండగా.. మళ్లీ ఆ పేషెంట్ భార్య వచ్చి.. వెళ్తున్నావా.. డాక్టరయ్యా.. ఇంటికి వెళ్తున్నావా? మీ ఇంట్లో దీపం వెలిగించే ప్రతి రోజు నా ఇంటి దీపం ఆర్పేశావన్న సంగతి నీకు గుర్తొస్తుంది. ఆపరేషన్ చేసి బతికిస్తావనుకుంటే.. నీ చేతులతోనే నా భర్తను చంపేశావు కదా.. అంటుంది.

నువ్వు, నీ పెళ్లాం పిల్లలు బాగుపడరు. నాశనం అయిపోతారు. మట్టికొట్టుకుపోతారు.. అంటుంది. మరోవైపు డాడీ ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది హిమ. నానమ్మ.. అమ్మ ఇంకా రాలేదు ఏంటి అంటుంది శౌర్య. మీరిద్దరూ ప్రశ్నలతోనే వేధిస్తున్నారు.. అంటుంది సౌందర్య.

ఇంతలో ఆదిత్య వస్తాడు. బాబాయ్.. మాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టవా అని అడుగుతారు. నేను కొని పెట్టను అంటాడు ఆదిత్య. అయితే ఇఫ్పటి నుంచి దీపు గాడిని ఎత్తుకోము అంటారు. అంటే.. ఐస్ క్రీమ్ కొనిస్తేనే ఎత్తుకుంటారా.. అంటూ సీరియస్ అవుతాడు ఆదిత్య. దీంతో ఊరికే అన్నాం లే బాబాయ్ అంటుంది హిమ.

ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. అందరూ సరదాగా గడుపుతుంటారు. కార్తీక్ మాత్రం బాధపడుతూ ఇంట్లోకి వస్తాడు. కార్తీక్ ఆపరేషన్ చేసి ఓ పేషెంట్ ను చంపేశాడనే విషయం వాళ్లకు తెలియదు కదా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది