Karthika Deepam 9 Aug Monday Episode Highlights : మోనితను నిజంగానే కార్తీక్ చంపేశాడా? ఆమె శవాన్ని మాయం చేశాడా?
Karthika Deepam 9 Aug Monday Episode Highlights : కార్తీక దీపం సీరియల్ ఆదివారం ప్రసారం కాదు. సోమవారం అంటే.. ఆగస్టు 9న కార్తీక దీపం సీరియల్ మళ్లీ ప్రసారం కానుంది. అయితే.. సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ కు సంబంధించిన వీడియోను స్టార్ మా రిలీజ్ చేసింది.

karthika deepam 9 august 2021 monday episode 1113 highlights
సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటంటే.. ఏసీపీ రోషిణి మేడమ్.. పోలీసులతో సహా.. కార్తీక్ ఇంటికి వస్తుంది. చాలా ఆవేశంగా వాళ్ల ఇంటికి వస్తుంది. అప్పుడే కార్తీక్, దీప.. ఇద్దరూ బయటికి వెళ్దామని రెడీ అవుతుంటారు. ఏసీపీని చూసి.. రండి మేడమ్.. మేమే మీ దగ్గరిక వద్దామనుకుంటున్నాం.. అని దీప అంటుంది. దేనికి లోంగిపోవడానికా? అని రోషిణి ప్రశ్నిస్తుంది.

karthika deepam 9 august 2021 monday episode 1113 highlights
లొంగిపోవడం ఏంటి? మేడమ్.. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని దీప అడుగుతుంది. రోషిణి మాత్రం ఎక్కడ దాచావు అంటూ కార్తీక్ ను నిలదీస్తుంది. ఎవరిని అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు మోనిత శవాన్ని.. అంటూ చెబుతుంది రోషిణి. దీంతో.. దీప, కార్తీక్.. ఇద్దరూ షాక్ అవుతారు.
Karthika Deepam 9 Aug Monday Episode Highlights : కార్తీకే మోనితను చంపాడని దీప కూడా నమ్ముతోందా?
ఏంటి మేడమ్.. మీరు మాట్లాడేది.. మోనిత ఏంటి? శవం ఏంటి? అని దీప ఏసీపీ మేడమ్ ను అడగగానే… నీ భర్త మోనితను షూట్ చేసి చంపేసి శవాన్ని కూడా మాయం చేశాడు. అని ఏసీపీ చెప్పగానే.. దీప షాక్ అవుతుంది. నన్ను ఇంత మోసం చేసిన మోనితను చంపాలా? వద్దా? అంటూ కార్తీక్.. మోనిత గురించి దీపతో చెప్పిన విషయం దీపకు గుర్తుకు వస్తుంది. అంటే.. కార్తీక్ నిజంగానే మోనితను చంపేశాడా? అని తనలో తానే అనుకుంటుంది దీప.

karthika deepam 9 august 2021 monday episode 1113 highlights
ఇంతలో పోలీసులు వచ్చి కార్తీక్ ను పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్తుంటారు. అంతలోనే పిల్లలు ట్యూషన్ నుంచి వస్తారు. కార్తీక్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం చూసి షాక్ అవుతారు. వెక్కి వెక్కి ఏడుస్తారు. దీప కూడా వద్దు మేడమ్.. అంటూ ఎంత బతిమిలాడినా ఏసీపీ మేడమ్ అస్సలు కనికరం కూడా లేకుండా.. కార్తీక్ ను లాక్కెళ్లి.. పోలీస్ జీప్ లో పడేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుంది. అసలు.. ఏం జరిగింది? నిజంగానే కార్తీక్.. మోనితను చంపాడా? మోనిత శవం ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సోమవారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.

karthika deepam 9 august 2021 monday episode 1113 highlights
నిజంగానే కార్తీక్.. మోనితను చంపేశాడా? అందుకే మోనిత దగ్గరికి అంత ఆవేశంగా వెళ్లాడా? అనేది తెలియట్లేదు. మోనిత దగ్గరికి కార్తీక్ వెళ్లిన విషయం దీపకు తెలియదు. తన ఫ్రెండ్ ఎవరో చనిపోతే చూడటానికి వెళ్తున్నా… అని అబద్ధం చెప్పిన కార్తీక్.. మోనిత దగ్గరికి వెళ్లి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నన్ను ఇంత మోసం చేసి.. నాతో ఆడుకున్న ఆ మోనితను చంపాలా? వద్దా? అని కార్తీక్ కూడా దీపతో చాలా సార్లు అన్నాడు. మోనితను ఎలాగైనా చంపాలని కార్తీక్ కూడా ఆవేశంతో కారులో వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందనేది తెలియదు.
కార్తీక్ గన్ తీసుకొని వెళ్లాడా? నిజంగానే మోనితను షూట్ చేశాడా? ఆ తర్వాత ఏం జరిగింది? తనను చంపి తన శవాన్ని ఎక్కడ దాచాడు. అప్పుడు మోనిత ఇంట్లో ప్రియమణి లేదా? ప్రియమణి ఇదంతా చూసిందా? చూసి పోలీసులకు చెప్పిందా? అసలు.. కార్తీక్.. మోనితను చంపాడని రోషిణి మేడమ్ కు ఎలా తెలిసింది…. ఇలాంటి ఎన్నో విషయాలు ప్రస్తుతం ప్రేక్షకులకు వస్తున్న సందేహాలు. ఏది ఏమైనా.. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే సోమవారం ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయక తప్పదు.
ఇది కూడా చదవండి ==> మోనితను చంపినందుకు కార్తీక్ అరెస్ట్.. మోనిత శవాన్ని ఎక్కడ దాచావంటూ నిలదీసిన రోషిణి మేడమ్?
ఇది కూడా చదవండి ==> వంద మెట్లు ఎక్కేసిన కార్తీకదీపం మోనిత.. మంచితనానికి శోభా శెట్టి నిదర్శనం
ఇది కూడా చదవండి ==> మహేష్ బాబు లెవెల్‌లో బిల్డప్.. చివరకు గాలిదీసేసిన డాక్టర్ బాబు
ఇది కూడా చదవండి ==> వారి పట్ల నాకెప్పుడు విధేయత ఉంటుంది.. యాంకర్ అనసూయ అందాల జాతర