Karthika Deepam 9 July Today Episode : జ్వాలను తన ఇంటికి వెళ్లిపోవాలని ఇంద్రుడు, చంద్రమ్మ చెబుతారా? హిమ ఇంటికి వచ్చిన జ్వాల ఏం చేసింది? ఇంతలో మరో ట్విస్ట్

Authored By Varun G | The Telugu News | Updated on : 9 July 2022, 10:30 am

Karthika Deepam 9 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 జులై 2022, శనివారం ఎపిసోడ్ 1400 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాల పిన్ని, బాబాయికి అసలు విషయం తెలుస్తుంది. నువ్వు వాళ్ల దగ్గరికి వెళ్లొచ్చు కదా. వాళ్లు అంతలా బతిమిలాడుతున్నారు అని అడుగుతుంది చంద్రమ్మ. దీంతో ఏంటి పిన్ని మీరు కూడ నన్ను వెళ్లగొట్టాలని చూస్తున్నారా? నాకు ఉన్నది ఎవరు పిన్ని. మీరిద్దరే కదా. ఎప్పుడైతే ఆ ఇంట్లో నుంచి వచ్చేశానో.. అప్పుడే వాళ్లు నా వాళ్లు కాకుండా పోయారు అని అంటుంది జ్వాల. జరిగిందంతా మోసం. బంధాలు లేవు.. బంధువులు లేరు. రక్త సంబంధం అంతకన్నా లేదు. అందరూ స్వార్థపరులు తయారయ్యారు. ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్నారు. నాకు నా అన్న వాళ్లు ఎవరూ లేకముందే మీరు నన్ను దగ్గరికి తీశారు. మీ బిడ్డలా నన్ను చూసుకున్నారు. నేను ఎప్పటికీ మీదగ్గరే ఉంటాను పిన్ని. మీరు వెళ్లమన్నా కానీ.. నేను ఎక్కడికీ వెళ్లను అంటుంది జ్వాల.

karthika deepam 9 july 2022 full episode

karthika deepam 9 july 2022 full episode

దీంతో అది కాదురా.. ఇన్నాళ్లు నీకు ఎవ్వరూ లేరు అని అనుకున్నాం. పేదింట్లో పెంచాం. కానీ.. నువ్వు గొప్పింటి బిడ్డవు. అక్కడికి వెళ్లొచ్చు కదా అంటుంది చంద్రమ్మ. నేను ఎవరో తెలియకపోయినా నన్ను అక్కున చేర్చుకున్నారు. నేను ఎవరో తెలిసినా నన్ను వాళ్లు మోసం చేశారు. ఇంకోసారి నన్ను వాళ్లతో వెళ్లమనొద్దు. నేను మీతోనే ఉంటాను. నీళ్లు లేకుండా చేప బతకలేనట్టు.. ప్రేమ లేని చోట నేను బతకలేను పిన్ని అంటుంది జ్వాల. మరోవైపు స్వప్న.. వంట చేస్తూ ఉంటుంది. మనం ఇంకా పెళ్లి పనులు మొదలుపెట్టలేదు కదా అని స్వప్నను అడుగుతాడు నిరుపమ్. దీంతో వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేశాం కానీ.. వంట సంగతి మరిచిపోయాం కదా. మనింట్లో జరిగే మొదటి పెళ్లి కాబట్టి.. మంచి క్యాటరింగ్ వాళ్లను పిలిపిద్దాం అంటాడు నిరుపమ్.

ఈ పెళ్లికి ఇంత ఆర్భాటం అవసరమా అంటుంది స్వప్న. మమ్మీ.. హిమ ఆరోగ్యం గురించి బాధపడుతున్నావా అని అడుగుతాడు. దీంతో హిమకు ఏం కాదు. హిమను నేను బతికించుకుంటాను. ఎక్కడ అత్యుత్తమ ట్రీట్ మెంట్ ఉంటే అక్కడికి తీసుకెళ్లి బతికించుకుంటాను. ఇదంతా హిమ మీద ఉన్న ప్రేమతో చేస్తున్నాను అంటాడు నిరుపమ్.

ఏదో రెండు నెలలలో పోతుంది అని అనుకుంటే.. తనను బతికించుకుంటా అంటున్నాడు ఏంటి. ఇలా జరగడానికి వీలు లేదు. ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది స్వప్న. కట్ చేస్తే ఆటో నడిపేందుకు రెడీ అవుతుంది జ్వాల. అప్పుడే వెళ్తున్నావా.. రెండు ముద్దలు తిని వెళ్లు అని అడుగుతుంది చంద్రమ్మ.

దీంతో కాస్త తినవచ్చు కదా.. సూపర్ ఉంది దోసకాయ పచ్చడి అంటాడు ఇంద్రుడు. దీంతో జ్వాలకు కోపం వస్తుంది. దోసకాయ పచ్చడి ఎందుకు చేశారు.. అని కోప్పడుతుంది. దాన్ని మరిచిపోవడానికే బయటికి వెళ్తున్నాను. వెళ్లేముందే గుర్తు చేస్తారు.. చా అని అనుకొని వెళ్లబోతుంది.

Karthika Deepam 9 July Today Episode : వర్షంలో తడుస్తూ జ్వాల ఇంటి ముందే నిలుచున్న హిమ

జ్వాల డోర్ తీయగానే… అక్కడ ఎదురుగా హిమ కనిపిస్తుంది. ఏంటి నువ్వు ఇంటికి వెళ్లలేదా అని షాక్ అవుతుంది జ్వాల. వర్షంలో హిమ అలాగే తడుస్తూ ఉంటుంది. నీకేమైనా పిచ్చెక్కిందా.. వేషాలు వేస్తున్నావా అని అడుగుతుంది. దీంతో నాకు వేషాలు వేయడం అలవాటు లేదు అంటుంది హిమ.

ఇలా ఇంటి ముందు నిలుచొని ఎవరిని సాధిద్దామని అంటుంది. ఇంట్లోకి వెళ్దాం పదా నాకు చాలా చలిపెడుతోంది అంటుంది హిమ. దీంతో మీ ఇంటికే వెళ్దాం పదా అంటుంది జ్వాల. మీ ఇంటికి దారి చెప్పు అని అంటుంది. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అంటుంది జ్వాల.

నిరుపమ్ చాలా కాన్పిడెంట్ ఉన్నాడు. ఏం చేసి అయినా సరే హిమను బతికించుకుంటాను అంటున్నాడు అని శోభతో అంటుంది స్వప్న. దానికి ఏ క్యాన్సర్ లేదు. అదంతా అబద్ధం. ఈ విషయం మీకు నేను చెప్పలేను అని అనుకుంటుంది శోభ. నాకేం అర్థం కావడం లేదు అంటుంది శోభ.

కట్ చేస్తే జ్వాల.. హిమను తీసుకొని తన ఇంటికి వస్తుంది. ఇదే మన ఇల్లు రా అని అంటుంది హిమ. దీంతో మన ఇల్లు కాదు.. నీ ఇల్లు. ఏదో కారులో కలిశాం కదా అని.. కలుపుకుందాం అని అనుకోకు అంటుంది. ఇంట్లోకి రా అన్నా అస్సలు రాదు శౌర్య. హిమ ఎంత చెప్పినా వినకుండా జ్వాల అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి