karthika deepam Sourya : బికినీలో రెచ్చిపోయిన కార్తీక దీపం సౌర్య.. లుక్స్ కేక పెట్టిస్తున్నాయిగా..!
karthika deepam Sourya: కార్తీక దీపం సీరియల్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో హిమ, సౌర్యలు పెద్ద వాళ్లు కావడం తెలిసిందే.. అయితే అందులో హిమగా రాబోతున్న నటి.. ‘మనసిచ్చిచూడు’ హీరోయిన్ భాను(కీర్తీ బట్)గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరి ఆటో డ్రైవర్‌గా కనిపిస్తున్న సౌర్య ఎవరనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఆ కన్నడ ముద్దుగుమ్మ పేరు అమూల్య గౌడ. కర్ణాటకలోని మైసూర్‌లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. కన్నడలో ‘కమలి’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటి కాకముందు ‘యారిగుంటు యారిగిల్ల’ అనే టీవీ రియాలిటీ షోలో కనిపించింది. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది.
తెలుగు ‘కార్తీకదీపం’లానే కన్నడలో ‘కమలి’ అనే సీరియల్ చాలా పాపులర్. ఈ సీరియల్‌లో కమలిగా లీడ్ రోల్ చేసి.. 70 శాతంపైగా కన్నడ అభిమానుల్ని కూడగట్టుకుంది అమూల్య. ఆ సీరియల్ ప్రస్తుతం ‘జీ కన్నడ’లో కొనసాగుతోంది. కన్నడతో పాటు తమిళం, తెలుగు సీరియల్స్ వైపు దృష్టిపెట్టింది అమూల్య. అయితే సినిమాలంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందని.. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని అంటోంది ఈ అమ్మడు.తాజాగా సౌర్యకి సంబంధించి కొన్ని ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

karthika deepam new actress amulya omkar gowda aka sourya Stills viral
karthika deepam Sourya : సౌర్య అందాల రచ్చ..
ముఖ్యంగా బికినీలో ఈ ముద్దుగుమ్మ రచ్చ మాములుగా లేదు. బుల్లెట్ ఎక్కడం , బికినీలో అందాలు ఆరబోయడం మతులు పోగొడుతుంది.ఈ అమ్మడి అందాల ఆరబోత చూసి అందరు స్టన్ అవుతున్నారు. వామ్మో సౌర్య.. బికినీ సోకులు.. మందు, బుల్లెట్టుతో ఫోజులు ఏంటి ఈ హంగామా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే ఈ అమ్మడు రానున్న రోజులలో మరింత రచ్చ చేయనుందని తెలుస్తుంది. ప్రస్తుతం సౌర్యకు సంబంధించిన ఫొటోలు , వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.