Karthika Deepam Nirupam : నాకు అలాంటివి నచ్చవు.. వంటలక్కపై డాక్టర్ బాబు కౌంటర్లు.. నిరుపమ్ ఫన్నీ పోస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam Nirupam : నాకు అలాంటివి నచ్చవు.. వంటలక్కపై డాక్టర్ బాబు కౌంటర్లు.. నిరుపమ్ ఫన్నీ పోస్ట్

 Authored By prabhas | The Telugu News | Updated on :6 September 2022,2:00 pm

Karthika Deepam Nirupam : బుల్లితెర డాకర్ట బాబుగా నిరుపమ్ అసమానమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలకు నిరుపమ్ ప్రాణం పోసేశాడు. డాక్టర్ బాబు, వంటలక్కలుగా నిరుపమ్ ప్రేమీ విశ్వనాథ్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరూ లేకపోతే సీరియల్ ఎందుకూ పనికి రాదని, ఎవ్వరూ చూడరని జనాలు తేల్చి చెప్పేశారు. మధ్యలో ఈ ఇద్దరినీ తీసేసి.. కథను వేరే ట్రాక్ ఎక్కించేశారు. అయితే వంటలక్క, డాక్టర్ బాబు కనిపించకపోవడంతో జనాలు సీరియల్‌ను చూడటం మానేశారు. దీంతో టీఆర్పీ అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు కళ్లు తెరిచారు. మళ్లీ కథను వెనక్కి తిప్పారు.

గత్యంతరం లేక డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను బతికించి తీసుకొచ్చారు. దాంతో కథ మళ్లీ ట్రాక్ ఎక్కింది. టీఆర్పీ రేటింగ్స్ గాడిలో పడ్డాయి. అలా డాక్టర్ బాబు, వంటలక్కల పాత్రలో నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ అంతలా మార్క్ వేశారు. అయితే తాజాగా డాక్టర్ బాబు ఓ ఫన్నీ పోస్ట్ వేశాడు. మామూలుగానే నిరుపమ్ పరిటాల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. తన ప్రాసలు, పంచులతో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటాడు. టీచర్స్ డే సందర్భంగా నిరుపమ్ ఓ ఫోస్ట్ వేశాడు. అందులో వంటలక్క, తాను కలిసి ఆఫ్ స్క్రీన్‌లో అల్లరి చేస్తున్న ఫోటోను, వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేశాడు. టీచర్స్ డేకి నా ఫోటో ఎందుకు? అని అంటే వింటే గా.. అఫ్ కోర్స్ అన్నీ నేర్పించాను..

Karthika Deepam Nirupam Funny Post on Premi Viswanath about teachers day

Karthika Deepam Nirupam Funny Post on Premi Viswanath about teachers day

అయితేఏంటి.. మర్యాద అనేది మనసులో ఉంటే చాలు.. ఎందుకు ఈ ఫోటో తీసి అందరికీ చెప్పడం.. నాకు అసలే ఈ పబ్లిసిటీ అంటే నచ్చదు.. మీకు తెలుసుగా.. ఓ సారీ.. నేను అన్నీ చెప్పేశాను కదా? అంటూ తన సెటైర్లతో అందరినీ నవ్వించేస్తున్నాడు. ఈ పోస్ట్‌లో డాక్టర్ బాబు, వంటలక్క జాలీగా ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఆ కామెంట్‌ను చూసి డాక్టర్ బాబు టైమింగ్ వేరే లెవెల్ అంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు. డాక్టర్ బాబు రైటర్ అన్న సంగతి చాలా మందికి తెలిసిందే. అప్పుడప్పుడు సీరియల్స్‌కు మాటలు కూడా అందిస్తుంటాడు.

 

View this post on Instagram

 

A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala)

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది