karthika deepam : ఎంత బొక్కపడుతుందో!.. భార్య దెబ్బకు భయపడ్డ డాక్టర్ బాబు
karthika deepam : డాక్టర్ బాబుగా నిరుపమ్ ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. కార్తీకదీపం సీరియల్‌తో నిరుపమ్ బుల్లితెరపై స్టార్‌గా మారిపోయాడు. బుల్లితెర శోభన్ బాబు, సూపర్ స్టార్‌గా మారిన నిరుపమ్.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. సోషల్ మీడియాలో నిరుపమ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ప్రాసలతోనే పిచ్చెక్కిస్తాడు. నిరుపమ్ తండ్రి బుల్లితెరపై ఎన్నో ధారావాహికలకు రచయితగా వ్యవహరించాడు. ఆయన ఓ మంచి రచయిత. అలా నిరుపమ్ కూడా అప్పుడప్పుడు మాటలు రాస్తుంటాడు.
అలా డాక్టర్ బాబు మల్టీటాలెంటెడ్‌గా దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు యూట్యూబ్‌లో నిరుపమ్, తన భార్య మంజుల కలిసి చేస్తోన్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. మంజుల నిరుపమ్ యూట్యూబ్ చానెల్ ప్రస్తుతం మంచి ఫాంలో ఉంది. ఇందులో రకరకాల వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా దసరా స్పెషల్ చీరల షాపింగ్ చేసేశారు. .దాంతో పాటు ప్రకటన ఇస్తూ డబ్బులు కూడా సంపాదించేశారు.
karthika deepam భార్య షాపింగ్‌పై నిరుపమ్
అయితే ఆడవాళ్ల షాపింగ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆడవాళ్ల షాపింగ్ తలుచుకుంటూ మంజుల మీద నిరుపమ్ కౌంటర్లు వేశాడు. ఇక ఈ రోజు ఎంత బొక్క పడుతుందో అని భార్య షాపింగ్‌ను తలుచుకుని నిరుపమ్ భయపడ్డాడు. ఇలా పిలిచినప్పుడు నాకు తెలుసు.. ఇలాంటిదేదో బొక్క పెడుతుందని అంటూ మంజుల మీద సెటైర్లు వేశాడు.
