Karthika Deepam Nirupam : గోవాలో ఫ్యామిలీతో డాక్టర్ బాబు.. మంజులపై నిరుపమ్ సెటైర్ల దాడి

Authored By Sam C | The Telugu News | Published on: March 9, 2022, 5:00 pm

Karthika Deepam Nirupam : నిరుపమ్ పరిటాల అంటే అంద‌రికి అంతగా తెలియకపోవ‌చ్చు. బుల్లితెర డాక్టర్ బాబు అంటే మాత్రం ఏజ్ గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరి మదిలో ఆయన రూపం మెదులుతుంటుంది. ‘కార్తీకదీపం’ సీరియల్‌తో ఓ రేంజ్ పాపులారిటీ కూడగట్టుకున్నారు నిరుపమ్. బుల్లితెర శోభన్ బాబుగా అత‌డిని అభివ‌ర్ణిస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా స్పెషల్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు. ‘చంద్రముఖి’ అనే సీరియల్‌లో లీడ్ రోల్స్ పోషించిన నిరుపమ్ పరిటాల, మంజుల ఆ తర్వాత బాగా దగ్గరై పెళ్లి చేసుకున్నారు. ఈ సీరియల్ జరుగుతున్న సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇంట్లో వాళ్ళ అంగీకారంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ప్ర‌స్తుతం నిరుప‌మ్, మంజుల జంట గోవాలోచ‌క్క‌ర్లు కొడుతున్నారు. గోవాలో అన్ని ప్రాంతాల‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు అక్క‌డ మంజుల‌తో ఆయ‌న చేస్తున్న ర‌చ్చ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. మ‌రోవైపు మంజుల‌పై తెగ సెటైర్స్ వేస్తూ క‌నిపించాడు నిరుప‌మ్. అవేమి ప‌ట్టించుకోకుండా మంజుల మాత్రం తెగ ఎంజాయ్ చేస్తుంది. ప్ర‌స్తుతం వీడియో నెట్టింగ తెగ వైర‌ల్‌గా మారింది. నిరుపమ్భార్య మంజులనూ డాక్టర్ బాబు భార్యగా పిలుస్తుంటారు. అలా రీల్ లైఫ్ క్యారెక్టర్ రియల్ లైఫ్‌లోనూ ఎఫెక్ట్ చూపుతోంది. అలా మంజుల పరిటాలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

Karthika Deepam nirupam satires on manjula paritala

Karthika Deepam nirupam satires on manjula paritala

Karthika Deepam Nirupam : మంజుల‌, నిరుప‌మ్ ర‌చ్చ మాములుగా లేదు..

మంజుల పరిటాల సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య మంజుల తన ఫాలోవర్లో ముచ్చట్లు పెడుతున్నారు. ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు. అలా మంజుల తన పర్సనల్ విషయాలెన్నో కూడా బయపెట్టేశారు. తన చెల్లి, ఆమె ఫ్యామిలీ, ప్రేమ విషయాలను కూడా చెప్పేశారు.కార్తీకదీపం అంటే ఇష్టమా? హిట్లర్ గారి పెళ్లాం? ఇష్టమా? డాక్టర్ బాబు ఇష్టమా? హిట్లర్ క్యారెక్టర్ ఇష్టమా? అని రకరకాలుగా ప్రశ్నలు సంధించారు. కార్తీకదీపం కంటే హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌నే మంజుల ఎంచుకున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp