Karthika Deepam Makers : ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తున్న కార్తీకదీపం మేకర్స్‌ షాకింగ్ ప్రకటన..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 23 January 2023, 10:20 pm

Karthika Deepam Makers : తెలుగు టీవీ సీరియల్స్ చరిత్రలో కార్తీకదీపం కి వందల కొద్దీ పేజీలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఆ మాటకొస్తే తెలుగు బుల్లి తెర చరిత్రలోనే కాకుండా ఇండియన్ బుల్లి తెర చరిత్రలో కూడా ఒక అద్భుతమైన ఘన కీర్తిని సొంతం చేసుకున్న సీరియల్ మన కార్తీకదీపం. ఇండియన్‌ బుల్లి తెరపై వచ్చిన రామాయణం, మహాభారతం సీరియల్స్ ని పక్కన పెడితే ఇప్పటి వరకు ఏ ఒక్క ఇండియన్ సీరియల్ దక్కించుకొని అద్భుతమైన రికార్డును కార్తీక దీపం సీరియల్ దక్కించుకుంది. ఎన్నో అద్భుతమైన ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను అలరించిన కార్తీకదీపం ఈ మధ్య కాలంలో విసిగించింది అంటూ కొందరు కామెంట్ చేసినా.. కొందరు మాత్రం సీరియల్ ని అభిమానిస్తూనే ఉన్నారు.

దాదాపుగా 1600 ఎపిసోడ్స్ కి చేరువైన కార్తీక దీపం సీరియల్ ఇక రాదు అనే ప్రకటన అభిమానులను కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తోంది. డాక్టర్ బాబు, వంటలక్క, మౌనిత ఇలా ప్రతి ఒక్కరిని తమ ఇంట్లో వారీగా తెలుగు ప్రేక్షకులు చేసుకున్నారు. అలాంటి సీరియల్ ఇప్పుడు ఆగిపోతుంది అంటే ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. చాలా మంది కార్తీకదీపం సీరియల్ మరీ సాగదీస్తున్నారు అంటూ తిడుతూనే చూసేవారు. నెంబర్ వన్ రేటింగ్ సాధించిన కార్తీకదీపం సీరియల్ ని ఇంకా సాగదీయడం మావల్ల కాదు అంటూ దర్శక నిర్మాతలు చేతులు ఎత్తేసినట్లుగా అనిపిస్తుంది, అందుకే కార్తీకదీపం సీరియల్ కథ కంచికి చేరబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించేశారు.

Karthika Deepam serial Makers unit announcement

Karthika Deepam serial Makers unit announcement

దీప పాత్రలో నటించిన ప్రేమి ఆనంద్ ఈ సీరియల్ పూర్తి అవుతున్న నేపథ్యంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. కేవలం ఆమె మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది కార్తీక దీపం స్టార్స్ కూడా ఈ సీరియల్ అయిపోతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అతి త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తామంటూ ప్రేమి చెప్పడంతో కార్తీక్ దీపం యూనిట్ ఖచ్చితంగా కొత్త సీరియల్తో రాబోతుందని నమ్మకం ప్రేక్షకులకు కలుగుతుంది, ఆ సీరియల్ కార్తీకదీపం స్థాయిలో సక్సెస్ అవుతుందా అంటే కచ్చితంగా చెప్పలేం. అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి. కనుక కార్తీకదీపం వంటి అద్భుతమైన సీరియల్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఒక చరిత్ర ముగియబోతోంది. తెలుగు బుల్లితెర చరిత్రలో కార్తీకదీపం కథ కంచికి చేరబోతుంది.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి