karthika Deepam : డాక్టర్ బాబుపై కార్తీక దీపం వంటలక్క సెటైర్..వైరల్ అవుతోన్న నిరుపమ్ పోస్ట్..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 18, 2021, 5:40 pm

karthika Deepam : కార్తీకదీపం సీరియల్ గురించి, అందులో నటించే నటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అంత పాపులర్ ఆ సీరియల్. అందం, స్టేటస్ అనే కాన్సెప్ట్ తో మొదలైన ఈ సీరియల్ ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. సాయంత్రం అయితే తెలుగు మహిళామణులు అంతా టీవీలకు అతుక్కు పోతుంటారు. బుల్లితెర ఆడియన్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ కార్తీక దీపం కారెక్టర్లకు ఉండే క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్.. డాక్టర్ బాబు గా నిరుపమ్ పరిటాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

వీరివురిపై మీమ్స్ కూడా ఓ రేంజ్ లో వస్తాయని కొత్తగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ షూటింగ్ లతో కాలి సమయం అనేదే లేకుండా గడిపే ఈ ఇద్దరు సోషల్ మీడియాలో సూపర్ ఆక్టివ్ గా ఉంటారు. అయితే డాక్టర్ బాబు పోస్ట్ చేసిన ఓ ఫోటోతో పాటు ఆ ఫోటో కింద వంటలక్క ప్రేమి విశ్వనాథ్ పెట్టిన కామెంట్ ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బుల్లి తెరపై ఎప్పుడు తిట్టుకుంటూ ఉండే కార్తిక్ బాబు, వంటలక్క- దీప ఆన్ సెట్ లో మాత్రం తెగ అల్లరి చేస్తూ ఉంటారట. అలా షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫొటోస్ దిగి ఇన్ స్టా గ్రామ్ లో పెడుతుంటారు.

karthika Deepam serial premi vishwanath setires on nirupam went in social media

karthika Deepam serial premi vishwanath setires on nirupam went in social media

karthika Deepam : డాక్టర్ బాబుపై కార్తీక దీపం వంటలక్క సెటైర్..:

అయితే తాజాగా కార్తిక్ బాబు గా పిలవబడే నిరుపమ్ ప్రేమీ విశ్వనాథ్ మీద సెటైర్లు వేస్తూ ఓ పోస్ట్ వేశాడు. ఫోటో దిగుతుంటే మధ్యలో వస్తారు.. మళ్లీ ఇదేంటి ఇలా ఉందని అంటారు.. ఏంటో అసలు.. దీనికి మీరు క్యాప్షన్ చెప్పండి అంటూ తన అభిమానులతో తన బాధను పంచుకున్నాడు ఈ డాక్టర్ బాబు. ఇక తెర మీద భర్త అయిన నిరుపమ్ చేసిన ఈ పోస్ట్‌కు ప్రేమీ విశ్వనాథ్ కూడా అదే రేంజ్ లో రిప్లై ఇచ్చింది. పుష్పలో రష్మిక వలె… అయ్యా సామీ అని సరదాగా కామెంట్ చేసింది. ఇలా ఈ ఇద్దరిని ఇలా చూసి జనాలు మురిసిపోతోన్నారు. బయటి లాగే సీరియల్ లోనూ డాక్టర్ బాబు – దీప కలిసే ఉండేటట్లుగా చూపించ వచ్చుగా అని కోరుతున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp