Karthika Deepam : ఇల్లు పోయిందట!.. కార్తీకదీపం శౌర్యకు ఎంత కష్టమొచ్చే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam : ఇల్లు పోయిందట!.. కార్తీకదీపం శౌర్యకు ఎంత కష్టమొచ్చే

 Authored By bkalyan | The Telugu News | Updated on :26 September 2021,6:50 pm

Karthika Deepam కార్తీకదీపం సీరియల్‌‌లో శౌర్య పాత్రకు సంబంధించిన క్యారెక్టరైజేషన్, ఆ పాత్రను పోషిస్తున్న కృతిక గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. రౌడీ అంటూ ముద్దుగా డాక్టర్ బాబు పిలిచినా.. అత్తమ్మ అంటూ తన కూతురిని వంటలక్క పిలిచినా కూడా శౌర్య పాత్రలో కృతిక అదరగొట్టేస్తోంది. ఒకప్పుడు సీరియల్ మొత్తం శౌర్య, హిమల చుట్టే తిరిగింది. కానీ ఇప్పుడు కథ అంతా మారిపోయింది. మోనిత, కార్తీక్, దీపల చుట్టే తిరుగుతోంది.

karthika deepam shourya fame krithika with hanu raghavapudi

karthika deepam shourya fame krithika with hanu raghavapudi

జైలు, కోర్టు సీన్లు, చంపడం, హత్యాయత్న ప్రయత్నాలతోనే గత నెల అంతా గడిచింది. ఇక డాక్టర్ బాబు జైలు నుంచి బయటకు రావడం, మోనిత లోపలకి వెళ్లడంతో కథ మరో మలుపు తిరిగింది. మోనిత కడుపులోని బిడ్డ బయటకు వస్తే అనే ఆలోచనలతో డాక్టర్ బాబు సతమతమవుతున్నాడు. మొత్తానికి శౌర్య, హిమలకు కాస్త ప్రాధాన్యం తగ్గినట్టు కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరూ దూసుకుపోతోన్నారు. కృతిక, సహృద సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు.

 

karthika deepam shourya fame krithika with hanu raghavapudi

karthika deepam shourya fame krithika with hanu raghavapudi

దర్శకుడితో శౌర్య సెటైర్లు.. Karthika Deepam

కృతిక అయితే నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంటుంది. కామెడీ వీడియోలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా దర్శకుడు హను రాఘవపూడిని శౌర్య కలిసింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమ గాథ.. చిత్రంలో చిన్నారి చెప్పిన డైలాగ్‌ను చెప్పింది. మా ఇల్లు ఎక్కడో పోయింది, కనిపించడం లేదు, కొంచెం వెతికి పెట్టండి హను రాఘవపూడి సర్ అంటూ ఆ సీన్‌ను శౌర్య గుర్తుకు చేసింది. అలా శౌర్య వేసిన ఫన్నీ పోస్ట్‌కు నెటిజన్లు కూడా కౌంటర్లు ఇస్తున్నారు.

 

karthika deepam shourya fame krithika with hanu raghavapudi

karthika deepam shourya fame krithika with hanu raghavapudi

 

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది